ప్లెయిన్ షర్ట్‌కి పచ్చబొట్టు!
సాదా షర్ట్, లేదంటే ఏదైనా టాప్ మీదకు నచ్చిన చిత్రం డిజైన్‌గా వేయాలంటే మీరు చిత్రకారులే కానక్కర్లేదు. బ్లీచ్‌ను స్ప్రే చేస్తే చాలు. ఇది ఎలాంటిదంటే ఒంటి మీద పచ్చబొట్టు (టాటూ) వేసినట్టుగా దుస్తులపై డిజైన్స్ వేయడం అన్నమాట. అయితే, ఈ డిజైన్స్ కేవలం కాటన్ దుస్తుల మీద మాత్రమే వేయగలం.5-6 నిమిషాల తర్వాత బ్లీచ్ స్ప్రే చేసిన షర్ట్‌ని చల్లని నీటిలో ముంచాలి. రెండు మూడు సార్లు నీళ్లలో తీసి, ఆరేయాలి. మీరు కోరుకున్న డిజైన్‌తో షర్ట్ కొత్తగా మెరిసిపోతుంది.
కావల్సినవి: ప్లెయిన్ కాటన్ షర్ట్, లేదంటే టీ షర్ట్ బాగా జల్లించిన బ్లీచ్ పౌడర్. (బ్లీచ్‌కి దుస్తుల రంగును పోగొట్టే గుణం ఉంటుంది. బ్లీచ్‌ని నీళ్లలో కలిపి స్ప్రే బాటిల్‌లో పోసి ఉపయోగించవచ్చు. పౌడర్‌ని మాత్రమే కూడా వాడవచ్చు.) ఎంచుకున్న చిత్రం బ్లాటింగ్ పేపర్ కార్డ్‌బోర్డ్ (షర్ట్ వెనుక భాగాన బ్లీచ్ పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇందుకు షర్ట్ లోపలి వైపు ఒక కార్డ్‌బోర్డ్‌ను అమర్చాలి. బ్లీచ్ ఎక్కువ స్ప్రే చేసినా, కార్డ్‌బోర్డ్ పీల్చేసుకుంటుంది.) చేతులకు గ్లౌజ్ వేసుకుంటే బ్లీచ్‌లోని రసాయనాలకు చర్మం దెబ్బతినకుండా ఉంటుంది.
ఎంచుకున్న చిత్రం పైన మైనపు కాగితాన్ని (బ్లాటింగ్ పేపర్) ఉంచాలి. పైన కొద్దిగా అదిమి, పేపర్ కదలకుండా జాగ్రత్తపడాలి. తర్వాత కింద కనిపిస్తున్న డిజైన్‌ను బట్టి, అంత మేరకు పై పేపర్‌ను కత్తిరించాలి. ఈ డిజైన్ పేపర్‌ను షర్ట్ మీద అతికించాలి. మెత్తని గుడ్డను ఉండలా చుట్టి, బ్లీచ్ పౌడర్‌ను అద్దుకుంటూ డిజైన్ ఉన్న బ్లాటింగ్ పేపర్ చుట్టూ డస్టింగ్ చేయాలి.