మన చేనేతలకు ఓ ప్రత్యేకత ఉంది. అది పోచంపల్లి, గద్వాల, కంచిపట్టు, పటోలా.. వంటి చేనేత చీరలు ఎప్పుడు ఏ సందర్భానికైనా బాగా నప్పుతాయి. అయితే, వీటికి కాంబినేషన్‌గా బ్లౌజ్ ఎలా డిజైన్ చేయించుకోవాలనే టెన్షన్ అస్సలు అవసరం లేదు. ఎందుకంటే ఒక డిజైనర్ తెలుపు లేదా క్రీమ్ కలర్ బ్లౌజ్‌ని జత చేస్తే చాలు. ముచ్చటైన కళతో వెలిగిపోతారు. చాలా వరకు డిజైనర్ బ్లౌజ్‌ల జాబితాలో నలుపు, తెలుపు రంగు బ్లౌజులు ఎలాగూ ఉంటాయి. హ్యాండ్లూమ్ చీర కట్టుకోవాలనుకున్నప్పుడు ప్రత్యేకంగా కనిపించాలంటే మీదైన తెలుపు రంగు జాకెట్టును «ధరిస్తే చాలు.
►పోచంపల్లి ఇకత్ చీరకు వైట్ బ్లౌజ్ ►నారాయణపేట చీరకు లాంగ్ స్లీవ్స్ జాకెట్ ► కంచిపట్టు చీరకు మగ్గం వర్క్ చేసిన తెలుపు రంగు జాకెట్టు ► గద్వాల చీరకు తెలుపు రంగు బ్లౌజ్ n పటోలా కాటన్ లేదా పట్టు చీరకు వైట్‌కలర్ డిజైనర్ బ్లౌజ్ ► బెంగాలీ కాటన్ చీరకు వైట్ కలర్ క్రాప్‌టాప్. ఇలా అభిరుచికి తగ్గట్టు డిజైన్ చేసుకున్న వైట్ బ్లౌజ్‌ని ఏ చేనేత చీరకైనా ఇంపుగా నప్పుతుంది. చేనేతకు కళబోత అన్న కితాబునిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment