Senagalu
-
సెనగల సౌభాగ్యం
అనాదిగా వస్తున్న ఆహారపు దినుసులలో ఎన్నో పంటలకు కాణాచి మన భారతదేశం. వాటిలో ఒకటి సెనగలు. వీటిని సంస్కృతంలో ‘చణకః’ అంటారు. దీని విశిష్టతను, ప్రయోజనాలను ఆయుర్వేదం కూలంకషంగా వివరించింది. దీనికున్న మరి కొన్ని ముఖ్య పర్యాయ పదాలు: ‘‘హరిమంథ, సకలప్రియ, జీవన, కంచుకీ, బాల భోజ్య’’ మొదలైనవి. హిందీలో చెన్నా, ఛోలే అంటారు. దీనికి బెంగాల్ గ్రామ్, చిక్ పీజ్ అనేవి వ్యవహారిక ఆంగ్లపదాలు. వృక్షశాస్త్రంలో సీసెర్ యెరిటీనమ్ అంటారు. ఇవి చిన్నవిగాను, పెద్దవిగాను రెండు పరిమాణాల్లో కనిపిస్తుంటాయి. పెద్దవి కొద్దిగా తెల్ల రంగులో ఉంటాయి. వీటినే కాబూలీ సెనగలు అంటారు. చిన్నవాటిని దేశీ సెనగలు అంటారు. ఇవి నలుపు, ఎరుపు, పసుపు పచ్చ, ఆకు పచ్చ, మట్టి రంగులలో ఉంటాయి. ఈ పంటకు తేమ లేని శీతల వాతావరణం పెట్టింది పేరు. పూర్తిగా పక్వం కాకుండానే వేళ్లతో బాటు మొక్కల్ని పీకి బజారులో అమ్మడం, కాయల నుండి పచ్చి సెనగల్ని వేరు చేసి తినటం మనం చూస్తూనే ఉంటాం. గుణధర్మాలు (భావప్రకాశ సంహితా): ‘‘చణకః శీతలో రూక్షః పిత్త రక్త కఫాపహః‘ లఘుః కషాయో విష్టంభీ వాతలో జ్వర నాశనః‘‘ ఆర్ద్రో అతికోమలో రుచ్యః పిత్త శుక్ర హరోః‘ హిమః కషాయో వాతలో గ్రాహా కఫపిత్తహరో లఘుః‘‘ ఎండబెట్టబడి, శుష్కంగా ఉన్నవి రూక్ష (గట్టిగా) గుణం కలిగి, కొంచెం వగరుగా ఉంటాయి. నానబెట్టిన అనంతరం మృదువుగా రుచికరంగా ఉంటాయి. సునాయాసంగా జీర్ణమై చలవ చేస్తాయి (లఘు, శీతలం). వాతాన్ని పెంచుతాయి. పిత్తకఫాలను హరిస్తాయి. కనుక పొట్టలో వాయువు చేరి ఉబ్బరించినట్లుండి, మలబంధం కలుగ చేస్తుంది. శరీరానికి చలవ చేసి రక్తస్రావాలను అరికడుతుంది. కఫాన్ని తగ్గిస్తుంది. ఎక్కువగా విరేచనాలైతే అవి అరికట్టబడతాయి (గ్రాహి). శుక్రహరం. నానబెట్టిన పిదప సాతాళించిన (వేడి చేసిన) సెనగలు బలకరం. ఔషధ ప్రయోజనాలు: సెనగలతో చేసిన సూప్ (యూషం) తీవ్ర జ్వరాన్ని, శరీరంలో మంటనీ తగ్గిస్తుంది. సెనగ పిండికి చేదు పొట్ల (పటోల) ఆకులను చేర్చి చేసిన సూప్ కడుపు నొప్పి, కడుపులోని పుళ్లు (అల్సర్లు), మంటను తగ్గిస్తుంది. ధనియాలు, వట్టి వేళ్లు, సెనగలతో చేసిన సూప్ వాంతులను తగ్గిస్తుంది. శరీర దాహాన్ని (మంటను) అరికడుతుంది. స్నుïß æక్షీరం (బ్రహ్మ జెముడు జాతికి చెందిన స్నుహీ అనబడే మొక్క యొక్క పాలు) లో నానబెట్టిన సెనగల్ని వేడి చేసి తింటే తీక్ష›్ణవిరేచనంగా పనిచేసి కోష్ఠ (కడుపు లోపలి భాగం) శుద్ధి చేస్తుంది. ఆధునిక జీవ రసాయన శాస్త్రం రీత్యా: సెనగలలో 55 శాతం పిండిపదార్థాలు, 20 శాతం ప్రొటీన్లు, 5 శాతం కొవ్వులు ఉంటాయి. ఆహారపు పీచు అధికంగా ఉంటుంది. క్యాల్షియం, ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉంటాయి. ఐరన్ కూడా అధికం. సోడియం, పొటాషియం... ఈ రెండూ శూన్యం. ఇందులో ‘ఎ’ విటమిను ఉండదు. ‘సి’ కొంచెం ఉంటుంది. ‘కె’ మరియు ‘ఫొలేట్సు’ బాగానే ఉంటాయి. సెలీనియం, కోలిన్ ఉంటాయి. నిద్రాజనకమే కాకుండా, బుద్ధి వికాసం, చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించే గుణం, నొప్పులు, వాపులు తగ్గించే గుణం కూడా ఉన్నాయి. ఎముకల పుష్టికి పెట్టింది పేరు. లివరు జబ్బులు, క్యాన్సర్లలో కూడా గుణకారి. మధుమేహం, రక్తపోటు వ్యాధిగ్రస్థులు కూడా తినొచ్చు. సెనగలు ఆ వ్యాధుల్ని పెంచవు. గుర్తు ఉంచుకోవలసిన సారాంశం నానబెట్టిన సెనగలు నాణ్యమోయి మెదడుకు ఎముక పుష్టికి మేలు చేయు చలువ చేయుచు దేహమున్ శాంతపరచు సూపు తీరున సేవింప సులభమౌను మలము బంధించు నిదియని మరువకోయి శుంఠి కలుపంగ కోష్ఠమ్ము శుద్ధియౌను వీర్యహరమంచు మదిలోన బెంగయేలపాలు బాదము ఖర్జూర పాయసమ్ము పట్టు పట్టంగ పరువమ్ము పరుగులెత్తు. – డా. వృద్ధుల లక్ష్మీనరసింహ శాస్త్రి, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు -
సెనఘనగ
చిరుతిండ్లలో సెనగలు ఘనమైనవి. నానబెట్టి, ఉడకబెట్టి వండితే తప్ప పంటికి లోబడవు ఒంటికి కట్టుబడవు. ఇది శ్రావణ మాసం... ఇంటింటా సెనగలు వానజల్లులా వచ్చిపడే మాసం... మరెందుకాలస్యం... ఉడికించండి, వెరైటీగా ఆరగించండి. చెన్నా మసాలా సాండ్విచ్ కావలసినవి: బ్రెడ్ స్లయిసెస్ – ఆరు; చెన్నా మసాలా – అర కప్పు; ఉల్లి తరుగు – అర కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; క్యాప్సికమ్ తరుగు – పావు కప్పు; చాట్ మసాలా – ఒక టీ స్పూను; వేయించిన జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; నల్ల ఉప్పు – కొద్దిగా; బటర్ – కొద్దిగా. చెన్నా సాండ్విచ్ను... టొమాటో సాస్, గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీలతో కలిపి తింటే బాగుంటుంది. తయారీ: ∙ బ్రెడ్ స్లయిసుల అంచులను కట్ చేయాలి ∙బటర్‌ను స్లయిసుల మీద చాకుతో సమానంగా పూయాలి ∙ రెండు టేబుల్ స్పూన్ల చెన్నా మసాలా వాటి మీద ఉంచాలి ∙ వాటి మీద ఉల్లి చక్రాలు, టొమాటో చక్రాలు, క్యాప్సికమ్ చక్రాలు ఉంచాలి ∙ వాటి మీద కొద్దిగా చాట్ మసాలా, జీలకర్ర పొడి చల్లాలి ∙మరొక బ్రెడ్ స్లయిస్‌ను దాని మీద ఉంచాలి ∙ గ్రిల్ మీద బంగారు రంగులోకి వచ్చేవరకు కాల్చాలి (పెనం మీద కూడా కాల్చుకోవచ్చు) ∙వేడి వేడి సాండ్విచ్లను, గ్రీన్ చట్నీ లేదా టొమాటో సాస్ లేదా స్వీట్ చట్నీతో అందించాలి. చోలే పులావ్ కావలసినవి: కాబూలీ సెనగలు – ముప్పావు కప్పు; బాస్మతి బియ్యం – పావు కేజీ; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; మిరప కారం – పావు టీ స్పూను; గరం మసాలా – చిటికెడు; పసుపు – చిటికెడు; కుంకుమ పువ్వు – కొద్దిగా; నిమ్మ రసం – అర టీ స్పూను; నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు; పుదీనా ఆకులు – గార్నిషింగ్ కోసం కొద్దిగా; ఉప్పు – తగినంత; మసాలా దినుసులు ... షాజీరా – అర టీ స్పూను; ఏలకులు – 2; జాపత్రి – కొద్దిగా; బిర్యానీ ఆకు – 1; లవంగాలు – 2; దాల్చిన చెక్క – చిన్న ముక్క గ్రీన్ పేస్ట్ కోసం... అల్లం తురుము – ఒక టీ స్పూను; వెల్లుల్లి రెబ్బలు – 4; పుదీనా ఆకులు – ఒక టేబుల్ స్పూను; కొత్తిమీర తరుగు – మూడు టేబుల్ స్పూన్లు; పచ్చి మిర్చి – ఒకటి. తయారీ: ♦ కాబూలీ సెనగలను ముందు రోజు రాత్రి నానబెట్టి, మరుసటి రోజు ఉదయం నీరు ఒంపేసి, రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి ♦ కుకర్‌లో కాబూలీ సెనగలు, కొద్దిగా ఉప్పు, తగినన్ని నీళ్లు జత చేసి మూత పెట్టి, 10 విజిల్స్ వచ్చేవరకు ఉంచి దింపేయాలి ♦ విజిల్ తీశాక నీరు ఒంపేసి కాబూలీ సెనగలను పక్కన ఉంచాలి ♦ బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి, తగిన ంత నీటిలో సుమారు అరగంట సేపు బియ్యం నానబెట్టాలి ♦ గ్రీన్ పేస్ట్ కోసం చెప్పిన పదార్థాలను మిక్సీలో వేసి మెత్తగా చేసి, పక్కన ఉంచాలి. పులావ్ తయారీ: ♦ ప్రెజర్ కుకర్‌ను స్టౌ మీద ఉంచి వేడెక్కిన తరవాత నెయ్యి వేసి కరిగాక షాజీరా, ఏలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు వంటి మసాలా దినుసులు వేసి వేయించాలి ♦ బాగా వేగిన తరవాత ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ♦ పచ్చి బఠాణీ జత చేసి కొద్దిగా వేయించిన తరవాత అల్లం + వెల్లుల్లి ముద్ద, టొమాటో తరుగు వేసి వేయించాలి ♦ పసుపు, మిరప కారం, గరం మసాలా పొడి జత చేసి బాగా వేయించాలి ♦ బాస్మతి బియ్యం జత చేసి బాగా కలియబెట్టాలి ♦ నానబెట్టిన సెనగలను జత చేయాలి ♦ నిమ్మ రసం, కుంకుమ పువ్వు జత చేసి బాగా కలిపి, తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చాక దింపేయాలి ♦ ఆవిరి పోయిన తరవాత మూత తీసి, చెన్నా పులావ్‌ను గరిటెతో జాగ్రత్తగా కలపాలి ♦ కొత్తిమీర లేదా పుదీనా ఆకులతో అందంగా అలంకరించాలి ♦ వెజ్ సలాడ్ లేదా రైతా లేదా పాపడ్లతో అందించాలి. పాలక్ చోలే కావలసినవి: పాలకూర – 5 కట్టలు(శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి); కాబూలీ సెనగలు – ఒక కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; నీళ్లు – 2 కప్పులు; నూనె – 4 టేబుల్ స్పూన్లు; ఎండు దానిమ్మ గింజల పొడి – ముప్పావు టీ స్పూను; కసూరీ మేథీ – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత. పేస్ట్ కోసం... ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి – 2; వెల్లుల్లి రెబ్బలు – 4. పాలక్ చెన్నా మసాలా కోసం... దాల్చినచెక్క – చిన్న ముక్క; లవంగాలు – 3; ఏలకులు – 2; బిర్యానీ ఆకు – 1; పాలక్ చోలే మసాలా కోసం... జీలకర్ర పొడి – అర టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; మిరప కారం – అర టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; పంజాబీ గరం మసాలా పొడి – ముప్పావు టీ స్పూను. తయారీ: ♦ కాబూలీ సెనగలను ముందురోజు రాత్రి నానబెట్టాలి ♦ మరుసటి రోజు ఉదయం నీరు ఒంపేసి, మూడుసార్లు బాగా కడిగి, నాలుగు కప్పుల నీరు, ఉప్పు జత చేసి కుకర్‌లో ఉంచి, స్టౌ మీద పెట్టి, పది విజిల్స్ వచ్చాక దింపేయాలి ♦ మిక్సీలో ఉల్లి తరుగు, పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ♦ టొమాటోలను మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి. పాలక్ చోలే తయారీ: ♦ స్టౌ మీద బాణలిలో నూనె వేసి వేగాక మసాలా వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ♦ ఉల్లి ముద్ద జత చేసి మరోమారు బాగా వేయించాలి ♦ టొమాటో ప్యూరీ జత చేసి బాగా వేయించాలి ♦ నూనె విడిపడిన తరవాత పాలకూర తరుగు జత చేయాలి ♦ ఉడికించిన కాబూలీ సెనగలను జత చేసి బాగా కలిపి, రెండు కప్పుల నీళ్లు పోయాలి ♦ ఎండు దానిమ్మ గింజల పొడి వేసి మరోమారు కలపాలి ♦ చివరగా కసూరీ మేథీ జత చేసి రెండు నిమిషాల తరవాత దింపేయాలి ♦ రోటీ, పూరీలలోకి రుచిగా ఉంటుంది. చెన్నా మసాలా కావలసినవి: కాబూలీ సెనగలు (చెన్నా) – ఒక కప్పు; నీళ్లు – 3 కప్పులు; ఉప్పు – అర టీ స్పూను; మసాలా కోసం... పచ్చి కొబ్బరి తురుము – ఒక కప్పు; దాల్చిన చెక్క – చిన్న ముక్క; సోంపు – అర టేబుల్ స్పూను; జీలకర్ర – అర టేబుల్ స్పూను; ధనియాలు – ఒక టేబుల్ స్పూను; ఎండు మిర్చి – 4; లవంగాలు – 2; ఏలకులు – 3; మిరియాలు – 5; చెన్నా మసాలా కోసం... నూనె – 3 టేబుల్ స్పూన్లు; బిర్యానీ ఆకు – 1; ఆవాలు – అర టీ స్పూను; కరివేపాకు – రెండు రెబ్బలు; పచ్చి మిర్చి – 1 ; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; పసుపు – అర టీ స్పూను; ఇంగువ – చిటికెడు; అల్లం + వెల్లుల్లి – ఒక టీ స్పూను; నీళ్లు – ఒక కప్పు; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత. తయారీ: ♦ ముందుగా కాబూలీ సెనగలను శుభ్రంగా కడిగి ముందురోజు రాత్రి నానబెట్టి, మరుసటి రోజు నీళ్లు ఒంపేసి, తగినన్ని నీళ్లు, ఉప్పు జత చేసి కుకర్‌లో ఉంచి, సన్నటి మంట మీద సుమారు 20 విజిల్స్ వచ్చేవరకు ఉడికించి దింపేయాలి. మసాలా తయారీ: ♦ స్టౌ మీద బాణలి ఉంచి, మసాలా కోసం చెప్పిన దినుసులన్నీ (పచ్చి కొబ్బరి తురుము మినహా) వేసి వేయించాలి ♦ అర కప్పు పచ్చి కొబ్బరి తురుము జత చేసి ఆపకుండా కలుపుతుండాలి ♦ బాగా వేగిన తరవాత దింపి చల్లారనివ్వాలి ♦ మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. చెన్నా మసాలా గ్రేవీ తయారీ: ♦ స్టౌ మీద బాణలిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక, ఆవాలు వేసి చిటపటలాడేవరకు వేయించాలి ♦బిర్యానీ ఆకు జత చేసి మరోమారు వేయించాలి ♦ అర కప్పు ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ♦ అల్లం + వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇంగువ, కరివేపాకు జత చేసి పచ్చివాసన పోయేవరకు కలియబెట్టాలి ♦ టొమాటో తరుగు వేసి రెండు మూడు నిమిషాల పాటు బాగా వేయించాలి ♦ ముద్దగా చేసిన మసాలా పేస్ట్ వేసి బాగా కలపాలి ♦ ఉడికించుకున్న కాబూలీ సెనగలను జత చేయాలి (ఉడికించిన నీళ్లు పక్కన ఉంచుకోవాలి) ♦ బాగా కలిపిన తరవాత పక్కన ఉంచుకున్న నీళ్లు, పచ్చి మిర్చి వేసి బాగా కలపాలి ♦ తగినంత ఉప్పు జత చేయాలి ♦ మిశ్రమం బాగా దగ్గరపడేవరకు కలుపుతుండాలి ♦ కొత్తిమీరతో అలంకరించి దింపేయాలి ♦ రోటీలు, పూరీలలోకి రుచిగా ఉంటుంది. -
విశ్వేశ్వరస్వామి ఆలయంలో శనగల గణపతి
రాజమహేంద్రవరం కల్చరల్ : గోదావరి గట్టున ఉన్న బాలాత్రిపుర సుందరీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామి ఆలయంలో చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారానికి Sఅధిపతిౖయెన గురునికి ప్రీతికరమైన శనగలతో గణపతిని అలంకరించారు. శుక్రవారం శుక్రునికి ప్రీతికరమైన బొబ్బర్లు, శనివారం శనికి ప్రీతికరమైన పత్తిగింజలు, ఆదివారం సూర్యునికి ప్రీతికరమైన గోధుమలు, సోమవారం చంద్రునికి ప్రీతికరమైన వెన్న, డ్రైఫ్రూట్స్, మంగళవారం రాహు కేతువులకు ప్రీతికరమైన ఉలవలు, మినుమలతో గణపతిని అలంకరించి పూజలు నిర్వహిస్తామని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మండవిల్లి శివ తెలిపారు. ఆలయ కార్యనిర్వహణాధికారి శోభారాణి ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
ఆరోగ్యానికి సెనగలు
శ్రావణ మాసం... ఇంటింటా సెనగలు కొలువుతీరే మాసం... నోములు... వ్రతాలు... పూజలు... పండుగలు... ఇళ్లన్నీ ఆకుపచ్చని తోరణాలు, పసుపు పచ్చని చేమంతులతో కళకళలాడుతుంటాయి... ఎవరో ఒక అతిథి ఇంటికి రావడం... వాయినాలు ఇవ్వడం... పుచ్చుకోవడం... ఏదైతేనేం... ఇల్లంతా సెనగలే సెనగలు... ఒక్కసారి ఆలోచనకు పదును పెట్టండి... సెనగలతో వంటలను అలంకరించండి... సంప్రదాయంగా చేసే హయగ్రీవతో పాటు... పాఠోళీ, గుత్తి కూరలు... ఎన్నో... ఎన్నెన్నో చేసుకుందాం... శరీరానికే కాదు ఆరోగ్యానికి కూడా నగలు సమకూర్చుకుందాం... సెనగల కూర కావ లసినవి: సెనగలు - కప్పు; పసుపు - పావు టీ స్పూను; ఉల్లి తరుగు - అర కప్పు; చిన్న ఉల్లిపాయలు - 4 (సూపర్ మార్కెట్లో దొరుకుతాయి); పచ్చి మిర్చి - 3 (పొడవుగా మధ్యకు కట్ చేయాలి); కరివేపాకు - 4 రె మ్మలు; మిరప్పొడి - టీ స్పూను; పసుపు - టీ స్పూను; ఎండు మిర్చి - 2; కొబ్బరి తురుము - అర కప్పు; చిన్న ఉల్లిపాయలు - 2 (సన్నగా తరగాలి); ధనియాలు - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు (ధనియాల పొడి కూడా వాడుకోవచ్చు) మసాలా కోసం: సోంపు - పావు టీ స్పూను, ఏలకులు - 2, లవంగాలు - 3, దాల్చినచెక్క - చిన్న ముక్క, మిరియాలు - నాలుగు గింజలు తయారి: సెనగలను ముందు రోజు రాత్రి నానబెట్టాలి మరుసటి రోజు ఒక గిన్నెలో... నానబెట్టిన సెనగలు, ఉప్పు, పసుపు వేసి కుకర్‌లో ఉడికించాలి (ఉడికించిన నీళ్లను పక్కన ఉంచి, గ్రేవీ కోసం వాడుకోవాలి) బాణలిలో టీ స్పూను నూనె వేసి కాగాక ధనియాలతో పాటు మిగిలిన మసాలా దినుసులు కూడా వేసి వేయించాలి చిన్న ఉల్లిపాయల తరుగు జత చేసి బాగా వేయించాక, కొబ్బరి తురుము వేసి గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించి, దించి చల్లారాక, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి మరొక బాణలిలో కొబ్బరి నూనె వేసి కాగాక, ఆవాలు, ఎండు మిర్చి వేసి వేయించాలి ఉల్లి తరుగు, చిన్న ఉల్లిపాయల తరుగు, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు వేసి వేయించాలి పసుపు, మిరప్పొడి జత చేసి కొద్ది సేపు వేయించి, ఉడికించి ఉంచుకున్న నీళ్లు పోసి, మరిగాక కొబ్బరి పేస్ట్, ఉడికించిన సెనగలు వేసి బాగా కలిపి ఐదు నిమిషాలు ఉడికించాలి. బెండకాయ గుత్తి కూర కావలసినవి: బెండకాయలు - పావు కేజీ; నూనె - టేబుల్ స్పూను; స్టఫింగ్ కోసం: సెనగలు - కప్పు (ఉడికించి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి); పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు (వేయించాలి); నువ్వులు - టేబుల్ స్పూను (వేయించాలి); అవిసె గింజలు - టేబుల్ స్పూను (వేయించాలి); పచ్చి మిర్చి ముద్ద - 2 టేబుల్ స్పూన్లు; అల్లం వెల్లుల్లి ముద్ద - 2 టీ స్పూన్లు; పసుపు - పావు టీ స్పూను; నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర - గుప్పెడు; ఉప్పు - తగినంత తయారి: అవిసె గింజలు, నువ్వు పప్పు, పల్లీలను విడివిడిగా మిక్సీలో వేసి పొడి చేసి పక్కన ఉంచాలి ఒక పాత్రలో... తయారుచేసి ఉంచుకున్న సెనగల ముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చి మిర్చి ముద్ద, పసుపు, నిమ్మరసం, కొత్తిమీర, ఉప్పు వేసి అన్నీ కలిసేలా కలపాలి బెండకాయలను శుభ్రంగా కడిగి తడిపోయే వరకు ఆరబెట్టి, రెండు వైపులా తొడిమలు తీసి, మధ్యకు గాటు పెట్టాలి. (బెండకాయ ముక్కలు కాకుండా జాగ్రత్త పడాలి) ముందుగా తయారుచేసి ఉంచుకున్న స్టఫింగ్ మిశ్రమాన్ని బెండకాయలలో జాగ్రత్తగా స్టఫ్ చేయాలి వెడల్పాటి బాణలిలో నూనె వేసి కాగాక బెండకాయలను ఒక్కొక్కటిగా వేసి, బాగా కలిపి మూత పెట్టి పది నిమిషాలు ఉంచాలి పల్లీ, నువ్వులు, అవిసె గింజల పొడుల మిశ్రమం వేసి కలిపి దించేయాలి. పాఠోళీ కావ లసినవి: సెనగలు - రెండు కప్పులు; ఉల్లి తరుగు - కప్పు; పచ్చి మిర్చి తరుగు - 3 టీ స్పూన్లు; కరివేపాకు - 4 రెమ్మలు; అల్లం తురుము - టీ స్పూను; నూనె - చిన్న గిన్నెడు; ఎండు మిర్చి - 4; సెనగపప్పు - 2 టీ స్పూన్లు; మినప్పప్పు - 2 టీ స్పూన్లు; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను, ఉప్పు - తగినంత తయారి: సెనగలను ముందు రోజు రాత్రి నీళ్లలో నానబెట్టాలి మరుసటి రోజు నీరు తీసేసి... అల్లం తురుము, పచ్చి మిర్చి, ఉప్పు జత చేసి మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక, సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి కరివేపాకు, ఉల్లి తరుగు వేసి బాగా వేగాక, సెనగల ముద్ద వేసి కలిపి మూత ఉంచాలి (సన్నని మంట మీద మాత్రమే చేయాలి) మధ్యమధ్యలో బాగా కలుపుతూ నూనె జత చేస్తుండాలి బాగా విడివిడిగా అయ్యేవరకు ఉంచి దించేయాలి ఇది అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. హయగ్రీవ కావలసినవి: సెనగలు - కప్పు; బెల్లం తురుము - ఒకటిన్నర కప్పులు; కొబ్బరి తురుము - అర కప్పుస; ఏలకుల పొడి - టీ స్పూను; నెయ్యి - టేబుల్ స్పూను; జీడిపప్పు పలుకులు - 10; కిస్మిస్ - రెండు టేబుల్ స్పూన్లు తయారి: నానబెట్టి ఉంచుకున్న సెనగలకు రెండు కప్పులు నీళ్లు జత చేసి ఉడికించాలి ఒక పెద్ద పాత్రలో ఉడికించి ఉంచుకున్న సెనగలు, బెల్లం తురుము, కొబ్బరి తురుము, ఏలకుల పొడి వేసి స్టౌ మీద ఉంచాలి. (మంట బాగా తగ్గించాలి) బెల్లం పూర్తిగా కరిగి మిశ్రమం చిక్కబడ్డాక దింపేయాలి చిన్న బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడిపప్పు పలుకులు, కిస్మిస్ వేసి వేయించి, సిద్ధంగా ఉన్న హయగ్రీవలో వేసి కలపాలి.