వైభవంగా చౌడేశ్వరీదేవి రథోత్సవం | Chariot exposition caudesvari | Sakshi
Sakshi News home page

వైభవంగా చౌడేశ్వరీదేవి రథోత్సవం

Published Wed, Mar 29 2017 11:17 PM | Last Updated on Fri, Oct 5 2018 6:24 PM

Chariot exposition caudesvari

 లేపాక్షి/ చిలమత్తూరు (హిందూపురం) : ఉగాది పండుగను పురస్కరించుకుని బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు లేపాక్షి మండలం చోళసముద్రం గ్రామంలో చౌడేశ్వరీదేవి రథోత్సవం వైభవంగా జరిగింది. గ్రామస్తులంతా కలిసి అమ్మవారిని గర్భగుడి నుంచి పల్లకీ సేవ ద్వారా ఊరేగించి రథంలో కొలువుదీర్చారు. 
అనంతరం రథాన్ని గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు లాగారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కదిరప్ప, ఉప సర్పంచ్‌ నాగరాజు, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ నారాయణస్వామి, నాయకులు కూతుల శీనా, యు.మూర్తి, మోహన్, బి.మూర్తి, ఆలయ కమిటీ సభ్యులు నానెప్ప, చౌడప్ప, కేశప్ప, టీడీపీ నాయకులు ప్రభాకర్‌రెడ్డి, జయచంద్ర, బీజేపీ నాయకుడు చౌడప్ప, సీపీఐ నాయకుడు శివప్ప, గ్రామపెద్దలు, భక్తులు పాల్గొన్నారు. 
 
చిలమత్తూరులో గ్రామ దేవత చౌడేశ్వరీ మాతా గ్రామోత్సవం బుధవారం కనులపండువగా సాగింది. ఉత్సవ విగ్రహాన్ని పలు రకాల పూలతో రమణీయంగా అలంకరించి పల్లకీపై ఆసీనులను చేసి గ్రామోత్సవం నిర్వహించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement