విశ్వేశ్వరస్వామి ఆలయంలో శనగల గణపతి
రాజమహేంద్రవరం కల్చరల్ : గోదావరి గట్టున ఉన్న బాలాత్రిపుర సుందరీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామి ఆలయంలో చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారానికి Sఅధిపతిౖయెన గురునికి ప్రీతికరమైన శనగలతో గణపతిని అలంకరించారు. శుక్రవారం శుక్రునికి ప్రీతికరమైన బొబ్బర్లు, శనివారం శనికి ప్రీతికరమైన పత్తిగింజలు, ఆదివారం సూర్యునికి ప్రీతికరమైన గోధుమలు, సోమవారం చంద్రునికి ప్రీతికరమైన వెన్న, డ్రైఫ్రూట్స్, మంగళవారం రాహు కేతువులకు ప్రీతికరమైన ఉలవలు, మినుమలతో గణపతిని అలంకరించి పూజలు నిర్వహిస్తామని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మండవిల్లి శివ తెలిపారు. ఆలయ కార్యనిర్వహణాధికారి శోభారాణి ఏర్పాట్లను పర్యవేక్షించారు.