ఉన్నంతలో ఉన్నతంగా.. | As long as the leading edge | Sakshi
Sakshi News home page

ఉన్నంతలో ఉన్నతంగా..

Published Fri, Jun 26 2015 11:18 PM | Last Updated on Sun, Sep 3 2017 4:25 AM

As long as the leading edge

స్థిరాస్తులకు సంబంధించి మీ సందేహాలు మాకు రాయండి.
 
 సాక్షి, హైదరాబాద్ : ఇంట్లో స్థలాన్ని ఎలాగూ పెంచలేం. అలాగనీ అవసరాలకు తగ్గ ఫర్నీచర్‌ను సమకూర్చుకోకుండా ఉండలేం కదా? ఉన్నంతలో స్థలాన్ని సద్వినియోగం చేసుకోవడమే ఇందుకు పరిష్కారం. దాని కోసం కొన్ని చిట్కాలు పాటిస్తే చాలని నిపుణులు సూచిస్తున్నారు.

► తలుపు తీయగానే పెద్దపెద్ద వస్తువులు కన్పిస్తే.. మీ ఇల్లు చిన్నదిగా కన్పిస్తుంది. లివింగ్ రూమ్ ప్రవేశ ద్వారం ముందు పెద్ద మొత్తంలో ఫర్నిచర్ ఉండకుండా చూసుకోవాలి.
► లివింగ్ రూమ్‌కు ఉన్న ద్వారాల మధ్య తిరగడానికి ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసుకోండి. అంటే.. మధ్యలో కుర్చీలు ఉంటే వాటి చుట్టూ తిరిగి వెళ్లడం లాంటివి అన్నమాట.
► సోఫాలు, కుర్చీలన్నింటినీ ఒకే వరుసలో, గోడకు పక్కన ఏర్పాటు చేయకండి. సీట్లు ఒకదానికోటి ఎదురెదురుగా, కనీసం నాలుగు నుంచి పది అడుగుల దూరంతో ఉంటే బావుంటుంది.
► బరువుగా ఉండే ఫర్నిచర్ మొత్తాన్ని గదిలో ఒకే వైపు పెట్టొద్దు. ఇలా చేస్తే సీటింగ్ ఏర్పాటులో సమతుల్యత దెబ్బతింటుంది.
► కాఫీ టేబుల్, సెంటర్ టేబుల్ వాడకం లివింగ్ రూమ్‌లో సాధారణమే. మ్యాగజైన్లు, వార్త పత్రికలు పెట్టుకునేందుకు వీలుగా వీటికోసం ప్రత్యేకంగా షెల్ఫ్ ఉండే టేబుళ్లను ఎంచుకోండి. లివింగ్‌రూమ్‌లో ఉపయోగించే టేబుళ్లు ఒకదాంట్లో మరోటి అమరిపోయే విధంగా ఉంటే మంచిది.
► గదిని పెద్దదిగా కన్పించేలా చేయడంలో అద్దాన్ని మించిన సాధనం మరోటి లేదు. వెనకవైపు పచ్చని మొక్కలున్న కిటికీకి ఎదురుగా అద్దం అమరిస్తే.. ఇంటి వెలుపల ఉన్న ఆహ్లాదభరిత వాతావరణాన్ని లోపలికి తీసుకువస్తున్న భావన కలుగుతుంది.
► టేబుల్ కింద ఖాళీ స్థలాన్ని అలా వదిలేయకుండా.. షెల్ఫ్ ఏర్పాటు చేసుకుంటే, ఏవైనా పెట్టుకోవడానికి అక్కరకొస్తుంది. అవి బయటకు కన్పించకుండా పైన ఓ టేబుల్ క్లాత్ వేయండి.
► గది చిన్నదిగా ఉంటే పార్టిషన్ జోలికి వెళ్లకండి. ఇలా చేస్తే మరింత చిన్నదిగా కన్పిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement