Public Holidays
-
వచ్చే ఏడాది హైకోర్టు సెలవులివే..
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది సెలవుల జాబితాను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ విడుదల చేశారు. సంక్రాంతికి ఐదు.. దసరాకు ఐదు రోజులు, వేసవిలో నెల రోజులుంటాయని పేర్కొన్నారు. సాధారణ, ప్రభుత్వ, ఐచ్ఛిక సెలవులను కూడా వెల్లడించారు. సంక్రాంతి: జనవరి 16 (గురు), జనవరి 17 (శుక్ర) వేసవి: మే 5 నుంచి జూన్ 6 వరకు.. దసరా: సెపె్టంబర్ 29 నుంచి అక్టోబర్ 3 వరకు ప్రభుత్వ సెలవులు.. జనవరి: నూతన సంవత్సరం 1వ తేదీ, భోగి (13న), సంక్రాంతి (14న), కనుమ (15న) ఫిబ్రవరి: మహాశివరాత్రి (26న) మార్చి: హోలీ (14న), రంజాన్ (31న) ఏప్రిల్: బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి (5న), అంబేడ్కర్ జయంతి (14న),గుడ్‌ఫ్రైడే (18న) జూన్: బక్రీద్ (7న) జూలై: బోనాలు (21న) ఆగస్టు: వరలక్ష్మీ వ్రతం (8న), స్వాతంత్య్ర దినోత్సవం (15న), శ్రీకృష్ణాష్టమి (16న), వినాయక చవితి (27న) సెప్టెంబర్: ఈద్ మిలాదున్ నబీ(5న), దుర్గాష్టమి (30న) అక్టోబర్: మహర్నవమి (1న), గాంధీ జయంతి (2న), నరక చతుర్థశి (20న), దీపావళి (21న), స్పెషల్ హాలీడే (22న) నవంబర్: కార్తీక పౌర్ణమి (5న) డిసెంబర్: క్రిస్మస్ (25న), ఫాలోయింగ్ డే (26న) శని/ఆదివారాల్లో వస్తున్నవి.. గణతంత్ర దినోత్సవం: జనవరి 26న ఉగాది: మార్చి 30న శ్రీరామనవమి: ఏప్రిల్ 6న మొహరం: జూలై 6న బతుకమ్మ: సెప్టెంబర్ 21న ఇవికాక మహావీర్ జయంతి, బసవ జయంతి, బుద్ధ పూర్ణిమ.. లాంటి 12 ఐచ్ఛిక సెలవులను కూడా ప్రకటించారు. మరో మూడు ఐచ్ఛిక సెలవులు శని/ఆది వారాల్లో రానున్నాయి. -
Durgam Cheruvu Musical Fountain Pics: దుర్గం చెరువులో వాటర్ ఫౌంటెన్లు ప్రారంభం (ఫోటోలు)
-
వచ్చే ఏడాది ప్రభుత్వ సెలవులు ఇవే
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది (2023) పండుగలు, పర్వదినాలకు చెందిన సాధారణ సెలవుల్లో మూడు ఆదివారాలు, ఒకటి రెండో శనివారం వచ్చాయి. ఐచ్ఛిక సెలవుల్లో నాలుగు ఆదివారాలు వచ్చాయి. 2023లో ప్రభుత్వ సాధారణ సెలవులు, ఐచ్ఛిక సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. రెండో శనివారం భోగి సాధారణ సెలవుల్లో వచ్చింది. మకర సంక్రాంతి, దుర్గాష్టమి, దీపావళి ఆదివారాల్లో.. సాధారణ సెలవుల్లో వచ్చాయి. ఐచ్ఛిక సెలవుల్లో నాలుగు ఆదివారాలు వచ్చాయి. 2023లో మొత్తం 23 సాధారణ, 22 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ మేరకు బ్యాంకింగ్‌తోపాటు జాతీయ స్థాయిలో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చట్టం కింద 16 సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. -
తెలంగాణ: 2023లో ప్రభుత్వ సెలవు దినాలు ఇవే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ-2023లో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. మొత్తం ఏడాదిలో 28 సాధారణ సెలవులు, 24 ఐచ్ఛిక సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అన్ని ఆదివారాలు, రెండో శనివారాల్లో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉంటాయని తెలిపింది. సాధారణ సెలవులు 4 ఆదివారాల్లో, 2 రెండో శనివారాల్లో వస్తున్నాయి. ఈ మేరకు సెలవుల జాబితాతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ఆదివారాలు, రెండో శనివారాల్లో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉంటాయని తెలిపారు. మతం, ఉత్సవంతో సంబంధం లేకుండా 24 ఐచ్ఛిక సెలవుల్లో గరిష్టంగా ఏవైనా 5 ఐచ్ఛిక సెలవులను వాడుకోవడానికి అనుమతించారు. నెలవంక ఆధారంగా రంజాన్, బక్రీద్, మొహర్రం, మిలాద్–ఉన్–నబీ పర్వదినాల సెలవుల్లో ఏమైనా మార్పులుంటే తర్వాత ప్రకటిస్తారు. సాధారణ సెలవులు, ఐచ్ఛిక సెలవులు ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి. పరిశ్రమలు, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్స్, విద్యాసంస్థల ఉద్యోగులకు సాధారణ సెలవులు వర్తించవు. పండుగలు, ఉత్సవాల సందర్భంగా ఈ సంస్థలు అమలు చేయాల్సిన సెలవుల విషయంలో సంబంధిత ప్రభుత్వ శాఖలు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తాయని సీఎస్ తెలిపారు. సాధారణ సెలవులు 4 ఆదివారాల్లో, 2 రెండో శనివారాల్లో వస్తున్నాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు వాస్తవంగా లభించనున్న సాధారణ సెలవుల సంఖ్య 22కి తగ్గనుంది. కాగా, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద 23 సెలవులను రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించింది. -
2020 ఏడాది సెలవుల వివరాలివే..
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది (2020)కి సంబంధించిన సాధారణ సెలవులు, ఐచ్ఛిక సెలవులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2020 సెలవుల వివరాలివే.. సందర్భం/పండుగ తేదీ వారం బోగి జనవరి 14 మంగళ సంక్రాంతి/పొంగల్ జనవరి 15 బుధ కనుమ జనవరి16 గురువారం మహాశివరాత్రి ఫిబ్రవరి 21 శుక్ర ఉగాది మార్చి 25 బుధ శ్రీరామ నవమి ఏప్రిల్ 02 గురు గుడ్‌ఫ్రైడే ఏప్రిల్ 10 శుక్ర అంబేడ్కర్ జయంతి ఏప్రిల్ 14 మంగళ ఈదుల్ ఫితర్(రంజాన్) మే 25 సోమ ఈదుల్ అజా(బక్రీద్) ఆగస్టు 1 శని శ్రీకృష్ణాష్టమి ఆగస్టు 11 మంగళ స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15 శని వినాయక చవితి ఆగస్టు 22 శని గాంధీ జయంతి అక్టోబర్ 02 శుక్ర దుర్గాష్టమి అక్టోబర్ 24 శని మిలాద్ ఉన్ నబీ అక్టోబర్ 30 శుక్ర క్రిస్మస్ డిసెంబర్ 25 శుక్ర ఆదివారం, రెండో శనివారంలో వచ్చే సెలవులు గణతంత్ర దినోత్సవం జనవరి 26 ఆది బాబు జగ్జీవన్ రాం జయంతి ఏప్రిల్ 5 ఆది మొహర్రం ఆగస్టు 30 ఆది విజయదశమి అక్టోబర్ 25 ఆది దీపావళి నవంబర్ 14 రెండో శని ఐచ్ఛిక సెలవులు పండుగ తేదీ వారం ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి 1 బుధవారం హజ్రత్ సయ్యద్ మహమ్మద్ జువాన్‌పురి మహది జనవరి10 శుక్ర హజ్రత్ అలీ జయంతి మార్చి 9 సోమవారం హోలీ మార్చి 10 మంగళవారం షబ్-ఏ-మేరాజ్ మార్చి 23 సోమ మహవీర్ జయంతి ఏప్రిల్ 06 సోమ షబ్-ఏ-బరాత్ ఏప్రిల్ 09 గురు బుద్ధపూర్ణమి మే 07 గురు షహదత్ హజ్రత్ అలీ మే 14 గురు షబ్-ఏ-ఖదర్ మే 21 గురు జుమతుల్ విదా మే 22 శుక్ర రథయాత్ర జూన్ 23 మంగళ వరలక్ష్మీ వ్రతం జూలై 31 శుక్ర ఈద్-ఏ-గధీర్ ఆగస్టు 7 శుక్ర పార్శి కొత్త ఏడాది రోజు ఆగస్టు 20 గురువారం 9వ మొహర్రం ఆగస్టు 29 శని మహాలయ అమావాస్య సెప్టెంబర్17 గురువారం అర్బాయిన్ అక్టోబర్ 08 గురు యాజ్ దుహమ్ షరీష్ నవంబర్ 27 శుక్ర కార్తీక పూర్ణిమ/గురునానక్ జయంతి నవంబర్30 సోమ క్రిస్మస్ ఈవ్ డిసెంబర్24 గురు బాక్సింగ్ డే డిసెంబర్26 శని ఆదివారం రానున్న ఐచ్ఛిక సెలవులు పండుగ తేదీ వారం బసవ జయంతి ఏప్రిల్ 26 ఆది -
2019లో సెలవులు ఇవే..!
-
యోగీ బాటలో.. కేజ్రీవాల్!
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి బాటలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రయాణిస్తున్నారు. యోగీ యూపీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక.. భారీగా ప్రభుత్వ సెలవుల్లో కోత పెట్టారు. ముఖ్యమంత్రి ప్రఖ్యాత నేతల జయంతులు, వర్ధంతిల సెలవులను యోగీ రద్దు చేసి అప్పట్లో సంచలనం సృష్టించారు. తాగా యోగీ చూపిన మార్గంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నడుస్తున్నారు. ఢిల్లీలో ప్రముఖుల జయంతులు, వర్ధంతుల సెలవులను రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మంగళవారం ప్రకటించారు. ఇదే విషయాన్ని సిసోడియా ట్విటర్ వేదికగా స్పష్టం చేశారు. ప్రముఖుల జయంతులు, వర్ధంతుల సెలవు దినాలను రద్దు చేయాలని ప్రభుత్వ కార్యదర్శికి లేఖ రాసినట్లు మనీస్ సిసోడియా వెల్లడించారు. సిసోడియా ఆదేశాలు అమల్లోకి వస్తే.. దాదాపు 15 సెలవులు రద్దు అవుతున్నట్లు తెలుస్తోంది. జయంతి, వర్ధంతి సెలవులను రద్దు చేయడం వల్ల పనిగంటలు పెరుగుతాయని ఆయన తెలిపారు. -
వచ్చే ఏడాది ప్రభుత్వ సెలవులు ఇవే
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది 23 సాధారణ సెలవు దినాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. భోగి, ఉగాది, శ్రీరామనవమి పండుగులు ఆదివారం వచ్చాయి. సాధారణ సెలవు దినాలకు తోడు 20 ఆప్షనల్ సెలవులనూ ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఒక్క దెబ్బతో ఏడాదికి 15 సెలవులు రద్దు!
తెలుగు రాష్ట్రాల్లో ఏడాదికి ఎన్ని సెలవులు ఉంటాయి? పండుగలు, ప్రముఖుల పుట్టినరోజులు అన్నీ కలిపినా మహా అయితే 15-20కి మించవు. కానీ ఉత్తరప్రదేశ్‌లో మాత్రం ఇన్నాళ్ల బట్టి ఏకంగా 42 పబ్లిక్ హాలిడేలు ఉన్నాయి. వాటి మీద ఒక్కసారిగా కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వేటు వేశారు. ఒకేసారి మొత్తం 15 సెలవులు రద్దుచేశారు. ఈ మేరకు యోగి మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రముఖుల జయంతులు, వర్ధంతుల సందర్భంగా ఇస్తున్న సెలవుల్లో చాలావరకు రద్దు చేస్తూ నిర్ణయించారు. ఈ రోజులన్నీ ఇన్ని సెలవులు ఉంటే ప్రభుత్వ కార్యాలయాలు ఇక పనిచేసేది ఎప్పుడని సీఎం యోగి మండిపడ్డారు. రోజుకు 18-20 గంటలు పనిచేయగలిగితేనే తనతో ఉండాలని, లేకపోతే ఎవరి దారి వాళ్లు చూసుకోవచ్చని ముందే చెప్పిన యోగి.. ఇప్పుడు సెలవులను కూడా తగ్గించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన సభలోనే సూచనప్రాయంగా ఆయనీ విషయం వెల్లడించారు. ప్రముఖుల జయంతులప్పుడు స్కూళ్లకు సెలవులు ఇవ్వొద్దని, ఆరోజు ప్రత్యేకంగా తరగతులు నిర్వహించి వాళ్ల గొప్పదనం గురించి రెండు గంటల పాటు పిల్లలకు చెప్పాలని అన్నారు. అధికారులు తమ కార్యాలయాలను శుభ్రంగా ఉంచుకోవాలని, సమయానికి తప్పనిసరిగా ఆఫీసుకు రావాలని ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోను బయోమెట్రిక్ హాజరు పద్ధతిని ప్రవేశపెట్టారు. పబ్లిక్ హాలిడేలలో 15 రద్దు చేస్తున్న విషయాన్ని కేబినెట్ మంత్రి శ్రీకాంత్ శర్మ ప్రకటించారు. ఆయా రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు కూడా పనిచేస్తాయన్నారు. విద్యార్థులకు వాళ్ల గురించి వివిధ కార్యక్రమాల ద్వారా వివరిస్తారన్నారు. ఇలా ఇప్పటికే ఉన్న సెలవులను రద్దుచేసిన మొదటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు 3 పబ్లిక్ హాలిడేలు ఉంటే సరిపోతుందని, లేదా కనీసం వాటిని 17కు తగ్గించాలని వేతన కమిషన్లు పలు సందర్భాల్లో చెప్పాయి. కానీ, ఉద్యోగ సంఘాల ఒత్తిళ్ల కారణంగా ఏ ప్రభుత్వమూ అంతటి సాహసం చేయలేకపోయింది.