
హెచ్‌ఐసీసీలో వజ్రోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న దృశ్యం
సాక్షి, హైదరాబాద్: భారత స్వతంత్ర వజ్రోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభం కానున్నాయి. 15 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా సాగే ఈ ఉత్సవాలను హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా ఉదయం 11:30 గంటలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌లతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు.
రాష్ట్రవ్యాప్తంగా దేశ భక్తి ఉట్టిపడేలా, అత్యంత ఘనంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు సీఎస్ తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్ లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లాల నుంచి జడ్పీటీసీలు, ఎంపీపీలకు నేరుగా రావడానికి ప్రత్యేక వాహన సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. కాగా, జాతీ య పతాకావిష్కరణతో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాల్లో భారత స్వతంత్ర వజ్రోత్సవాల స్ఫూర్తిని చాటేలా కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని అన్ని జంక్షన్లు, ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.
కార్యక్రమాలు ఇలా..
►ఉదయం11.30 గంటల ప్రాంతంలో కేసీఆర్ హెచ్‌ఐసీసీ ప్రాంగణానికి చేరుకుంటారు.
►అనంతరం జాతీయ పతాకావిష్కరణ, గాంధీజీ, భరతమాత విగ్రహాలకు పుష్పమాలాలంకరణ, సాంçస్కృతిక కార్యక్రమాలు
►75 మంది వీణ కళాకారులతో వాయిద్య ప్రదర్శన
►శాండ్ ఆర్ట్ ప్రదర్శన,దేశభక్తి ప్రబోధ నృత్య కార్యక్రమం, ఫ్యూజన్ ప్రదర్శన, లేజర్ షో
►తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ స్వాగత ప్రసంగం
►అనంతరం వజ్రోత్సవాల కమిటీ చైర్మన్ డా.కేశవరావు ప్రారంభోపన్యాసం, తరువాత ముఖ్యమంత్రి ప్రసంగం.
Comments
Please login to add a commentAdd a comment