పిల్లల కోసం ప్రత్యేకం | Special for kids | Sakshi
Sakshi News home page

పిల్లల కోసం ప్రత్యేకం

Published Sat, Oct 3 2015 1:27 AM | Last Updated on Sun, Sep 3 2017 10:21 AM

పిల్లల కోసం ప్రత్యేకం

పిల్లల కోసం ప్రత్యేకం

 హైదరాబాద్: చిన్నారుల కోసం ప్రత్యేకమైన గది ఉంటేనే ‘మా ఇల్లు అందమైన హరివిల్లు’ అని పాడుకోవచ్చు. చిన్నారుల ఆలోచనలు, ఆసక్తిలను గమనించిన నేటితరం తల్లిదండ్రులు పిల్లల కంటూ ప్రత్యేకమైన గదిని కేటాయిస్తున్నారు. అంతేకాదు ఆ గదిలో చిన్నారుల సృజనాత్మక శక్తిని మేల్కొలిపే విధంగా, వారిలో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగించేలా తీర్చిదిద్దుతున్నారు. చిన్నారుల గది డిజైన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..

చిన్నారులు గదిలో ఆడడం, చదవడం, నిద్రపోవడం లాంటివి చేస్తారు. అదే వాళ్ల ప్రపంచం. వారిని ఆకట్టుకునేలా ముదురు రంగులు వాడటమే కాకుండా గోడల మీద రకరకాల డిజైన్లు వేయడం, ఒకే గోడ మీద రెండు రంగులు వేయడం చేయవచ్చు.

 పిల్లల గదుల్లో రంగులు, అలంకరణ వారికి ఆహ్లాదం కలిగించేలా ఉండాలి. గదంతా కార్టూన్లతో నింపకుండా ఒకే గోడకు మాత్రమే కార్టూన్లకు కేటాయిస్తే సరిపోతుంది.

చిన్నారుల కోసం ఫర్నిచర్, మంచం లాంటివి కొనేప్పుడు అందంతో పాటు పిల్లల భద్రత, సౌకర్యాలకు కూడా ప్రాధాన్యమివ్వాలి.

మంచంపై బెడ్ మరీ గట్టిగా ఉండకుండా చూసుకోవాలి. కొద్దిగా మెత్తగా ఉంటే పిల్లలు ఇష్టంగా ఎక్కువసేపు నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది.

 పిల్లల పుస్తకాల కోసం ప్రత్యేకంగా ఒక స్థలాన్ని కేటాయించి, చక్కటి ఆల్మరాను పెట్టించడం మంచిది.

 పిల్లలను ఆకట్టుకోవడంలో రంగులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మానసిక శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం చిన్న పిల్లలు ఎరుపు, నీలం, పసుపు రంగులను ఇష్టపడతారు. ఇవి కాకుండా ఆకుపచ్చ, పర్పుల్‌లు కూడా ఓకే. ఇక వయొలెట్, పింక్‌లు కూడా పర్వాలేదు. అన్నింటికన్నా ముఖ్యం మీ చిన్నారి ఏ రంగుని ఇష్టపడుతున్నాడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మొత్తం అంతా ఒకే రంగు కాకుండా గదిలో వేర్వేరు చోట్ల వేర్వేరు రంగులను నింపడం ద్వారా అందాన్ని తేవచ్చు.
 స పిల్లలకు ఇష్టమైన కార్టూన్ క్యారెక్టర్లను గోడలపై చిత్రించడం ద్వారా వారికి ఆనందాన్ని కలుగచేయవచ్చు. రాత్రిళ్లు నిద్రపోయే ముందు లైట్స్ ఆఫ్ చేస్తే పిల్లలు కొత్తల్లో భయపడే అవకాశం ఉంది. సీలింగ్‌కు చీకట్లో కూడా మెరిసే విధంగా ఉండే మెటాలిక్ రంగులు లేదా స్టెన్సిల్‌తో పెయింటింగ్‌లు వేస్తే చీకట్లో కూడా హాయిగా నిద్రపోతారు.

 పిల్లల గదిలో కంటికి శ్రమ కలిగించని ఫ్లోరోసెంట్ బల్బులను వాడాలి. లైటింగ్ స్టాండ్లు కూడా వంకీలు లేదా ఇతర డిజైన్లతో ఉంటే పిల్లలను ఆకట్టుకుంటాయి. అయితే కంటిపై ఎలాంటి ప్రభావం చూపకుండా, చదువుకొనేటప్పుడు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చూసుకోవాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement