కందనవోలు సంబరాలు ఘనంగా నిర్వహిద్దాం | Kandanavolu celebrating the grand handle | Sakshi
Sakshi News home page

కందనవోలు సంబరాలు ఘనంగా నిర్వహిద్దాం

Published Fri, Nov 11 2016 2:55 AM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM

కందనవోలు సంబరాలు ఘనంగా నిర్వహిద్దాం

కందనవోలు సంబరాలు ఘనంగా నిర్వహిద్దాం

- కార్తీక మాసం ముగిసేలోగా నిర్వహణకు చర్యలు
- జేసీ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ
- కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ వెల్లడి 
 
కర్నూలు(అగ్రికల్చర్‌):
కందనవోలు సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ ఆదేశించారు. సంబరాల నిర్వహణపై గురువారం సాయంత్రం కాన్ఫరెన్స్‌ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిభింబించేలా, లోకల్‌ టూరిజాన్ని ప్రోత్సహించేలా కందనవోలు సంబరాలను నిర్వíßంహిచాలన్నారు. ఇందుకోసం జాయింట్‌ కలెక్టర్‌ హరికిరణ్‌ నేతృత్వంలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. పర్యాటక శాఖ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు మెంబరు కన్వీనర్‌గా, డీఆర్‌డీఏ, డ్వామా పీడీలు, యువజన సంక్షేమ అధికారి, వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్, సమాచార శాఖ డీడీలు సభ్యులుగా నియమించారు. వేడుకల నిర్వహణకు, కల్చరల్, పబ్లిసిటీ, సావరిన్‌ కమిటీ, తదితర కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ సూచించారు. కార్తీక మాసం ఈనెల 29న ముగుస్తున్నందునా 27, 28, 29 తేదీల్లో సంబరాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు. కందనవోలు సంబరాలపై హైస్కూలు, జూనియర్, డిగ్రీ కళాశాలల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలు నిర్వహించాలన్నారు.  నిర్వహణపై పూర్తి ప్రణాళికలను సోమవారం సమర్పించాలని పర్యాటక శాఖ అధికారిని ఆదేశించారు. సమావేశంలో జేసీ హరికిరన్‌, డీఆర్‌డీఏ పీడీ రామకృష్ణ, డ్వామా పీడీ పుల్లారెడ్డి, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, కర్నూలు ఆర్‌డీఓ రఘుబాబు, జిల్లా పర్యాటక శాఖ అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement