ఈ పూలు.. కనకమే! | Increaseing flower prices rates | Sakshi
Sakshi News home page

ఈ పూలు.. కనకమే!

Published Fri, Aug 8 2014 12:21 AM | Last Updated on Sat, Sep 2 2017 11:32 AM

Increaseing flower prices rates

ఆదోని రూరల్: శ్రావణ మాసంలో ఇష్టదైవానికిపూజలు చేయాలంటే హిందువులు భయపడుతున్నారు. శుభకార్యాలు చేసేవారు సైతం ఖర్చు పెరుగుతుందేమోనని ఆలోచిస్తున్నారు. పూల ధరలుఅమాంతంగా పెరగడమే ఇందుకు కారణం.మొన్నటి వరకు కిలో రూ. 250లోపు ఉన్న కనకాంబరాల ధర ఒక్కసారిగా రూ. 450కి చేరింది.మార్కెట్‌లో మూర పూలు రూ.25 పలుకుతున్నాయి.
 
 ఈ ధర ఇంకా పెరిగే అవకాశం ఉందనివ్యాపారులు చెబుతున్నారు. పెళ్లిళ్లు, శ్రావణమాసం రావడంతో పూలకు గిరాకీ పెరిగిందనిచెబుతున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో సాగు ఆశాజనకంగా లేకపోవడం కూడా మరో కారణంగాతెలుస్తోంది. ఇదిలా ఉండగా ఆదోని మండలపరిధిలో పాండవగల్, కుప్పగల్, పెద్దతుంబళం,బల్లేకల్, కౌతాళం మండలంలోని ఎరిగేరతో పాటుమరికొన్ని గ్రామాల్లో వంద ఎకరాలకు పైగానే కనకాంబరాలను బోర్లకింద రైతులు సాగుచేస్తున్నారు.ఆషాఢ మాసంలో గిరాకీ లేక కేజీ రూ. 100ప్రకారం అమ్ముకున్నారు. రెండు రోజులుగా మంచిధర రావడంతో రైతులు సంతోషిస్తున్నారు. ఇదే ధరనిలకడగా ఉండకపోవచ్చని చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement