ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు డజనకు పైగా సీనియర్ ఉద్యోగులు ఆ సంస‍్థకు రాజీనామా చేశారు. తాజాగా, యాపిల్ సీనియర్ డిజైనర్ పీటర్ రస్సెల్ క్లార్క్ బయటకు వచ్చారు. ఆ సంస్థలో పనిచేస్తున్న సీనియర్ డిజైనర్‌లలో ఈయన ఒకరు.
బ్లూమ్ బెర్గ్ నివేదిక ప్రకారం.. క‍్లార్క్ యాపిల్ కంపెనీలో ప్రముఖ డిజైనర్. ముఖ్యంగా యాపిల్ ప్రొడక్ట్‌లు ఐమాక్,ఐపాడ్ నానో,మాక్ బుక్ ప్రో, మాక్ బుక్ ఎయిర్ తో పాటు ఇతర ప్రొడక్ట్‌లలోని హార్డ్‌వేర్‌లను డిజైన్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాదు యాపిల్ హెడ్ క్వార‍్టర్స్, ఇతర యాపిల్ రీటైల్ స్టోర్‌ల డిజైన్‌లలో పీటర్ రస్సెల్ క్లార్క్ భాగస్వామ్యం ఉంది.
యాపిల్ కంపెనీలో సుమారు 1000కి పైగా పెటెంట్ రైట్స్ క్లార్క్ పేరుమీదే ఉన్నాయి. అలాంటి డిజైనర్ కుపెర్టినో దిగ్గజం కోల్పోవడం పెద్ద ఎదురు దెబ్బేనని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. ఇక, ఈ ఏడాది అక్టోబర్‌లో యాపిల్‌కు రిజైన్ చేసిన క్లార్క్ స్పేస్ టెక్నాలజీ కంపెనీ వాస్ట్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆ కంపెనీ తయారు చేసే ప్రొడక్ట్‌లపై సలహాలు ఇచ్చేలా సలహాదారుగా బాధ్యతలు చేపట్టనున్నారు.
క్లార్క్ మాత్రమే కాదు ప్యాషన్ కోసం యాపిల్ విడిచి పెట్టిన వారిలో జోనీ ఐవ్‌తో సహా అనేక ఇతర ఆపిల్ డిజైనర్లు 2019లో తన స్వంత డిజైన్ కంపెనీ లవ్‌ఫ్రమ్‌ని స్థాపించడానికి యాపిల్‌కి గుడ్‌బై చెప్పారు. ఐవ్ యాపిల్‌లో 1992 నుండి 2019 వరకు 27 సంవత్సరాలు పని చేశారు. 1990ల చివరిలో యాపిల్ ప్రొడక్ట్ డిజైన్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందారు. ఆ తర్వాత 2015లో చీఫ్ డిజైన్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టి జూలై 2019లో కంపెనీని విడిచిపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment