‘విశేష’నామ సంవత్సరం | Festivals & holidays in year 2015 | Sakshi
Sakshi News home page

‘విశేష’నామ సంవత్సరం

Published Sat, Jan 3 2015 12:58 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

‘విశేష’నామ సంవత్సరం - Sakshi

‘విశేష’నామ సంవత్సరం

పండుగలు, సెలవులు వస్తున్నాయంటే ఆనందపడని వారెవరు?.. అంబరాన్నంటే సంబరాలతో మన ముంగిటికి విచ్చేసిన 2015 సంవత్సరం ప్రతి యేడు కంటే ఎక్కువ సెలవులు, ఎన్నో వింతలు, విశేషాలను తీసుక్చొంది. ఈ ఏడాది పండుల్లో చాలా వాటిని గురువారం ఆక్రమించగా నాలుగు నెలల్లో ఐదు ఆదివారాలు రావడం విశేషం. ఒకే రోజు రెండు పండుగలు వచ్చే సందర్భాలూ ఉన్నాయి. శని, సోమవారాల్లో కొన్ని పండగలు వచ్చి ఆదివారంతో కలిపి జంట సెలవులు ఇప్పిస్తున్నాయి. ముఖ్యమైన వైకుంఠ ఏకాదశి, మిలాద్ ఉన్ నబీ పండుగలు ఈ ఏడాదిలో రెండుసార్లు రావడం విశేషం.
 
అక్టోబర్‌లో 11 సెలవులు
అక్టోబర్‌లో ఆదివారాలతో కలిపి ఎనిమిది సెలవులు రాగా, ఐచ్ఛిక సెలవులతో కలిపితే 11 సెలవులు రావడం విశేషం. వీటికి తోడు దసరా సెలవులు.. వెరసి ఈ నెలంతా సెలవులే సెలవులు.
 
4 నెలల్లో 5 ఆదివారాలు
మార్చి, నవంబర్ నెలలు ఆదివారంతో ప్రారంభం అవుతుండగా మార్చి, మే, ఆగస్టు, నవంబర్ నెలల్లో ఐదేసి ఆదివారాలు వస్తున్నాయి.
 
రంజాన్, మొహర్రం శనివారమే
 ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం శుక్రవారంతో ప్రారంభమవుతుంది. వీరు అత్యంత పవిత్రంగా జరుపుకొనే రంజాన్, మొహ్రం పండగలు మాత్రం శనివారం వచ్చాయి.
 
ఒకేరోజు రెండు పండుగలు
⇒ఈ ఏడాది ఒకేరోజు రెండు పండుగలు.. అది కూడా ఐదు సందర్భాల్లో వస్తున్నాయి.
⇒జనవరి ఒకటి: నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి
⇒జనవరి 26: రథసప్తమి, గణతంత్ర దినోత్సవం
⇒మే 2: అన్నమయ్య జయంతి, బుద్ధ జయంతి
⇒సెప్టెంబర్ 24: బక్రీద్, ఓనమ్
⇒నవంబరు 25: కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి

ఎనిమిది జంట సెలవులు
⇒జనవరి 25 ఆదివారం, 26 సోమవారం గణతంత్ర దినోత్సవం
 ⇒మార్చి 28 శనివారం, 29 ఆదివారం శ్రీరామ నవమి
 ⇒జూలై 18 శనివారం రంజాన్, 19 ఆదివారం
⇒ఆగస్టు 15 శనివారం స్వాతంత్య్ర దినోత్సవం, 16 ఆదివారం
⇒సెప్టెంబర్ 5 శనివారం కృష్ణాష్టమి, 6 ఆదివారం
⇒అక్టోబర్ 24 శనివారం మొహర్రం, 25 ఆదివారం
⇒డిసెంబర్ 24 మిలాద్ ఉన్ నబీ, 25 క్రిస్మస్, 26 బాక్సింగ్ డే (ఐచ్ఛిక సెలవు), 27 ఆదివారం
 
గురువారానిదే ఆధిపత్యం
నూతన సంవత్సరం గురువారంతో ప్రారంభమై, గురువారంతోనే (డిసెంబర్ 31) ముగు స్తుంది. అందుకేనేమో ఈ ఏడాది గురువారం ఆధిపత్యం కొనసాగనుంది. రెండు సంప్రదాయ పండుగలతో పాటు చిన్నాపెద్దా కలిపి మొత్తం 14 పండుగలు గురువారం రోజే వస్తున్నాయి. సంక్రాంతి, దసరా గురువారమే వచ్చాయి. 10 పండుగలతో శుక్రవారం రెండో స్థానంలో ఉంది. శనివారం 9 పండుగలు, బుధవారం 7, ఆది, సోమవారాల్లో 5, మంగళవారం 4 పండుగలు రానున్నాయి.
 
ఒకే పండుగ రెండుసార్లు
సాధారణంగా ఏ పండుగైనా ఏడాదిలో ఒకసారే వస్తుంది. ఈ ఏడాది మాత్రం రెండు పండుగలు రెండేసిసార్లు రావడం అరుదైన విషయం.
⇒ వైకుంఠ ఏకాదశి: జనవరి 1, డిసెంబర్ 21
⇒మిలాద్ ఉన్ నబీ: జనవరి 4, డిసెంబర్ 24
 
18 ఏళ్ల తర్వాత...మళ్లీ అవే రోజులు
ఈ ఏడాది కాలెండర్‌లో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. 1997వ సంవత్సరంలోని కొన్ని ఆసక్తికర తేదీలు, వారాలు తిరిగి 18 ఏళ్ల తర్వాతఈ ఏడాది వచ్చాయి. వాటిని పరిశీలిస్తే... 4-04-2015, 6-06-2015, 8-08-2015, 10-10-2015, 12-12-2015 రోజులు శనివారాలుగాఉన్నాయి. ఒకే తేదీ... నెల సంఖ్యలు కలిసి వచ్చాయి. ఇవే తేదీలు, వారాలు 1997లో కనిపించాయి. అంటే 18 ఏళ్ల తర్వాత మళ్లీ అవే తేదీలు..అవే రోజులు రావడం ఈ ఏడాది క్యాలెండర్‌లో ప్రత్యేకత .

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement