- గణేష్ మండపాల ఏర్పాటుకు అనుమతి తీసుకోవాలి
- వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా
ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి
Published Sun, Sep 4 2016 12:18 AM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM
వరంగల్ : రూరల్ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని రూరల్ ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా ఒక ప్రకటనలో కోరారు. సోమవారం నుంచి జిల్లాలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా ఉత్సవ కమిటీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉత్సవాలకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఉత్సవ కమి టీ వారి పరిధిలోని స్థానిక పోలీస్‌స్టేష న్లకుతప్పకుండాసమాచారం అందించాలన్నారు.
పట్టణాల్లో ఉత్సవ విగ్రహాలు ఇతరుల స్థలంలో పెడితే సంబంధిత యజమాని అనుమతి తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖల అనుమతులు తీసుకుని మండపాలను ఏర్పాటు చేసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సం ఘటనలు జరుగకుండా కమిటీ సభ్యులు తీసుకోవాలని వివరించారు. విద్యుత్, మైక్‌ల పర్మిషన్లు తీసుకోవాలని, ఇతరులకు ఇబ్బందులు కలుగకుండా ఉత్సవాలు నిర్వహించుకోవాలని సూచిం చారు. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని, మండపాల వద్ద ఉత్సవ కమిటీలు పర్యవేక్షణ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి విగ్రహానికి సంబంధించిన ఉత్సవ కమిటీల సెల్ నంబర్లు, సభ్యుల వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లలో అందించాలని కోరారు. అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే డయల్ 100కు, వాట్సాప్, కమాండ్ కంట్రోల్ నంబర్ 85009 27777కు ఫోన్ చేయాలని ఎస్పీ సూచించారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని ఉత్సవ కమిటీలు మట్టి వినాయక విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
Advertisement
Advertisement