
వనాల్లో ఉల్లాస పవనాలు..
జిల్లావ్యాప్తంగా తోటలు, తోపులు, తీరాల్లో తిరణాల వాతావరణం కనిపించింది. హిందువులకు పరమ పావనమైన కార్తికమాసంలో చివరిరోజు,
జిల్లావ్యాప్తంగా తోటలు, తోపులు, తీరాల్లో తిరణాల వాతావరణం కనిపించింది. హిందువులకు పరమ పావనమైన కార్తికమాసంలో చివరిరోజు, ఆదివారం కలిసి రావడంతో వనసమారాధనలు విరివిగా జరిగాయి. వివిధ సంఘాలు, సామాజికవర్గాలే కాక బంధుమిత్రులతో కూడిన బృందాలు ఇళ్లను, ఊళ్లను వీడి పచ్చని ప్రకృతి ఒడికి, కడలి తీరానికి చేరారు. పగలంతా ఆటపాటలు, విందువినోదాలతో గడిపారు. సమారాధనల సందర్భంగా పెద్దలూ పిన్నలైపోయి కేరింతలు కొట్టారు. రకరకాల ఆటలు ఆడుతూ తుళ్లిపడ్డారు. అంతర్వేది నుంచి మారేడుమిల్లి వరకూ సందడి నెలకొంది. ఆలయాలను, క్షేత్రాలను సందర్శించే వారితో పాటు పాపికొండలకు షికారు వెళ్లిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. వివిధ సామాజికవర్గాలు నిర్వహించిన వన సమారాధనలకు ఆయా వర్గాలకు చెందిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
-సాక్షి, రాజమండ్రి
ఘనంగా కాపు వన సమారాధన
మధురపూడి / రాజమండ్రి రూరల్ :రాజమండ్రి నగర కాపు సంఘం అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు అధ్యక్షతన కాపుల కార్తిక వనసమారాధన మధురపూడిలోని ఎస్‌బీ వెంచర్స్‌లో ఆదివారం ఘనంగా జరిగింది. తొలుత దేవాదాయ మంత్రి పి.మాణిక్యాలరావు, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మి తదితరులు రాష్ట్ర కాపు సంఘం అధ్యక్షుడు దివంగత మిరియాల వెంకట్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మిరియాల వెంకట్రావు కోడలు సృజన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంజీవని స్వచ్ఛంద రక్తదాతల సంస్థ, రోటరీ క్లబ్ (కాకినాడ)ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదానశిబిరాన్ని మంత్రి మాణిక్యలరావు ప్రారంభించారు.
మంత్రి మాణిక్యాలరావు, సినీ దర్శకుడు మారుతి తదితరులను సత్కరించారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ, మేయర్ పంతం రజనీ శేషసాయి, జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు, డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు, తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు వంగాగీత, కురసాల కన్నబాబు, రౌతు సూర్యప్రకాశరావు, సీనియర్ న్యాయవాది ఎస్‌జీ రామారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి యర్రా వేణుగోపాలరాయుడు, సీసీసీ చానల్ ఎండీ పంతం కొండలరావు, జిల్లాకాపు సంఘ అధ్యక్షుడు వాసిరెడ్డి ఏసుదాసు, కాపు నాయకులు బస్సా ప్రభాకరరావు, తాడివాక రమేష్‌నాయుడు,
శ్రీనివాసనాయుడు తదితరులు మాట్లాడారు. కార్తిక వనసమారాధన కమిటీ నిర్వాహకులు మారిశెట్టి రామారావు, గన్నాబత్తుల మహేష్‌లు కాపు, కాపు ఉపకులాలను బీసీల్లో చేర్చాలన్న దానితో పాటు మరో ఐదు ఆకాంక్షలను వ్యక్తం చేస్తూ తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఈకార్యక్రమంలో ప్రముఖ కాంట్రాక్టర్ ఆర్.సుబ్బరాజు, బాలత్రిపురసుందరి, జక్కంపూడి చిన్ని, సుంకర శ్రీనివాస్, యెనుముల రంగబాబు, సుంకర చిన్ని, పలువురు కాపు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కోటగుమ్మం (రాజమండ్రి) :సంఘీయులంతా ఐకమత్యంతో మెలగితే అభివృద్ధి సుసాధ్యమని గౌడ, శెట్టిబలిజ, శ్రీశయన, యాత నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక ఎస్.కె.వి.టి. డిగ్రీ కాలేజీలో ఆదివారం గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశయన, యాత కులాల కార్తిక సమారాధన జరిగింది. జిల్లా నుంచే కాక వివిధ జిల్లాల నుంచి ఆ సామాజికవర్గాలకు చెందిన దాదాపు 25 వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖల మంత్రి కె.ఇ.కృష్ణమూర్తిని ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ సంఘీయుల పురోభివృద్ధికి పలు సూచనలు చేశారు. గౌడ సంఘం రాష్ట్ర చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, కార్యనిర్వాహక అధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, గౌడ, శెట్టిబలిజ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు కాసాని భుజంగరావు, అధ్యక్షుడు రెడ్డి రాజు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అనుసూరి పద్మలత, పాలిక శ్రీను, బుడ్డిగ రవి, హితకారిణి సమాజం చైర్మన్ బుడ్డిగ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు అంగర ఉమ, గేడి రాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సూరంపూడి శ్రీహరి, వెలిగట్ల పాండురంగారావు, వల్లూరి ప్రకాష్,
మట్టా శ్రీను తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి వై జంక్షన్‌లో గౌడ, శెట్టిబలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర సమర యోధుడు సర్దార్ గౌతు లచ్చన్న కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, రాజమండ్రి మేయర్ పంతం రజనీ శేషసాయి, లచ్చన్న కుమారుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామ్‌సుందర్ శివాజీ, శాసనమండలిలో ప్రభుత్వ విప్ చైతన్యరాజు, జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు తదితరులు పాల్గొన్నారు.