
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది (2023) పండుగలు, పర్వదినాలకు చెందిన సాధారణ సెలవుల్లో మూడు ఆదివారాలు, ఒకటి రెండో శనివారం వచ్చాయి. ఐచ్ఛిక సెలవుల్లో నాలుగు ఆదివారాలు వచ్చాయి. 2023లో ప్రభుత్వ సాధారణ సెలవులు, ఐచ్ఛిక సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
రెండో శనివారం భోగి సాధారణ సెలవుల్లో వచ్చింది. మకర సంక్రాంతి, దుర్గాష్టమి, దీపావళి ఆదివారాల్లో.. సాధారణ సెలవుల్లో వచ్చాయి. ఐచ్ఛిక సెలవుల్లో నాలుగు ఆదివారాలు వచ్చాయి. 2023లో మొత్తం 23 సాధారణ, 22 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ మేరకు బ్యాంకింగ్‌తోపాటు జాతీయ స్థాయిలో నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ చట్టం కింద 16 సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment