కెనడాలో ఘనంగా నోవా మల్టీఫెస్ట్ వేడుకలు | Nova Multifest Was Celebrated In Halifax Canada | Sakshi
Sakshi News home page

కెనడాలో ఘనంగా నోవా మల్టీఫెస్ట్ వేడుకలు

Published Mon, Jul 31 2023 12:18 PM | Last Updated on Mon, Jul 31 2023 12:18 PM

Nova Multifest Was Celebrated In Halifax Canada - Sakshi

కెనడా  హాలిఫాక్స్‌లో అత్యద్భుతంగా నోవా మల్టీఫెస్ట్ వేడుకలు జరిగాయి.  తెలుగు భాష అత్యున్నత వైభవం, దేశ, విదేశాలకు పరిచయం మనమంతా పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం కాదు,  మేము ఎక్కడ ఉంటే  అక్కడే  పండుగ అంటూ మన సంస్కృతి సంప్రదాయాలను కెనడాలో చాటి చెబుతున్నారు మన భారతీయులు.  ముఖ్యంగా మన తెలుగు వారు విశాల్ భరద్వాజ్ వారి టీం భ్యారి, టీనా, సెలెస్ట్ గారి ఆధ్వర్యంలో కెనడా ఎన్‌ఎస్‌ లీడర్ పార్టీ లీడర్, యార్మౌత్  ఎమ్మెల్యే  జాక్ చర్చిల్, ఎన్డీపీ లీడర్ క్లాజుడై చందర్,  క్లేటొన్   పార్క్ ఎమ్మెల్యే రఫా డీకోస్తాంజో ముఖ్య అతిథులుగా విచ్చేసిన నోవా మల్టీఫెస్ట్ సంబరాలు కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశారు.

8 వేల మంది ప్రజలు హాజరయ్యారు. శ్రీహరి చల్లా గారు మన దేశం / రాష్ట్రం తరఫున కార్య కలాపాలు నిర్వహించారు.   శ్రీహరి గారి బృందం, ఫణి వంక గారు, శివ మారెళ్ళ గారు , చంద్రా తాడేపల్లి గారు, వెంకట్ వేలూరి గారు, శ్రీనివాస చిన్ని గారు, పృద్వి కాకూరు, క్రిష్ట్న వేణి గారు, రత్నం గారు, జయ గారు, ప్రియాంక గారు, లావణ్య గారు, శ్రీలేఖ, జనని కృష్ణ, జ్యోత్స్నా శ్రీజ ,  దీపీకా కర్ణం,  జయశ్రీ కర్ణం, సియ శివకుమార్, రిషిన్త్ శివకుమార్, శిబి నాన్తం ఆట్రియం, రోహిత్ సాయి చల్లా  పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వర్తించారు.

కెనడాలో హాలిఫాక్స్ నగరంలో జరిగిన "నోవా మల్టీఫెస్ట్" సంబరాలలో మన తెలుగు వారు, ఇతర రాష్ట్రాల వారు కలిసి మన పండుగలు (ఉగాది,- తెలుగు కొత్త సంవత్సరం, కర్వా చౌత్(అట్ల తదియ), రాఖీ -రక్షాబంధన్,  తెలుగు పండుగ సంక్రాంతి(ముగ్గులు, గాలిపటాలు, ధాన్యం, పాలు కలిపి వండిన నైవేద్యం); దీపావళి( దీపాల వరుస, ఆనందం, విజయం, సామరస్యానికి గుర్తుగా జరుపుకునే పండుగలు) వాటి ప్రాముఖ్యతను కెనడా వాసులకి వివరించి  కన్నుల విందు చేశారు. వాతావరణం అనుకూలించక మా నోవా మల్టీఫెస్ట్ సంబరాలు ఒక్క రోజు మాత్రమే జరిగింది, ఐనా 8000 మంది వేడుకలలో పాల్గొనడం విశేషం.

వివిధ భాషలు, వివిధ సంస్కృతులకు నివాసమైన కెనడా వాసులు మన పండుగలు విశేషాలను బాగా అర్థం చేసుకొని, అభినందించారు. రెండు  రోజులు హోరున వర్షాలు ఈదురు గాలులు, మూడవ   రోజు వాతావరణం అనుకూలించడం వలన వేడుకలు ఘనంగా జరిగాయి. కెనడా వాసులలో మన ఇండియా పండుగల ప్రాముఖ్యత గుర్తించి ఎనిమిది వేలకు పైగా పాల్గొని  ఘన విజయం సాధించింది.

కెనడా హెలి ఫ్యాక్స్‌ సుప్రజ గారు మాట్లాడుతూ "ఏ దేశమేగినా ఎందు కాలిడినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవాన్ని" అంటూ.. మన ప్రాచీన కళలైనటు వంటి భరతనాట్యం (జనని కృష్ణ ), కూచిపూడి (జ్యోత్స్న శ్రీజ చల్లా), కర్రసాము(శిబి నాన్తం ఆట్రియం ) జానపద నృత్యాలతో (దీపీకా కర్ణం జయశ్రీ కర్ణం) కెనడా ప్రజలను ఆశ్చర్య చకితులను చేసింది. అలాగే మన సాంప్రదాయ వస్త్రాలతో  కెనడా వాసులని అలంకరించింది. వివాహ భోజనంబు వింతైన వంటకంబు అంటూ రకరకాల దేశాల వారి విందు భోజనాలు అందరూ ఆరగించారు.

(చదవండి: డాలస్ నాటా కన్వెన్షన్‌లో ట్రాన్స్‌పోర్ట్‌ కీ రోల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement