వన వైభవం | Sarees are Designed with Natural Colors | Sakshi
Sakshi News home page

వన వైభవం

Published Fri, May 10 2019 12:12 AM | Last Updated on Fri, May 10 2019 12:12 AM

Sarees are Designed with Natural Colors - Sakshi

కాలానుగుణంగా డ్రెస్సింగ్‌ కాదుకళాత్మకంగా ఉండాలి.కాలాన్ని తట్టుకునేలా.. కాలాన్ని మరిపించేలా..కంటికి, మేనికిహాయిగొలిపేలా ఉండాలి. గిరిపుత్రుల కళారూపాలు ఎప్పుడూ మనల్ని పచ్చటి వనాలకు చేరువ చేస్తూనే ఉంటాయి. ఆ కళారూపాలు చీరల మీద కొలువుదీరితే వాటిని కట్టుకున్నవారు ఎక్కడ ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తారు.చూసినవారు వన వైభవంముంగిట్లోకి వచ్చిందని ముచ్చటపడతారు. 

వేసవి కాలం కాటన్‌ చీరల ఎంపిక సహజం. అయితే, కాలానికి అనుగుణంగా అనే ఆలోచన మాత్రమే కాకుండా కట్టుకున్న చీరకో ప్రత్యేకత ఉండేలా.. ఆ ప్రత్యేకత వస్త్రవైభవాన్ని పెంచేలా చూసుకోవచ్చు.

►భూమి, నీరు, ఆకాశం, అగ్ని, వాయువు.. ఇలా పంచమహాభూతాల అంశాలను కొంగుల మీదుగా డిజైన్‌ చేసినవి ఎంచుకోవచ్చు
►పక్షులు, జంతువులు, గిరిజనుల శక్తిరూపాలూ ప్రత్యేకతను చూపుతాయి.
►చెట్టూ, చేమలు .. ప్రేమకావ్యాలను చిత్రించిన చీరలూ ఓ కొత్త భాష్యాన్ని చెబుతుంటాయి
►పసుపు, ఎరుపు, తెలుపు, నీలం రంగుల కాంబినేషన్లు ఆహ్లాదాన్ని పంచే అడవి పువ్వుల అందాలను అనుభూతిని తెస్తాయి
► రెండు రకాల సాదా రంగుల ఫ్యాబ్రిక్‌ను ఎంచుకుని, వాటిని జత చేసి మీకు మీరే డిజైనర్‌ అయిపోనూ వచ్చు. 

ఫ్యాషన్‌ రంగంలో భారతీయ మూలాలను పట్టుకునేలా డిజైనర్లు ఎప్పటి కప్పుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటారు. ఎక్కడ ఉన్నా, ఎందరిలో ఉన్నా మన జానపదుల కళారూపాలకు ఆ శక్తి ఉండటం వల్లే చీరలు కొత్త సింగారాలతో ఆకట్టుకుంటున్నాయి. కళారూపాలు మాత్రమే కాదు వనాలను తలపించే రంగుల కాంబినేషన్లు, ప్రింట్లతో ఆకట్టుకునే డిజైన్లు కనువిందు చేస్తున్నాయి.

►సహజసిద్ధమైన రంగులతో తీర్చిన డిజైన్లు లెనిన్, కాటన్‌ ఫ్యాబ్రిక్స్‌ మీదా అందంగా రూపుకడుతున్నాయి
►ప్యాచ్‌వర్క్‌ గిరి పుత్రికల ప్రత్యేక కళ. పూర్తిగా చేతితోనే తీర్చిన ఈ డిజైన్‌ ఫ్యాబ్రిక్‌ ఏ వేడుకలోనైనా ప్రత్యేకత చూపుతుంది
►కొంగుల అంచులను సైతం చిన్నపాటి అల్లికతో ట్రైబల్‌ కళను తీసుకురావచ్చు
►అడవి బిడ్డల నివాసాలు, వాటి ముంగిట ముగ్గులు, అక్కడి జీవన విధానం.. ప్రతీది చీర íసింగారాన్ని పెంచేదే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement