సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి బాటలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రయాణిస్తున్నారు. యోగీ యూపీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక.. భారీగా ప్రభుత్వ సెలవుల్లో కోత పెట్టారు. ముఖ్యమంత్రి ప్రఖ్యాత నేతల జయంతులు, వర్ధంతిల సెలవులను యోగీ రద్దు చేసి అప్పట్లో సంచలనం సృష్టించారు. తాగా యోగీ చూపిన మార్గంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నడుస్తున్నారు. ఢిల్లీలో ప్రముఖుల జయంతులు, వర్ధంతుల సెలవులను రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మంగళవారం ప్రకటించారు. ఇదే విషయాన్ని సిసోడియా ట్విటర్ వేదికగా స్పష్టం చేశారు.
ప్రముఖుల జయంతులు, వర్ధంతుల సెలవు దినాలను రద్దు చేయాలని ప్రభుత్వ కార్యదర్శికి లేఖ రాసినట్లు మనీస్ సిసోడియా వెల్లడించారు. సిసోడియా ఆదేశాలు అమల్లోకి వస్తే.. దాదాపు 15 సెలవులు రద్దు అవుతున్నట్లు తెలుస్తోంది. జయంతి, వర్ధంతి సెలవులను రద్దు చేయడం వల్ల పనిగంటలు పెరుగుతాయని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment