అందరికీ ఇళ్ల పథకం కోసం డిజైన్లను సిద్ధం చేయాలి
Published Sat, Jul 22 2017 12:07 AM | Last Updated on Tue, Sep 5 2017 4:34 PM
కాకినాడ సిటీ:
జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్‌టీఆర్ నగర్ పథకం కింద ఎనిమిది పురపాలక సంఘాల్లో నిర్మించే అందరికీ ఇళ్ల పథకం గృహాల కోసం లేఅవుట్, గృహ నిర్మాణ డిజైన్లు సిద్ధం చేయాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అందరికీ ఇళ్ల పథకం అమలును ఏపిటెడ్‌కో, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లతో సమీక్షించారు.
సంక్షేమ శాఖలపై...
జిల్లాలోని అన్ని బీసీ సంక్షేమ వసతి గృహాల్లో బయో మెట్రిక్ హాజరు విధానాన్ని అమలు పర్చాలని ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ తన చాంబర్‌లో బీసీ సంక్షేమం, బీసీ కార్పొరేషన్ అధికారులతో సమావేశమై వెనుకబడిన తరగతుల విద్య, ఉపాధి కోసం అమలు చేస్తున్న కార్యక్రమాల ప్రగతిని సమీక్షించారు.
సూక్ష్మ, సాగు వ్యవస్థల ఏర్పాటు ముమ్మరం...
జిల్లాలో ఈ నెలాఖరు నాటికి 4 వేల హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ వసతుల విస్తరణకు లబ్ధిదార రైతుల బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, సూక్ష్మ, సాగు వ్యవస్థల ఏర్పాటు ముమ్మరం చేయాలని ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ చాంబర్‌లో మైక్రో ఇరిగేషన్‌వసతుల విస్తరణపై ఏపీఏఐపీ, ఉద్యానశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
Advertisement
Advertisement