Upasana Konidela Shares Special Video Of Her Delivery - Sakshi
Sakshi News home page

Upasana Konidela: కూతురి కోసం ప్రత్యేకంగా గది డిజైన్‌.. ఇలాంటి ప్రదేశంలో జన్మనివ్వడం..

Jul 14 2023 2:12 PM | Updated on Jul 14 2023 3:32 PM

Upasana Konidela Shares Special Video Of Her Delivery - Sakshi

ఈ ఏడాది మెగా ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఏడాది జూన్‌లో ఉపాసన- రామ్ చరణ్ తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత మెగా ఇంట్లోకి వారసురాలు అడుగుపెట్టింది. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్‌తో పాటు మెగా ఫ్యామిలీ సంబరాలు చేసుకున్నారు.  ఇటీవలే మెగా వారసురాలి బారసాల కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. తన మనవరాలి పేరును మెగాస్టార్ చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు. రామ్ చరణ్-ఉప్సీల బిడ్డకు క్లీంకార అనే పేరును పెట్టినట్లు వెల్లడించారు.

(ఇది చదవండి: రామ్ చరణ్- ఉపాసన బిడ్డకు ఆ పేరు.. అసలు కారణం ఇదేనా?)

అయితే ఉపాసన జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తనకు పుట్టబోయే బిడ్డకోసం ముందుగానే గదిని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. గది వాతావరణం ప్రకృతి ఒడిలో ఉన్న ఫీలింగ్ కలిగేలా గోడలను అందంగా తీర్చిదిద్దారు. దీని కోసం ప్రత్యేక డిజైనర్లు పనిచేశారు. ఆస్పత్రిలో ఉ‍న్నా కూడా ఇంట్లో ఉన్నట్లు ఫీలయ్యేలా ఉపాసన గదిని తీర్చిదిద్దారు.

పుట్టిన బేబీ చూడగానే బొమ్మలు, పక్షులు, చెట్లు కనిపించేలా కర్టన్స్ డిజైన్ చేయించారు. ఫారెస్ట్‌ను తలపించేలా డిజైనర్స్ దీనిని తయారు చేశారు. వాటిని తన బిడ్డకు గదిలో కనిపించేలా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఉపాసన ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

(ఇది చదవండి: అలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం.. కల్యాణ్ దేవ్ పోస్ట్ వైరల్)  

ఉపాసన ట్వీట్‌లో రాస్తూ..'అమ్రాబాద్ ఫారెస్ట్, వేద వైద్యం ద్వారా ప్రేరణ పొందిన ఈ సుందరమైన ప్రదేశాలలో నేను జన్మనివ్వడం. నా క్లీంకారను పెంచడం ఎంత ఆనందించానో మీకు చెప్పలేను. ధన్యవాదములు పవిత్రా రాజారామ్.' అంటూ పోస్ట్ చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement