
సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ
- ఇన్‌చార్జ్ డీఎస్పీ షేక్‌లాల్ అహ్మద్
- ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి
- సమష్టి కృషితో ముందుకు సాగాలి
- పట్టణంలో పీస్ కమిటీ సమావేశాలు
సిద్దిపేట జోన్: ప్రశాంత వాతావరణంలో వినాయకచవితి, బక్రీద్ పర్వదినాలను జరుపుకొని సిద్దిపేట గౌరవాన్ని కపాడుకుందామని ఇన్‌చార్జ్ డీఎస్పీ షేక్‌లాల్ అహ్మద్ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం ఆర్డీఓ కార్యాలయంలో, శివమ్స్ గార్డెన్‌లో పీస్ కమిటీ సమావేశాలు నిర్వహించారు. ఆయా సమావేశాలల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు సమష్టిగా పని చేయాలన్నారు. మండపాలు ఏర్పాటు చేసిన వారు స్థానిక పోలీస్ స్టేషన్‌లో అనుమతి తీసుకోవాలన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ రమణాచారి, ఆర్టీఏ ఏసురత్నం, ఆర్‌అండ్‌బీ ఈఈ బాల్ నర్సయ్య మాట్లాడారు.
నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నట్లు చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. ఆదివారం మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటలోని కోమటి చెరువును సందర్శించి ఏర్పాట్లపై సూచనలు ఇవ్వడం జరుగుతుందన్నారు.
కార్యక్రమంలో సిద్దిపేట తహసీల్దార్ శ్రీనివాస్, నీటి పారుల శాఖ ఏఈ విష్ణువర్ధన్, ట్రాన్స్‌కో డీఈ శ్రీనివాస్‌రెడ్డి, సీఐలు సురేందర్‌రెడ్డి, సైదులు, ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్, ఫైర్ ఆఫీసర్ శ్రావణ్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ కృష్ణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అక్తర్, కౌన్సిలర్లు జావేద్, మోహిస్, పట్టణ ప్రముఖులు గుండ్ల జనార్దన్, దరిపల్లి చంద్రం, రమేష్, ఐతే బాల్‌రాజేశం, సజ్జు లతీఫ్, మోహినొద్దీన్, ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు.