భారత్‌లో పండుగల సీజన్‌లో ఇళ్ల కొనుగోళ్లు తగ్గుముఖం పడుతున్నాయి. పండుగ త్రైమాసికంలో (అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు) తీసుకున్న గృహ రుణాల విలువ ఇటీవలి సంవత్సరాలలో స్థిరంగా తగ్గుముఖం పట్టడంతో ఇది స్పష్టమవుతోంది. మరోవైపు ఇదే కాలంలో ఆటో, ద్విచక్ర వాహనాలు, కన్స్యూమర్ డ్యూరబుల్స్, వ్యక్తిగత రుణాలు స్థిరమైన వృద్ధిని సాధించగా, గృహ రుణాలు మాత్రం తగ్గుముఖం పట్టాయి.
వాహన రుణాల్లో గణనీయ వృద్ధి
క్రెడిట్ బ్యూరో సీఆర్‌ఐఎఫ్ హై మార్క్ నివేదిక ప్రకారం.. 2023 ఆర్థిక సంవత్సరం పండుగ సీజన్ అయితే మూడో త్రైమాసికం విలువ, పరిమాణం రెండింటిలోనూ ఆటో, ద్విచక్ర వాహన రుణాలలో గణనీయమైన వృద్ధిని సాధించింది. అయితే, ఈ కాలంలో గృహ రుణాలు 2. 6 శాతం తగ్గిపోయాయి. ఇది ఇటీవలి సంవత్సరాలలో గృహ రుణాలకు సంబంధించి అత్యంత నిరాశాజనక పండుగ త్రైమాసికం. అయితే గృహ రుణాల తగ్గుదలకు వడ్డీ రేట్ల పెరగడం కారణంగా భావించవచ్చు.
వాహన రుణాలు ఆరిజినేషన్స్ (విలువ)లో 24 శాతం పెరుగుదలను ప్రదర్శించాయి. 2022 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇవి రూ.60,900 కోట్లు ఉండగా 2023 ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.75,500 కోట్లకు పెరిగాయి. అదేవిధంగా ద్విచక్ర వాహన రుణాలు 34. 5 శాతం వృద్ధిని సాధించాయి. 2022 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.17,100 కోట్ల నుంచి 2023 ఆర్థికేడాది మూడో త్రైమాసికానికి రూ.23,000 కోట్లకు పెరిగాయి. పర్సనల్ లోన్ విభాగం కూడా 20. 2 శాతం వృద్ధిని సాధించింది. 2022 ఆర్థిక ఏడాది క్యూ3లో రూ.1,58,500 కోట్ల నుంచి 2023 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.1,90,500 కోట్లకు చేరుకుంది.
We today announced the second edition of the How India Celebrates Report on Festive Lending in India. Discover key trends and insights into major consumer lending products.
— CRIF India (@CRIF_India) June 14, 2023
Get the full report at: https://t.co/9cSuZdbuSW#CRIF #HowIndiaCelebrates #FestiveLoans #Insights pic.twitter.com/6DOu8jkGJh
Comments
Please login to add a commentAdd a comment