ఆరోగ్యానికి సెనగలు | Health senagalu | Sakshi
Sakshi News home page

ఆరోగ్యానికి సెనగలు

Published Fri, Aug 1 2014 11:22 PM | Last Updated on Sat, Sep 2 2017 11:14 AM

Health senagalu

శ్రావణ మాసం... ఇంటింటా సెనగలు కొలువుతీరే మాసం...
 నోములు... వ్రతాలు... పూజలు... పండుగలు...
 ఇళ్లన్నీ ఆకుపచ్చని తోరణాలు, పసుపు పచ్చని చేమంతులతో కళకళలాడుతుంటాయి...
 ఎవరో ఒక అతిథి ఇంటికి రావడం... వాయినాలు ఇవ్వడం... పుచ్చుకోవడం...
 ఏదైతేనేం... ఇల్లంతా సెనగలే సెనగలు...
 ఒక్కసారి ఆలోచనకు పదును పెట్టండి... సెనగలతో వంటలను అలంకరించండి...
 సంప్రదాయంగా చేసే హయగ్రీవతో పాటు...
 పాఠోళీ, గుత్తి కూరలు... ఎన్నో... ఎన్నెన్నో చేసుకుందాం...
 శరీరానికే కాదు ఆరోగ్యానికి కూడా నగలు సమకూర్చుకుందాం...

 
సెనగల కూర


 కావ లసినవి:
 సెనగలు - కప్పు; పసుపు - పావు టీ స్పూను; ఉల్లి తరుగు - అర కప్పు; చిన్న ఉల్లిపాయలు - 4 (సూపర్ మార్కెట్‌లో దొరుకుతాయి); పచ్చి మిర్చి - 3 (పొడవుగా మధ్యకు కట్ చేయాలి); కరివేపాకు - 4 రె మ్మలు; మిరప్పొడి - టీ స్పూను; పసుపు - టీ స్పూను; ఎండు మిర్చి - 2; కొబ్బరి తురుము - అర కప్పు; చిన్న ఉల్లిపాయలు - 2 (సన్నగా తరగాలి); ధనియాలు - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు (ధనియాల పొడి కూడా వాడుకోవచ్చు)
 
మసాలా కోసం: సోంపు - పావు టీ స్పూను, ఏలకులు - 2, లవంగాలు - 3, దాల్చినచెక్క - చిన్న ముక్క, మిరియాలు - నాలుగు గింజలు
 
 తయారి:
 సెనగలను ముందు రోజు రాత్రి నానబెట్టాలి  
 
 మరుసటి రోజు ఒక గిన్నెలో... నానబెట్టిన సెనగలు, ఉప్పు, పసుపు వేసి కుకర్‌లో ఉడికించాలి (ఉడికించిన నీళ్లను పక్కన ఉంచి, గ్రేవీ కోసం వాడుకోవాలి)  
 
 బాణలిలో టీ స్పూను నూనె వేసి కాగాక ధనియాలతో పాటు మిగిలిన మసాలా దినుసులు కూడా వేసి వేయించాలి  
 
 చిన్న ఉల్లిపాయల తరుగు జత చేసి బాగా వేయించాక, కొబ్బరి తురుము వేసి గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించి, దించి చల్లారాక, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి  
 
 మరొక బాణలిలో కొబ్బరి నూనె వేసి కాగాక, ఆవాలు, ఎండు మిర్చి వేసి వేయించాలి   
 ఉల్లి తరుగు, చిన్న ఉల్లిపాయల తరుగు, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు వేసి వేయించాలి  
 
 పసుపు, మిరప్పొడి జత చేసి కొద్ది సేపు వేయించి, ఉడికించి ఉంచుకున్న నీళ్లు పోసి, మరిగాక కొబ్బరి పేస్ట్, ఉడికించిన సెనగలు వేసి బాగా కలిపి ఐదు నిమిషాలు ఉడికించాలి.
 
 బెండకాయ గుత్తి కూర
 
 కావలసినవి:
 బెండకాయలు - పావు కేజీ; నూనె - టేబుల్ స్పూను; స్టఫింగ్ కోసం: సెనగలు - కప్పు (ఉడికించి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి); పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు (వేయించాలి); నువ్వులు - టేబుల్ స్పూను (వేయించాలి); అవిసె గింజలు - టేబుల్ స్పూను (వేయించాలి); పచ్చి మిర్చి ముద్ద - 2 టేబుల్ స్పూన్లు; అల్లం వెల్లుల్లి ముద్ద - 2 టీ స్పూన్లు; పసుపు - పావు టీ స్పూను; నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర - గుప్పెడు; ఉప్పు - తగినంత
 
 తయారి:  
 అవిసె గింజలు, నువ్వు పప్పు, పల్లీలను విడివిడిగా మిక్సీలో వేసి పొడి చేసి పక్కన ఉంచాలి  
 
 ఒక పాత్రలో... తయారుచేసి ఉంచుకున్న సెనగల ముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చి మిర్చి ముద్ద, పసుపు, నిమ్మరసం, కొత్తిమీర, ఉప్పు వేసి అన్నీ కలిసేలా కలపాలి  
 
 బెండకాయలను శుభ్రంగా కడిగి తడిపోయే వరకు ఆరబెట్టి, రెండు వైపులా తొడిమలు తీసి, మధ్యకు గాటు పెట్టాలి. (బెండకాయ ముక్కలు కాకుండా జాగ్రత్త పడాలి)  
 
 ముందుగా తయారుచేసి ఉంచుకున్న స్టఫింగ్ మిశ్రమాన్ని బెండకాయలలో జాగ్రత్తగా స్టఫ్ చేయాలి  
 
 వెడల్పాటి బాణలిలో నూనె వేసి కాగాక బెండకాయలను ఒక్కొక్కటిగా వేసి, బాగా కలిపి మూత పెట్టి పది నిమిషాలు ఉంచాలి   
 
 పల్లీ, నువ్వులు, అవిసె గింజల పొడుల మిశ్రమం వేసి కలిపి దించేయాలి.
 
 పాఠోళీ
 
 కావ లసినవి:
 సెనగలు - రెండు కప్పులు; ఉల్లి తరుగు - కప్పు; పచ్చి మిర్చి తరుగు - 3 టీ స్పూన్లు; కరివేపాకు - 4 రెమ్మలు; అల్లం తురుము - టీ స్పూను; నూనె - చిన్న గిన్నెడు; ఎండు మిర్చి - 4; సెనగపప్పు - 2 టీ స్పూన్లు; మినప్పప్పు - 2 టీ స్పూన్లు; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను, ఉప్పు - తగినంత
 
 తయారి:
 సెనగలను ముందు రోజు రాత్రి నీళ్లలో నానబెట్టాలి  
 
 మరుసటి రోజు నీరు తీసేసి... అల్లం తురుము, పచ్చి మిర్చి, ఉప్పు జత చేసి మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి  
 
 బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక, సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి  
 
 కరివేపాకు, ఉల్లి తరుగు వేసి బాగా వేగాక, సెనగల ముద్ద వేసి కలిపి మూత ఉంచాలి (సన్నని మంట మీద మాత్రమే చేయాలి)  
 
 మధ్యమధ్యలో బాగా కలుపుతూ నూనె జత చేస్తుండాలి  
 
 బాగా విడివిడిగా అయ్యేవరకు ఉంచి దించేయాలి  
 
 ఇది అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది.
 
 హయగ్రీవ
 
 కావలసినవి:
 సెనగలు - కప్పు; బెల్లం తురుము - ఒకటిన్నర కప్పులు; కొబ్బరి తురుము - అర కప్పుస; ఏలకుల పొడి - టీ స్పూను; నెయ్యి - టేబుల్ స్పూను; జీడిపప్పు పలుకులు - 10; కిస్‌మిస్ - రెండు టేబుల్ స్పూన్లు
 
 తయారి:
 నానబెట్టి ఉంచుకున్న సెనగలకు రెండు కప్పులు నీళ్లు జత చేసి ఉడికించాలి  
 
ఒక పెద్ద పాత్రలో ఉడికించి ఉంచుకున్న సెనగలు, బెల్లం తురుము, కొబ్బరి తురుము, ఏలకుల పొడి వేసి స్టౌ మీద ఉంచాలి. (మంట బాగా తగ్గించాలి)  
 
 బెల్లం పూర్తిగా కరిగి మిశ్రమం చిక్కబడ్డాక దింపేయాలి  
 
 చిన్న బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడిపప్పు పలుకులు, కిస్‌మిస్ వేసి వేయించి, సిద్ధంగా ఉన్న హయగ్రీవలో వేసి కలపాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement