వీబీఆర్‌కు ముప్పు లేదు
వీబీఆర్‌కు ముప్పు లేదు
Published Sat, Sep 24 2016 10:11 PM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM
వెలుగోడు: వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ డిజైన్ ప్రకారమే నీటిని నిల్వ చేస్తున్నట్లు తెలుగు గంగ ఎస్‌ఈ చంద్రశేఖర్ తెలిపారు. రిజర్వాయర్‌కు ఎలాంటి ముప్పు లేదని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. శనివారం ఎస్‌ఈ చంద్రశేఖర్ వీబీఆర్‌ను సందర్శించారు. హెడ్ రెగ్యులేటర్, స్పీల్ వే, వన్ ఆర్, వన్ ఎల్ తూములను పరిశీలించారు. అనంతరం స్థానిక గంగ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. పది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వీబీఆర్‌కు నీరు చేరుతోందన్నారు. పాత డిజైన్ ప్రకారమే నీటిని నిల్వ చేస్తున్నామని, ప్రస్తుతం 15.5 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. స్పీల్ వే, హెడ్ రెగ్యులేటర్, కట్ట వెంట సిబ్బంది నిత్యం పర్యవేక్షిస్తున్నారని, డే అండ్ నై పెట్రోలింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. కట్ట పటిష్టంగా ఉన్నట్లు చెప్పిన ఎస్‌ఈ.. రోజు మార్చి రోజు నీటి నిల్వలు పెంచుతున్నామన్నారు. ఆయన వెంట ఈఈ పుల్లారావు, డీఈలు విజయానంద్, ప్రతాప్, జేఈలు, సిబ్బంది ఉన్నారు.
Advertisement
Advertisement