దసరా నవరాత్రులంటేనే దాండియా డ్యాన్సుల హంగామా!ఈ సంబరంలో ధరించే దుస్తులతో వెండి ఆభరణాల అందమూ పోటీపడుతుంది. వెన్నెలంతా ‘వెండి’గా మారిపండగ వేళ తనూ పాదం కలిపి మెరిసిపోతుంది. చీరకట్టుకు సింగారమై మురిసిపోతుంది...
సిల్వర్ టిప్స్
∙దేశీ స్టైల్‌లో ఒక తెల్లటి కుర్తా, కలర్‌ఫుల్ స్టోల్ వేసుకుని.. నలుపు, తెలుపులో ఉన్న వెండివి పెద్ద పెద్ద జూకాలు, గాజులు ధరిస్తే చాలు డ్రెస్‌కే అందం వస్తుంది. లేదంటే పొడవాటి లాకెట్ హారం వేసుకున్నా చాలు. ఫ్యామిలీ ఈవెంట్స్‌కి సరైన ఎంపిక ∙సిల్వర్ ఆభరణాలు యంగ్ ఎనర్జీని తీసుకువస్తాయి. వేడుకలో ఉల్లాసాన్ని పెంచుతాయి ∙చేతులకు పెద్ద పెద్ద వెండి కంకణాలు లేదంటే వేలికి పెద్ద ఉంగరం ధరించినా చాలు మీ స్టైల్‌లో గొప్ప మార్పు వచ్చేస్తుంది ∙కాళ్లకు వెండి పట్టీలు, మెట్టెల అందం సంప్రదాయ అతివలకు ఎన్నో ఏళ్లుగా పరిచయమే. ఈ లోహపు చల్లదనం అతివ చర్మానికి వెన్నెల చల్లదనాన్ని çపంచుతుంది. అందుకే మహిళలు వెండిని ధరించడానికి మక్కువ చూపుతారు. మిగతా లోహపు ఆభరణాలతో పోల్చితే వెండి ఆభరణం ధర దాదాపుగా అందరికీ అందుబాటులో ఉంటుంది. ఆర్టిఫిషయల్ జువెల్రీలా చర్మసమస్యలు లేకపోవడం కూడా ఈ లోహపు ఆభరణానికి ప్లస్ అవుతోంది ∙బాగున్నాయి కదా అని మరీ అతిగా అలంక రించుకుంటే వెండి ఎబ్బెట్టుగా ఉండచ్చు.
స్ట్రీట్ స్టైల్
కాలేజీకి వెళ్లే అమ్మాయిలు ధరించే ఇండో–వెస్ట్రన్ స్టైల్ డ్రెస్సులకు బాగా నప్పే ఆక్సిడైజ్డ్ సిల్వర్ జువెల్రీ బాగా నప్పుతుంది. అలాగే ప్రయాణాలకూ ఇవి అనువైనవనే పేరు వచ్చింది. టూర్లకు వెళ్లినప్పుడు ఈ తరహా ఆభరణాలనూ కొనుగోలు చేస్తుంటారు.
హ్యాండ్లూమ్స్ – సిల్వర్
మన దేశీయ చేనేతలకు వెస్ట్రన్ టచ్ ఇస్తే మోడ్రన్ స్టైల్‌తో వెలిగిపోవచ్చు అనేది నేటి మగువ ఆలోచన. ఆ థీమ్‌తోనే పెద్ద పెద్ద లాకెట్స్‌తో ఉన్న పొడవాటి హారాలు, మెడను అంటిపెట్టుకునే చోకర్స్, టెంపుల్ జువెల్రీ డిజైన్ చేస్తున్నారు. వెస్ట్రన్ డ్రెస్‌లకే కాదు సంప్రదాయ కుర్తీ, గాగ్రా–ఛోలీ, చీరల మీదకూ అందంగా నప్పుతున్నాయి. ఈ వెండి ఆభరణాలు డిజైన్‌ను బట్టి రూ.400/– నుంచి లభిస్తున్నాయి.
వెండా, బంగారమా! అని పోటీ పడే రోజులు వచ్చేశాయి. ముదురు పసుపు చాయలో ఉండే బంగారానికి పూర్తి కాంట్రాస్ట్ కలర్ తెలుపులో వెండి ఆభరణాలు పాశ్చాత్య దుస్తుల మీదకే కాదు సంప్రదాయ చీరకట్టుకూ వైవిధ్యమైన కళను తెస్తున్నాయి. పండగల్లో బంగారంతో పోటీపడుతున్నాయి.
కంచిపట్టు – సిల్వర్
కంచిపట్టు చీరల మీదకు బంగారు ఆభరణమే వాడాలనే కచ్చితమైన నిర్ణయం ఇప్పుడేమీ లేదు. ఎందుకంటే, ఫ్యాషన్ జువెల్రీ వరసన చేరినప్పటికీ సంప్రదాయ ఆభరణ డిజైన్లు వెండి లోహంతోనూ తయారుచేస్తున్నారు నిపుణులు. వీటిలో మామిడిపిందెలు, కాసుల హారాలు, గుట్టపూసలు, కెంపులు–పచ్చలు పొదిగిన పొడవాటి, పొట్టి నెక్లెస్‌ల అందం అబ్బురపరుస్తున్నాయి. ఇవి పట్టు చీరల మీదకు అందంగా నప్పుతున్నాయి. పండగలో ప్రత్యేక కళను నింపుతున్నాయి. తక్కువ ధరతో ఎక్కువ అందంగా వెలిగిపోవచ్చు. హ్యాండ్లూమ్ చీరల మీదకు వెండితో తయారుచేసిన బొహెమియన్ స్టైల్ డిజైనర్ హారాలు
Comments
Please login to add a commentAdd a comment