Upasana starts free OPD services every sunday for single mothers - Sakshi
Sakshi News home page

Upasana: వారిని చూసి తీవ్రంగా చలించిపోయా.. మా లక్ష‍్యం అదే: ఉపాసన

Published Fri, Aug 11 2023 9:25 PM | Last Updated on Sat, Aug 12 2023 11:21 AM

Upasana Started OPD services every Sunday exclusively for single mothers - Sakshi

ఉపాసన కొణిదెల తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. మెగా కోడలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే మెగా ఇంట్లో వారసురాలు అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్‌, ఉపాసన బిడ్డకు క్లీంకారగా నామకరణం చేశారు. అయితే మెగాకోడలు ఉపాసన ప్రస్తుతం తల్లిగా చాలా బిజీగా ఉంది. ఎందుకంటే ఈ జూన్‌లో కూతురు పుట్టిన తర్వాత ఈమె జీవితంలో చాలా మార్పులు వచ్చాయని తెలిపింది. తన బిడ్డ వల్ల మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నట్లు వెల్లడించింది. 

(ఇది చదవండి: మొన్న సెలవులు.. ఇప్పుడేమో ఏకంగా జైలర్ స్పెషల్ షోలు..!)

అయితే సామాజిక ఉపాసన సేవలోనూ ఎప్పుడు ముందుంటుంది. తన సేవలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటోంది. అలానే ఒంటరి తల్లుల కోసం ఓ మంచి నిర్ణయం తీసుకుంది. వారి కోసం ప్రత్యేకంగా ప్రతి ఆదివారం ఉచిత ఓపీడీ సేవలు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అపోలో చిల్డ్రన్స్ పేరిట జూబ్లీహిల్స్‌లోని ఆస్పత్రిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ వీడియోను కూడా షేర్ చేసింది. దీంతో ఉపాసన చేస్తున్న సేవలను నెటిజన్స్ అభినందిస్తున్నారు. 

ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ.. 'హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో అపోలో చిల్డ్రన్స్ ప్రారంభోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా.. ఒంటరి తల్లుల కోసం ప్రత్యేకంగా ప్రతి ఆదివారం ఉచిత ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ (OPD) సేవలను పరిచయం చేయడం గర్వకారణం. ప్రతి ఒక్కరూ 040 -23607777 నంబర్‌కు కాల్‌ చేసి మీ స్లాట్‌ను బుక్ చేసుకోండి. ఈ సేవలు ప్రతి ఆదివారం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటలవరకు అందుబాటులో ఉంటాయి. సంతాన సాఫల్యతతో ఎదురయ్యే సవాళ్లను, ఒంటరి తల్లులను చూసి నేను తీవ్రంగా చలించిపోయా. ప్రత్యేక శిశువైద్యుల బృందం, అత్యాధునిక సాంకేతికతతో, అపోలో హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం వారి ఆరోగ్య సంరక్షణ ప్రయాణంలో మీ కుటుంబాలను ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. ప్రతి బిడ్డకు సమగ్ర సంరక్షణ అందే విధంగా పెంపొందించే వాతావరణాన్ని సృష్టించడం మా లక్ష్యం.' అంటూ పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉపాసన నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.

(ఇది చదవండి: తన ప్రెగ్నెన్సీ గురించి ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement