combinations
-
సంక్రాంతి బరిలో...
హిట్ ఫిల్మ్ ‘గీత గోవిందం’ (2018) తర్వాత హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్స్ లో మరో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ . ‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలైందని వెల్లడించి, ఈ చిత్రాన్ని 2024 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లుగా శనివారం చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, కెమెరా: కేయూ మోహనన్స్ . -
కథ మళ్లీ కలిపింది
ఒక హీరో–ఒక డైరెక్టర్ ఒక హిట్ సినిమా ఇస్తే.. వారిది ‘హిట్ కాంబో’ అవుతుంది. అందుకే ఆ కాంబినేషన్లో రెండో సినిమా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. తమ కాంబో రిపీట్ అవ్వాలని హీరో–డైరెక్టర్‌కి కూడా ఉంటుంది. కానీ కథ కుదరాలి. అలా కొందరు హీరో–దర్శకులను మళ్లీ కథ కలిపింది. రెండోసారి రిపీట్ అవుతున్న ఆ కాంబినేషన్ గురించి తెలుసుకుందాం. దశాబ్దాల తర్వాత హీరోగా కమల్‌హాసన్, దర్శకుడిగా మణి రత్నంలది ఇండస్ట్రీలో సుధీర్ఘ ప్రయాణం. కానీ కమల్‌హాసన్, మణిరత్నంల కాంబినేషన్లో ఇప్పటివరకూ వచ్చిన చిత్రం ఒక్కటే. అదే ‘నాయకన్’ (తెలుగులో ‘నాయకుడు’–1987). అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఇంతటి బ్లాక్బాస్టర్ సక్సెస్ అందుకున్నప్పటికీ కమల్, మణిరత్నంల కాంబినేషన్లో మరో సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదు. ముప్పైఐదేళ్ల తర్వాత ఇప్పుడు కమల్, మణిరత్నంల కాంబో రిపీట్ కానుంది. మరోవైపు దర్శకుడు శంకర్‌తో ప్రస్తుతం ‘ఇండియన్ 2’ సినిమా చేస్తున్నారు కమల్‌హాసన్. శంకర్, కమల్ కాంబోలోనే 1996లో రిలీజైన బ్లాక్‌బస్టర్ హిట్ ఫిల్మ్ ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్ ఇది. సో.. కమల్–శంకర్ కాంబో మళ్లీ సెట్ అవ్వడానికి పాతికేళ్లు పైనే పట్టింది అన్నమాట. దేవర ఎన్టీఆర్ కెరీర్లో ఉన్న సూపర్ హిట్ చిత్రాల్లో ‘జనతా గ్యారేజ్’ ఒకటి. క్లాస్ టచ్‌తో మాస్ ఎలిమెంట్స్‌ను జోడించి దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించారు. కాగా ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ‘దేవర’ సినిమా సెట్స్‌పై ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్. విస్మరణకు గురైన భారతదేశ తీర ప్రాంతవాసుల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ‘దేవర’ విడుదల కానుంది. డబుల్ ఇస్మార్ట్ హీరో రామ్‌లోని పవర్ఫుల్ మాస్ యాంగిల్‌ని ‘ఇస్మార్ట్ శంకర్’ (2019)లో వెండితెరపైకి తెచ్చారు దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ చిత్రం ఇటు రామ్, అటు పూరి జగన్నాథ్ కెరీర్లకు ఆ సమయంలో బాగా బూస్టప్ ఇచ్చింది. ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ చేయనున్నారు రామ్ అండ్ పూరి. వచ్చే ఏడాది మార్చి 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఫ్యామిలీ స్టార్ ‘గీత గోవిందం’ (2018)తో రూ. వంద కోట్ల క్లబ్లో చేరారు హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమాకు పరశురామ్ దర్శకుడు. ఐదేళ్ల తర్వాత విజయ్, పరశురామ్ కాంబోలో సెకండ్ ఫిల్మ్‌గా రూపొందనున్న సినిమా ప్రారంభోత్సవం ఇటీవల జరిగింది. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. కాగా ఈ చిత్రానికి ‘ఫ్యామిలీ స్టార్’, ‘కుటుంబరావు’ అనే టైటిల్స్‌ని పరిశీలిస్తున్నారని సమాచారం. అడ్వంచరస్ డ్రామా రెండున్నరేళ్ల క్రితం కోవిడ్ సమయంలో విడుదలైన ‘భీష్మ’ చిత్రాన్ని ఆడియన్స్ ఆదరించారు. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది. ఇప్పుడు నితిన్–వెంకీ కుడుమల రెండోసారి మరో ఫిల్మ్ చేస్తున్నారు. ‘భీష్మ’ చిత్రంలో హీరోయిన్గా నటించిన రష్మికా మందన్నా ఈ చిత్రంలో కూడా హీరోయిన్ పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ఇటీవల మొదలయ్యాయి. అడ్వెంచరస్ ఎంటర్టైనర్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. రాక్షస రాజు ‘నేనే రాజు నేనే మంత్రి’ (2017) చిత్రంలో జోగేంద్ర పాత్రలో హీరో రానా కాస్త నెగటివ్ షేడ్స్‌లో మెప్పించారు. అలాంటి కథతో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు తేజ. అయితే రానా, తేజ కాంబోలో మరో సినిమా కన్ఫార్మ్ కావడానికి ఆరేళ్ల సమయం పట్టింది. రానా, తేజ కాంబినేషన్లోని సెకండ్ ఫిల్మ్ ‘రాక్షస రాజు’ (వర్కింగ్ టైటిల్) షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. భైరవ కోనలో... ‘టైగర్’ (2015) చిత్రం కోసం తొలిసారి చేతులు కలిపారు హీరో సందీప్ కిషన్, దర్శకుడు వీఐ ఆనంద్. ప్రస్తుతం వీరి కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘ఊరిపేరు భైరవకోన’. సస్పెన్స్, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. వీరే కాదు.. మరికొందరు హీరోలు, దర్శకులు తమ కాంబోలో రెండో సినిమా ఇవ్వడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. -
కొత్త కథ విన్నారా?
‘డాన్ శీను(2010)’, ‘బలుపు (2013)’, ‘క్రాక్ (2021)’ చిత్రాల తర్వాత హీరో రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో మరో సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు రంగం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల గోపీచంద్ మలినేని చెప్పిన ఓ కథ రవితేజకు నచ్చిందట. దీంతో ఈ సినిమాను వీలైనంత త్వరగా సెట్స్‌పైకి తీసుకుని వెళ్లాలనుకుంటున్నారట రవితేజ. ఈ సినిమాను మైత్రీమూవీ మేకర్స్ నిర్మించనుందని భోగట్టా. ఇక ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి యూరప్ ట్రిప్‌లో ఉన్నారు రవితేజ. ఆయన నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రం అక్టోబరు 20న రిలీజ్‌కు రెడీ అవుతుండగా, మరో చిత్రం ‘ఈగిల్’ (వర్కింగ్ టైటిల్) సెట్స్‌పై ఉంది. -
క్రేజీ కాంబినేషన్
తమిళ హీరో విజయ్, దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్లో సినిమా ఖరారైంది. ఈ క్రేజీ కాంబినేషన్లో మూవీని ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కల్పతి యస్. అఘోరం, యస్. గణేష్, యస్. సురేష్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ‘బిగిల్’ చిత్రం తర్వాత విజయ్‌తో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న రెండో చిత్రం ఇది. పైగా ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు యూనిట్ పేర్కొంది. కాగా విజయ్ ప్రస్తుతం ‘లియో’ సినిమా చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబరు 19న విడుదల కానుంది. -
కమల్‌కు జోడీ?
విలక్షణ నటుడు కమల్‌హాసన్‌కి జోడీగా దక్షిణాది స్టార్ హీరోయిన్స్‌లో ఒకరైన నయనతార నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘ఇండియన్ 2’ సినిమాతో బిజీగా ఉన్న కమల్‌హాసన్ ఆ తర్వాతి చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు మణిరత్నంతో చేయనున్నారు. మణిరత్నం–కమల్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘నాయగన్’ 1987 అక్టోబర్ 21న విడుదలై, మంచి హిట్‌గా నిలిచింది. దాదాపు 36 ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్ రిపీట్ అవుతోంది. ఈ చిత్రానికి ‘కేహెచ్ 234’ అనే వర్కింగ్ టైటిల్ నిర్ణయించారు. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రంలో హీరోయిన్గా తొలుత త్రిష పేరు వినిపించింది. ‘మన్మధన్ అంబు’, ‘తూంగావనం’ చిత్రాల తర్వాత కమల్–త్రిష ముచ్చటగా మూడోసారి ‘కేహెచ్ 234’ కోసం పని చేయనున్నారంటూ తమిళ చిత్ర సీమలో వార్తలొచ్చాయి. తాజాగా నయనతార పేరు తెరపైకి వచ్చింది. కథానాయిక పాత్ర కోసం ఆమెతో చర్చలు జరుపుతున్నారట మేకర్స్. చర్చలు సఫలమైతే కమల్‌తో నయనతార నటించే తొలి చిత్రం ఇదే అవుతుంది. మరి ‘కేహెచ్ 234’లో కమల్‌తో నటించే అవకాశం త్రిష, నయనతారలో ఎవర్ని వరిస్తుంది? వీరిద్దరూ కాకుండా వేరే కొత్త హీరోయిన్ తెరపైకి వస్తారా? అనే వివరాలు తెలియాలంటే వేచి చూడాలి. కాగా మణిరత్నం ప్రస్తుతం ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ నెల 28న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. మరోవైపు కమల్‌హాసన్ కూడా ‘ఇండియన్ 2’ తో బిజీగా ఉన్నారు. ఇటీవల దక్షిణాఫ్రికా షెడ్యూల్‌ను పూర్తి చేసి, ఇండియాకి తిరిగొచ్చింది యూనిట్. -
త్రివిక్రమ్-మహేశ్‌బాబు సినిమా షూటింగ్ అప్పుడే..
‘అతడు’ (2005), ‘ఖలేజా’(2010) చిత్రాల తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల రెండోవారం నుంచి ప్రారంభం కానుందనే టాక్ వినిపిస్తోంది. తొలుత ఓ యాక్షన్ ఎపిసోడ్‌ను ప్లాన్ చేశారట చిత్రబృందం. ‘మహర్షి’ చిత్రం తర్వాత మహేశ్‌బాబు, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న సినిమా ఇది. చినబాబు (ఎస్.రాధాకృష్ణ) నిర్మిస్తున్న ఈ మూవీ 2023 ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. -
కాంబినేషన్స్ రిపీట్.. 20ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు
కొన్ని కాంబినేషన్స్ రిపీట్ అవుతుంటాయి. అయితే ఎక్కువగా హీరో–హీరోయిన్ కాంబినేషన్ రిపీట్ అవుతుంటుంది. కానీ ఇప్పుడు రిపీట్ అవుతున్న కాంబినేషన్ వేరు. ఇరవై,ఇరవై ఐదేళ్ల తర్వాత ఆ కాంబినేషన్స్ కుదిరాయి. ‘రిపీట్టే’ అంటూ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకునేందు రెడీ అయిన ఆ స్టార్స్ గురించి తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవితో ఇప్పటి మాస్ మహారాజా అప్పటి అప్‌కమింగ్ హీరో రవితేజ కలిసి నటించిన చిత్రం ‘అన్నయ్య’ (2000). ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంలో చిరంజీవికి ఓ తమ్ముడిగా నటించారు రవితేజ (ఈ చిత్రంలో వెంకట్ మరో తమ్ముడు). అన్నతమ్ముల కెమిస్ట్రీ ‘అన్నయ్య’లో బాగానే పండింది. ఇక ఆ తర్వాత స్వయంకృషితో హీరోగా చాలా బిజీ అయ్యారు రవితేజ. ఇప్పుడు 22 ఏళ్లకు చిరంజీవి, రవితేజ కలిసి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాకు బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకుడు. ఈ చిత్రంలో కూడా చిరంజీవి, రవితేజ అన్నతమ్ముళ్లుగానే నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇందులో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. రజనీకాంత్ కెరీర్లో ‘పడయప్ప’ (తెలుగులో ‘నరసింహా’) సినిమాది ప్రత్యేక స్థానం. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివంగత నటి సౌందర్య హీరోయిన్గా నటించగా, నీలాంబరిగా రమ్యకృష్ణ పవర్ఫుల్ విలన్ రోల్ చేశారు. రజనీ, రమ్యకృషల మధ్య సన్నివేశాలు పోటా పోటీగా ఉంటాయి. 1999లో వచ్చిన ఈ చిత్రం తర్వాత రజనీకాంత్, రమ్యకృష మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోలేదు. తాజాగా మళ్లీ ‘జైలర్’ సినిమా కోసం రజనీ, రమ్యకృష్ణ కలిశారు. నీలాంబరిలానే ఇందులోనూ రమ్యకృష్ణ పవర్ఫుల్ నెగటివ్ షేడ్‌లో కనిపించనున్నారని తెలిసింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. దాదాపు 22 సంవత్సరాల తర్వాత హీరో అజిత్, హీరోయిన్ ఐశ్వర్యారాయ్ మళ్లీ కలిసి నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. హీరో అజిత్, దర్శకుడు విఘ్నేష్ శివన్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో హీరోయిన్గా మంజు వారియర్ పేరు తెరపైకి వచ్చింది. తాజాగా ఈ చిత్రంలో ఓ హీరోయిన్ పాత్రకు ఐశ్వర్యా రాయ్ పేరు వినిపిస్తోంది. ఒకవేళ ఆమె కన్ఫార్మ్ అయితే అజిత్, ఐశ్వర్యలు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకుంటున్నట్లే లెక్క. 'కండుకొండేన్ కండుకొండేన్’ (2000) చిత్రంలో అజిత్, టబు, ఐశ్వర్యా రాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. మరోవైపు ‘మాస్టర్’ (2021) చిత్రం తర్వాత హీరో విజయ్, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో మరో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ త్రిష నటించనున్నారనే ప్రచారం సాగుతోంది. ఇదే నిజమైతే 14 సంవత్సరాల తర్వాత విజయ్, త్రిష మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకున్నట్లు అవుతుంది. విజయ్, త్రిష వరిసారిగా ‘కురివి’ (2008) అనే చిత్రంలో నటించారు. ఈ సినిమాకు ముందు విజయ్, త్రిష కలిసి ‘గిల్లి’ (2004), ‘తిరుప్చా’ (2005), ‘ఆది’ (2006) చిత్రాల్లో నటించారు. ఇలాగే మరికొందరు తారలు కొంత గ్యాప్ తర్వాత మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు 20 ఏళ్ల క్రితం విజయ్‌కి విలన్‌గా నటించారు ప్రకాశ్‌రాజ్. ఈ హీరో–విలన్ 2004లో వచ్చిన ‘గిల్లి’ (తెలుగు హిట్ ‘ఒక్కడు’కి తమిళ రీమేక్)లో ఎవరి స్టయిల్లో వారు నటనలో రెచ్చిపోయారు. ఇప్పుడు ‘వారిస్’లో నటిస్తున్నారు. తమిళ హీరో విజయ్, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘వారిస్’ (తెలుగులో ‘వారసుడు’). ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్ విలన్‌గా నటిస్తున్నారు. రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. -
బీమా కంపెనీలు.. వీటిపై దృష్టి పెట్టాలి
కోవిడ్ పరిణామాల నేపథ్యంలో కస్టమర్ల ధోరణులు చాలా వేగంగా మారాయి. నిత్యావసరాల షాపింగ్, ఉద్యోగ విధుల నిర్వహణ మొదలుకుని ఆర్థిక లావాదేవీల వరకూ అన్నింటి నిర్వహణకు కొత్త విధానాలకు మళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఏడాదిన్నర కాలంగా డిజిటల్ సేవలు, కస్టమర్ సర్వీస్, అండర్‌రైటింగ్ తదితర విభాగాల్లో బీమా రంగం కూడా ఈ మార్పులను కొంత మేర చవిచూసింది. రాబోయే రోజుల్లో ఎప్పటికప్పుడు మారిపోతున్న కస్టమర్ల ధోరణులపై బీమా కంపెనీలు మరింతగా దృష్టి పెట్టాల్సి రానుంది. అలాగే, బీమా సంస్థలు మరింత విస్తృతమైన పాత్ర పోషించాల్సి వస్తుంది. క్లెయిముల సమయంలో చెల్లింపులు జరిపే సంస్థలుగా మాత్రమే మిగిలిపోకుండా, సంరక్షించే .. అనుకోని అవాంతరాలను నివారించగలిగే భాగస్వామిగా మారాల్సి ఉంటుంది. కొత్త కస్టమర్లలో ప్రధానంగా కొన్ని ధోరణులు ఉన్నాయి. అందులో ప్రధానమైనవి ఇలా ఉన్నాయి. అంతా డిజిటల్ ప్రస్తుతం అన్ని వయస్సుల వారు కూడా డిజిటల్ విషయంలో మిలీనియల్ యువత ఆలోచన ధోరణులకు తగ్గట్లుగా వ్యవహరిస్తున్నారు. రాబోయే రోజుల్లో లావాదేవీల నిర్వహణ ఎంత సులభతరంగా ఉంది, ఎంత వేగంగా చేయగలుగుతున్నారు అన్నవి కీలకంగా మారతాయి. కస్టమర్లకు మెరుగైన అనుభూతిని అందించేందుకు డేటాను వినియోగించడం, డిజిటైజేషన్‌ను వేగవంతం చేయాల్సి ఉంటుంది. మరింత కోరుకుంటున్న కస్టమర్లు కస్టమర్ల కొనుగోలు ధోరణుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. కస్టమైజేషన్‌కు ప్రాధాన్యం పెరిగిందే. రాబోయే రోజుల్లో ఒకే ఉత్పత్తిని అందరికీ ఉపయోగించవచ్చంటే కుదరదు. పాలసీదారు తగినంత జీవిత బీమా కవరేజీతో పాటు నిర్దిష్ట రిస్కులకు కూడా కవరేజీ కోరుకుంటారు. పాలసీదారుల వ్యక్తిగత అవసరాలకు తగ్గట్లుగా వైవిధ్యమైన, సరళమైన, కొంగొత్త పథకాలను అందించడంపై కంపెనీలు మరింతగా దృష్టి పెట్టాల్సి వస్తుంది. మరోవైపు, పలువురు కస్టమర్లు అనుభూతికి ప్రాధాన్యమిచ్చే వారై ఉంటున్నారు. సత్వరం స్పందించడం, వేగంగా పరిష్కార మార్గం చూపడం, భారీ స్థాయి సెల్ఫ్–సర్వీస్ సామర్థ్యాలు మొదలైనవి వీరు కోరుకుంటారు. కాబట్టి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు తమ కస్టమర్లకు తలెత్తబోయే అవసరాలను ముందస్తుగానే గుర్తించగలిగి, తగు వ్యూహాలను అమలు చేయడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఎక్కడైనా, ఎప్పుడైనా ప్రస్తుతం కస్టమర్లు ఎప్పుడైనా, ఎక్కడైనా సరే చిటికె వేయగానే సర్వీసులు అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నారు. సులభతరమైన ప్రక్రియలు, డిజిటల్ మాధ్యమాల వినియోగం రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుంది. దీంతో బీమా సంస్థలు మరిన్ని విధాలుగా కస్టమరుకు చేరువలో ఉండాలి. భౌతికమైన బ్రాంచీలు, ఫోన్ ఆధారిత కాంటాక్ట్ సెంటర్లు, చాట్‌బాట్స్, వాయ్సాప్, మొబైల్ యాప్స్, సోషల్ మీడియా ఇలా అన్ని చోట్ల అందుబాటులో ఉండగలగాలి. ఆరోగ్యానికి ప్రాధాన్యత మహమ్మారి పరిణామాల నేపథ్యంలో కస్టమర్లలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. ఎప్పటికప్పుడు మారే తమ అవసరాలను అర్థం చేసుకునే కంపెనీలకు వారు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ నేపత్యంలో జీవిత బీమా, ఆరోగ్య బీమా కంపెనీలు పరస్పరం తమ అనుభవాల ఆధారంగా కాంబో పథకాల్లాంటివి మరింతగా అందుబాటులోకి తేవాలి. కస్టమర్ బీమా అవసరాలన్నీ ఒకే చోట తీరేలా చూడగలగాలి. ఆరోగ్యాన్ని సంరక్షించుకునేలా కస్టమర్లను ప్రోత్సహించడం, రిస్కులు తగ్గించుకునే క్రమంలో బీమా సంస్థలు.. పలు వెల్నెస్ పార్ట్‌నర్స్‌తో చేతులు కలపవచ్చు. కాలానుగుణంగా ఏదేమైనా ఆరోగ్యం, సౌకర్యం, సరళత్వం ప్రాతిపదికగా సానుకూల అనుభూతి కలిగించే మార్పుల ప్రభావం చాలా కాలం పాటు ఉంటుంది. రిస్కులను తగ్గించడంతో పాటు విలువ ఆధారిత సేవలను అందించడంలో విభిన్నమైన పథకాలు అందించడంపై బీమా సంస్థలు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మారే కాలానికి అనుగుణంగా తామూ మారడం బీమా కంపెనీలకు ఎంతో కీలకం. -
పెరుగుతో ఆరోగ్యం.. వీటితో కలిపి తిన్నారంటే మాత్రం అంతే ఇక!
పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని మన పెద్దలు చెప్పేవారు. అంతేగాక వైద్యులు కూడా పెరుగు తినాలని సూచిస్తున్నారు. పెరుగు వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని ఎన్నో అధ్యయనాలు చెప్తున్నాయి. ఉదాహరణకు పెరుగులో కాల్షియం అధికంగా ఉంటుంది. దీనివల్ల ఎముకలు గట్టిపడతాయి. అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు రోజూ కప్పు పెరుగు తినడం ద్వారా వారికి మంచి ఫలితం ఉంటుంది. అయితే ఇలా ఎన్నో రకాలుగా ఆరోగ్యానికి ఔషదంలా పని చేసే పెరుగుని మనం ఎక్కవగా ఇతర ఆహారంతో కలిపే తీసుకుంటుంటాం. ఇందులో ఓ సమస్య దాగుంది, ఇదే పెరుగును కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవడం మంచిది కాదన్నది వైద్యుల అభిప్రాయం. అవేంటో వెంటనే తెలుసుకుందాం, ఎందుకంటే ఆరోగ్యమే మహా భాగ్యం కదా. మామిడి ►పెరుగును మామిడి పండుతో కలిపి అస్సలు తినకూడదు. అలా పెరుగుతో మామిడి కలిపి తినడం కారణంగా శరీరంలో అలర్జీ, చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. వేసవి కాలం వచ్చిందంటే ఈ కాంబో ఎక్కువ కనిపిస్తుంది. ఉల్లిపాయలు ► ఉల్లిపాయలతో పెరుగును కలిపి తినడం కూడా అంత మంచిదికాదు. ఉల్లి శరీరంలో వేడిని పుట్టిస్తే.. పెరుగు చల్లదానానికి కారణమవుతుంది. ఈ రెండు కలిపి తినడం వల్ల సోరియాసిస్, దద్దుర్ల వంటి చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. పాలు ►ఇక పెరుగును పాలతో కలిపి తినడం కూడా అంత మంచిది కాదన్నది నిపుణుల సలహా. రెండు తెల్లగానే ఉన్నాయి కదా తింటే ఏం కాదు అనుకోకండి. ఈ కాంబో తినడం వల్ల డయేరియాతో పాటు ఇతర జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణుల సలహా. చేపలు ►చేపలను పెరుగుతో కలిపి అసలు తినకూడదు. ప్రోటీన్లు పరంగా ఈ రెండింటిలో ఎక్కువగానే ఉన్నాయి కదా రెండింతలు ప్రోటీన్లు లభిస్తుందనుకుంటే పొరపాటే.. వీటిని కలిపి తినడం వల్ల కడుపులో గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వంటనూనేతో చేసే వంటకాలు ►వీటితో పాటు ఎక్కువ వంట నూనెలు తీసుకునే వంటకాలను సైతం పెరుగుతో కలిపి తినకపోవడమే మంచిదని వైద్యులు చెప్తుంటారు. చదవండి: సన్నగా ఉన్నవాళ్లు వ్యాయామం చేయొద్దా? -
బాలకృష్ణ 105వ చిత్రం ప్రారంభం
-
కాంబినేషన్ రిపీట్
బాలకృష్ణ–కె.ఎస్.రవికుమార్– సి.కల్యాణ్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. బాలకృష్ణ హీరోగా కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మించిన ‘జై సింహా’ సినిమా గత ఏడాది జనవరిలో విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఈ ముగ్గురి కాంబినేషన్లో తెరకెక్కనున్న నూతన చిత్రం గురువారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. సి.కె.ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ బోయపాటి శ్రీను కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. సీనియర్ దర్శకులు కోదండ రామిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఈ చిత్రానికి పరుచూరి మురళి చక్కని కథను అందించారు. జూలైలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. చిరంతన్ భట్ సంగీతం, రామ్‌ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రామ్–లక్ష్మణ్ పోరాట సన్నివేశాలు సినిమాకి హైలైట్‌గా ఉంటాయి. చిన్నా ఆర్ట్ వర్క్ అందిస్తున్నారు. త్వరలోనే ఇతర నటీనటుల వివరాలను తెలియజేస్తాం’’ అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి సహ నిర్మాత: సి.వి.రావ్. -
వన వైభవం
కాలానుగుణంగా డ్రెస్సింగ్ కాదుకళాత్మకంగా ఉండాలి.కాలాన్ని తట్టుకునేలా.. కాలాన్ని మరిపించేలా..కంటికి, మేనికిహాయిగొలిపేలా ఉండాలి. గిరిపుత్రుల కళారూపాలు ఎప్పుడూ మనల్ని పచ్చటి వనాలకు చేరువ చేస్తూనే ఉంటాయి. ఆ కళారూపాలు చీరల మీద కొలువుదీరితే వాటిని కట్టుకున్నవారు ఎక్కడ ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తారు.చూసినవారు వన వైభవంముంగిట్లోకి వచ్చిందని ముచ్చటపడతారు. వేసవి కాలం కాటన్ చీరల ఎంపిక సహజం. అయితే, కాలానికి అనుగుణంగా అనే ఆలోచన మాత్రమే కాకుండా కట్టుకున్న చీరకో ప్రత్యేకత ఉండేలా.. ఆ ప్రత్యేకత వస్త్రవైభవాన్ని పెంచేలా చూసుకోవచ్చు. ►భూమి, నీరు, ఆకాశం, అగ్ని, వాయువు.. ఇలా పంచమహాభూతాల అంశాలను కొంగుల మీదుగా డిజైన్ చేసినవి ఎంచుకోవచ్చు ►పక్షులు, జంతువులు, గిరిజనుల శక్తిరూపాలూ ప్రత్యేకతను చూపుతాయి. ►చెట్టూ, చేమలు .. ప్రేమకావ్యాలను చిత్రించిన చీరలూ ఓ కొత్త భాష్యాన్ని చెబుతుంటాయి ►పసుపు, ఎరుపు, తెలుపు, నీలం రంగుల కాంబినేషన్లు ఆహ్లాదాన్ని పంచే అడవి పువ్వుల అందాలను అనుభూతిని తెస్తాయి ► రెండు రకాల సాదా రంగుల ఫ్యాబ్రిక్‌ను ఎంచుకుని, వాటిని జత చేసి మీకు మీరే డిజైనర్ అయిపోనూ వచ్చు. ఫ్యాషన్ రంగంలో భారతీయ మూలాలను పట్టుకునేలా డిజైనర్లు ఎప్పటి కప్పుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటారు. ఎక్కడ ఉన్నా, ఎందరిలో ఉన్నా మన జానపదుల కళారూపాలకు ఆ శక్తి ఉండటం వల్లే చీరలు కొత్త సింగారాలతో ఆకట్టుకుంటున్నాయి. కళారూపాలు మాత్రమే కాదు వనాలను తలపించే రంగుల కాంబినేషన్లు, ప్రింట్లతో ఆకట్టుకునే డిజైన్లు కనువిందు చేస్తున్నాయి. ►సహజసిద్ధమైన రంగులతో తీర్చిన డిజైన్లు లెనిన్, కాటన్ ఫ్యాబ్రిక్స్ మీదా అందంగా రూపుకడుతున్నాయి ►ప్యాచ్‌వర్క్ గిరి పుత్రికల ప్రత్యేక కళ. పూర్తిగా చేతితోనే తీర్చిన ఈ డిజైన్ ఫ్యాబ్రిక్ ఏ వేడుకలోనైనా ప్రత్యేకత చూపుతుంది ►కొంగుల అంచులను సైతం చిన్నపాటి అల్లికతో ట్రైబల్ కళను తీసుకురావచ్చు ►అడవి బిడ్డల నివాసాలు, వాటి ముంగిట ముగ్గులు, అక్కడి జీవన విధానం.. ప్రతీది చీర íసింగారాన్ని పెంచేదే. -
పచ్చడి పచ్చడి చేయండి
ఒక్కదాన్ని చితకబాది పచ్చడి చేస్తే... రుచిగా ఉంటుంది.రెండిటిని కలిపి బాది బాది పచ్చడి చేస్తే... రుచిరుచిగా ఉంటుంది...ఈ రకం కాంబినేషన్ పచ్చళ్లు ఆల్రెడీ కలిపి కొడుతున్నాం కాబట్టిదేనితో కలిపినా రుచిగానే ఉంటుంది.కాని వేడి వేడి అన్నంలోకి నేతితో కలిపి తింటే రుచి రెట్టింపవుతుంది.ఇంకెందుకు ఆలస్యం... మీకు నచ్చిన కాంబినేషన్లను పచ్చడి పచ్చడి చేయండి.వేడివేడిగా ముద్దలు ముద్దలు లాగించేయండి. గోంగూర–పండుమిర్చి కావలసినవి: గోంగూర – అర కేజీ; పండు మిర్చి – పావు కేజీ; చింత పండు – 50 గ్రా.; నువ్వుల నూనె – పావు కేజీ; ఉప్పు – తగినంత; మెంతులు – ఒక టేబుల్ స్పూను (వేయించి పొడి చేయాలి); ఆవాలు – ఒక టేబుల్ స్పూను; ఎండు మిర్చి – 50 గ్రా.; ఇంగువ – రెండు టీ స్పూన్లు తయారీ: ►గోంగూరను శుభ్రంగా కడిగి, పొడి వస్త్రం మీద తడి పోయేవరకు నీడలో ఆరబెట్టాలి ►పండు మిర్చిని శుభ్రంగా కడిగి, తొడిమలు తీసి పొడి వస్త్రం మీద ఆరబెట్టాక, ముక్కలు చేయాలి ►స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక గోంగూర, చింత పండు వేసి కలపాలి ►బాగా వేగిన తరవాత దింపేసి, చల్లారనివ్వాలి ►మిక్సీలో పండు మిర్చి ముక్కలు, ఉప్పు వేసి కచ్చాపచ్చాగా తిప్పి, బయటకు తీసేయాలి ►చల్లారిన గోంగూర వేసి మెత్తగా చేయాలి ►మిక్సీ పట్టిన గోంగూర, పండు మిర్చి మిశ్రమాన్ని జాడీలోకి తీసుకుని బాగా కలపాలి ►మూడు రోజుల తరవాత, ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకోవాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, ఎండు మిర్చి వేసి వేయించాలి ►ఇంగువ జత చేసి కలిపి దింపేయాలి ►చల్లారాక పచ్చడిలో వేసి కలిపి, జాడీలోకి తీసుకోవాలి ►వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకుని తింటే రుచిగా ఉంటుంది. పండుమిర్చి దొరక్కపోతే, పండుమిర్చి పచ్చడిలో కలుపుకోవచ్చు. కొబ్బరి–కొత్తిమీర కావలసినవి: కొబ్బరి ముక్కలు – ఒక కప్పు; కొత్తిమీర తరుగు – అర కప్పు; పచ్చి మిర్చి – 5; ఉప్పు – తగినంత; చింత పండు – కొద్దిగా; పోపు కోసం:ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – రెండు; నూనె – ఒక టేబుల్ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను. తయారీ: ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండు మిర్చి వేసి వేయించి దింపేయాలి ►కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి వేసి మెత్తగా అయ్యేవరకు తిప్పాలి ►కొత్తిమీర, చింత పండు, ఉప్పు జత చేసి, అన్ని పదార్థాలు బాగా కలిసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టి దింపేయాలి ►పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుని, వేయించి ఉంచుకున్న పోపును జత చేయాలి ►ఈ పచ్చడి అన్నంలోకి, ఇడ్లీలోకి, దోసెలలోకి రుచిగా ఉంటుంది. టొమాటో– బీరకాయ కావలసినవి: బీరకాయలు – అర కిలో; టొమాటోలు – 4 (పెద్దవి); నూనె – 2 టేబుల్ స్పూన్లు; ఎండు మిర్చి – 8; పచ్చి సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; మినప్పప్పు – 2 టీ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; వెల్లుల్లి రెబ్బలు – 6; ఉల్లి తరుగు – అర కప్పు; ఉప్పు – తగినంత; పసుపు – కొద్దిగా; పోపు కోసం: ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి); ఆవాలు + జీలకర్ర – ఒక టీ స్పూను; మినప్పప్పు + పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – కొద్దిగా. తయారీ: ►బీరకాయలను శుభ్రంగా కడిగి, (చెక్కు తీయకుండా) ముక్కలు చేయాలి ►టొమాటోలను శుభ్రంగా కడిగి ముక్కలు చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, బీరకాయ ముక్కలు వేసి కలపాలి ►కొద్దిగా మగ్గి నీరు బయటకు వచ్చిన తరవాత టొమాటో ముక్కలు జత చేయాలి ►బాగా మగ్గిన తరవాత దింపి పక్కన పెట్టాలి ►అదే బాణలిలో మరి కాస్త నూనె వేసి కాగాక ఎండు మిర్చి, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి దోరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టాలి ►మిక్సీలో ముందుగా ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా చేయాలి ►పోపు వేసి మరోమారు మిక్సీ పట్టి మెత్తగా అయ్యాక, బీరకాయ, టొమాటో ముక్కల మిశ్రమం, తగినంత ఉప్పు వేసి మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి ►బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక, ఉల్లి తరుగు వేసి వేయించాలి ►కొద్దిగా వేగిన తరవాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చి సెనగపప్పు, ఎండు మిర్చి వేసి దోరగా వేయించాలి ►చివరగా కరివేపాకు వేసి కలపాలి ►తయారైన పచ్చడి జత చేసి రెండు నిమిషాల పాటు బాగా కలియబెట్టి స్టౌ మీద నుంచి దింపేయాలి ►కొత్తిమీరతో అలంకరించి, వేడివేడి అన్నంలోకి వడ్డించాలి. వంకాయ–ఉల్లిపాయ కావలసినవి: వంకాయలు – పావు కేజీ; ఉల్లిపాయ – 1 (పెద్దది); చింతపండు – కొద్దిగా; పచ్చి మిర్చి – 5; ఉప్పు – తగినంత; పసుపు – పావు టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; ఎండు మిర్చి – 10; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; నూనె – ఒక టేబుల్ స్పూను. తయారీ: ►వంకాయలను శుభ్రంగా కడిగి పొడవుగా ముక్కలు చేసుకోవాలి ►ఉల్లిపాయలను కూడా ముక్కలు చేసుకోవాలి ►స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ►అదే బాణలిలో మరి కాస్త నూనె వేసి కాగాక వంకాయ ముక్కలు, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు వేసి బాగా కలిపి, మూత పెట్టి, మంట బాగా తగ్గించాలి ►ముక్కలు మెత్తబడ్డాక మంట ఆర్పేసి, ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టాలి ►వేయించి ఉంచుకున్న పోపును కొద్దిగా పక్కన ఉంచుకుని, మిగతా పోపును మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ►చల్లారిన వంకాయ, ఉల్లిపాయ ముక్కల మిశ్రమం జత చేసి మరోమారు మిక్సీ తిప్పి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి ►పక్కన ఉంచుకున్న పోపు, పసుపు జత చేసి కలపాలి ►వేడి వేడి అన్నంలోకి రుచిగా ఉంటుంది. కొబ్బరి – కందిపప్పు కావలసినవి: కందిపప్పు – ఒక కప్పు; పచ్చి కొబ్బరి తురుము – ఒక కప్పు; చింతపండు – కొద్దిగా; ఎండు మిర్చి – 12; ఆవాలు – పావు టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – పావు టీ స్పూను; మినప్పప్పు – పావు టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; జీలకర్ర – అర టీ స్పూను; నూనె – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత తయారీ: ►స్టౌ మీద బాణలి ఉంచి, వేడయ్యాక కంది పప్పు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి దింపేయాలి ►చల్లారిన కందిపప్పును మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ►కొబ్బరి ముక్కలను జత చేసి కొద్దికొద్దిగా నీళ్లు జత చేస్తూ పచ్చడి మెత్తగా వచ్చేవరకు మిక్సీ పట్టాలి ►ఉప్పు, చింతపండు జత చేసి మరోమారు మిక్సీ పట్టి, పచ్చడిని ఒక పాత్రలోకి తీసుకోవాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు వేసి వేయించాక, కరివేపాకు జత చేసి మరోమారు కలిపి దింపేసి, పచ్చడి పైన వేసి కలపాలి ►వేడి వేడి అన్నంలోకి కమ్మటి నెయ్యి, అప్పడాలు, వడియాలు నంచుకుంటూ తింటే పచ్చడి మరింత రుచిగా ఉంటుంది. దోసకాయ – చింత కాయ కావలసినవి: దోసకాయలు – పావు కేజీ; చింత కాయలు – 50 గ్రా.; తరిగిన పచ్చి మిర్చి – 10; ఎండు మిర్చి – 10; ఇంగువ – అర టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను; మినప్పప్పు – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; మెంతులు – అర టీ స్పూను; పసుపు – కొద్దిగా; ఉప్పు – తగినంత; నూనె – 2 టేబుల్‌స్పూన్లు; ఉల్లి తరుగు – పావు కప్పు; వెల్లుల్లి రెబ్బలు – 5; తయారీ: ►దోసకాయ తొక్కు తీసి, సన్నగా ముక్కలు తరగాలి ►చింతకాయలను శుభ్రంగా కడిగి, గింజలు తీసేసి, చిన్నచిన్న ముక్కలు చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక తరిగిన పచ్చి మిర్చి వేసి వేయించాలి ►జీల కర్ర, కరివేపాకు జత చేసి వేయించాలి ►మిక్సీలో వెల్లుల్లి రేకలు, చింతకాయలు, వేయించి ఉంచుకున్న పచ్చి మిర్చి మిశ్రమం వేసి, మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టాలి ►కొన్ని దోసకాయ ముక్కలు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ►ఈ మిశ్రమాన్ని మిగిలిన దోసకాయ ముక్కలకు జత చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు, మినప్పప్పు, పచ్చి సెనగ పప్పు, ఎండు మిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి దోరగా వేయించి తయారుచేసి ఉంచుకున్న పచ్చడి మీద వేసి కలపాలి ►వేడి వేడి అన్నంతో తింటే రుచిగా ఉంటుంది. చింత కాయల బదులు చింతకాయ పచ్చడి కలుపుకో వచ్చు. క్యాబేజీ – ఉల్లిపాయ కావలసినవి: క్యాబేజీ – పావు కేజీ; ఉల్లి తరుగు – ఒక కప్పు; పచ్చిమిర్చి – 10; ఎండు మిర్చి – 2; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఇంగువ – కొద్దిగా; పసుపు – కొద్దిగా; చింత పండు – తగినంత; ఉప్పు – తగినంత; నూనె – ఒక టేబుల్ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – కొద్దిగా. తయారీ: ►క్యాబేజీని సన్నగా తరగాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక క్యాబేజీ వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి ►ఉల్లి తరుగు, చింత పండు, పచ్చి మిర్చి, ఉప్పు, పసుపు జత చేసి మూత పెట్టి, కొద్దిసేపు మగ్గిన తరవాత ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ►అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు, జీలకర్ర, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఎండు మిర్చి, వరుసగా వేసి వేయించాలి ►మిక్సీలో క్యాబేజీ, ఉల్లి తరుగు మిశ్రమం వేసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి ►వేయించి ఉంచుకున్న పోపు జత చేయాలి ►కొత్తిమీరతో అలంకరించాలి ►వేడి వేడి అన్నంలోకి కమ్మటి నేతితో ఈ పచ్చడి కలుపుకుని తింటే రుచిగా ఉంటుంది. నిమ్మకాయ – కాకరకాయ కావలసినవి: కాకరకాయలు – 4 (చక్రాలుగా తరగాలి); నిమ్మ కాయలు – 6 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); తరిగిన పచ్చి మిర్చి – 10; నిమ్మ రసం – ఒక కప్పు; మిరప కారం – 2 టేబుల్ స్పూన్లు; వెల్లుల్లి రెబ్బలు – 10; ఉప్పు – తగినంత; నూనె – 200 మి.లీ.; వేయించిన మెంతుల పొడి – అర టేబుల్ స్పూను. తయారీ: ►ఒక పాత్రలో కాకర కాయ చక్రాలు, నిమ్మ కాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, ఉప్పు వేసి బాగా కలపాలి ►మిరప కారం జత చేసి మరోమారు కలపాలి ►వెల్లుల్లి రెబ్బలు వేసి మరోమారు కలపాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక వేడి నూనెను పచ్చడిలో వేసి కలిపి మూడు రోజుల పాటు ఉంచాలి ►మెంతి పొడి వేసి మరోమారు కలిపి మరో మూడు రోజుల తరవాత వాడుకోవాలి ►అన్నంలోకి రుచిగా ఉంటుంది. టొమాటో – పుదీనా కావలసినవి: టొమాటోలు – అర కిలో; పుదీనా ఆకులు – ఒక కప్పు; పచ్చి మిర్చి – 6; నూనె – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; ఇంగువ – కొద్దిగా; పసుపు – కొద్దిగా తయారీ: ►స్టౌ మీద బాణలిలో ఒక టేబుల్ స్పూను నూనె వేసి వేడిచేయాలి ►జీలకర్ర వేసి వేయించాలి ►పచ్చి మిర్చి జత చేసి మరోమారు వేయించాలి ►పుదీనా తరుగు వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి ►టొమాటో తరుగు జత చేసి పచ్చివాసన పోయేవరకు వేయించి దింపేయాలి ►చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టాలి ►ఉప్పు, నూనె జత చేసి మరోమారు తిప్పాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, పచ్చి సెనగ పప్పు, కరివేపాకు, ఇంగువ, ఎండు మిర్చి వరుసగా వేసి వేయించి తీసి, పచ్చడి మీద వేసి కలపాలి ►అన్నంలోకి రుచిగా ఉంటుంది. ముల్లంగి – పుదీనా కావలసినవి: ముల్లంగి తరుగు – ఒక కప్పు; పుదీనా ఆకులు – ఒక కప్పు; పచ్చి మిర్చి – 5; చింతపండు – కొద్దిగా; ఉప్పు – తగినంత; నూనె – 2 టీ స్పూన్లు; పోపు కోసం... ఆవాలు – పావు టీ స్పూను; మినప్పప్పు – పావు టీ స్పూను; నూనె – ఒక టీ స్పూను; ఇంగువ – కొద్దిగా. తయారీ: ►చింతపండును పది నిమిషాల పాటు తగినన్ని నీళ్లలో నానబెట్టాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక తరిగిన పచ్చి మిర్చి వేసి వేయించాలి ►ముల్లంగి తురుము, పుదీనా అకులు జత చేసి ఐదారు నిమిషాల పాటు వాసన పోయేవరకు వేయించి, ప్లేట్లోకి తీసి చల్లారబెట్టాలి ►నానబెట్టిన చింతపండు, ముల్లంగి తురుము మిశ్రమం మిక్సీలో వేసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టి, ఒక పాత్రలోకి తీసుకుని పక్కన ఉంచాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, మినప్పప్పు వేసి చిటపటలాడేవరకు వేయించాలి ►ఇంగువ జత చేసి బాగా కలిపి దింపేయాలి ►ముల్లంగి పచ్చడి మీద వేసి కలియబెట్టాలి ►ఇడ్లీ, దోసె, పొంగల్, ఊతప్పం వంటి టిఫిన్లతో తింటే రుచిగా ఉంటుంది. కొత్తిమీర పచ్చడి కావలసినవి: తాజా కొత్తిమీర – 2 కప్పులు (శుభ్రపరిచి తరగాలి)పచ్చిమిర్చి – 4 (రెండుగా కట్ చేసుకోవాలి)చింతపండు పేస్ట్ – 1 టేబుల్స్పూన్ఉప్పు – రుచికి తగినంత తయారీ: కొత్తిమీర, పచ్చిమిర్చి, చింతపండు పేస్ట్, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ గట్టిగా అయితే కొద్దిగా నీళ్లు చల్లుకోవచ్చు. ఈ పచ్చడి పెసరట్టుకు, ఇడ్లీ, దోశ, వడ... ఏ టిఫిన్‌లోకైనా మంచి కాంబినేషన్ అవుతుంది. మిరపకాయబజ్జీలను ఈ చట్నీలో అద్దుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి. అలాగే బ్రెడ్ రోల్స్‌ని కూడా ఈ చట్నీలో ముంచుకొని తినచ్చు. నోట్: ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న కొత్తిమీర జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికీ, శ్వాసనాళాల్లో కఫం తొలగించడానికీ సహకరిస్తుంది. కొత్తిమీరను ఏదో ఒక రూపంలో తరచు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో భాగమే ఈ పచ్చడి. నువ్వులు–మామిడికాయ కావలసినవి: నువ్వులు– అర కప్పు; మామిడికాయ – 1 (మీడియం సైజుది); ఎండు మిర్చి – 10; పచ్చి మిర్చి – 5; పచ్చి సెనగపప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; పసుపు – కొద్దిగా; ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను, నూనె – రెండు టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; కరివేపాకు – రెండు రెమ్మలు తయారీ: ►స్టౌ మీద బాణలిలో నూనె లేకుండా నువ్వులు, ఎండు మిర్చి వేసి దోరగా వేయించి తీసేయాలి ►అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి ►ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి వేయించి పక్కన ఉంచుకోవాలి ►మామిడికాయ తొక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి ►మిక్సీలో నువ్వులు, ఎండు మిర్చి వేసి మెత్తగా చేయాలి ►వేయించిన పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ►మామిడికాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి, పచ్చడి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టి ఒక పాత్రలోకి తీసుకోవాలి ►వేయించుకున్న పోపు జత చేయాలి ►వేడి వేడి అన్నంలో కమ్మటి నెయ్యి వేసుకుని కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది. పల్లీ– దొండకాయ కావలసినవి: దొండకాయలు – పావు కేజీ; వేయించిన పల్లీలు – 50 గ్రా.; చింత పండు – నిమ్మకాయంత; ఉప్పు – తగినంత; పోపు కోసం... నూనె – ఒక టేబుల్ స్పూను; ఎండు మిర్చి – 10; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఇంగువ – కొద్దిగా; పసుపు – కొద్దిగా; కొత్తిమీర – ఒక టేబుల్ స్పూను; బాదం పప్పులు – 5 (నీళ్లలో సుమారు రెండు గంటలు నానబెట్టాలి). తయారీ: ►దొండకాయలను శుభ్రంగా కడిగి, ముక్కలు చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక దొండకాయ ముక్కలు, చింతపండు, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గిన తరవాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ►అదే బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీల కర్ర, ఎండు మిర్చి వరుసగా వేసి దోరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టాలి ►చల్లారిన పోపును మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ►వేయించిన పల్లీలు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ►దొండకాయ ముక్కలు, బాదం పప్పులు జత చేసి మెత్తగా అయ్యేవరకు తిప్పి, పచ్చడిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ►పసుపు, కొత్తిమీర జత చేయాలి. -
ముఖంపై నల్లమచ్చలు తగ్గేదెలా?
డర్మటాలజీ కౌన్సెలింగ్ నేను ఈ మధ్య ముఖం తెల్లబడటానికి ఒక బ్రాండ్‌కు చెందిన స్కిన్ వెటైనింగ్ క్రీమ్ ఉపయోగిస్తున్నాను. ముఖంలో మార్పు వచ్చింది కానీ... ముఖంపై మొటిమలతో నల్లమచ్చలు వస్తున్నాయి. ఇలా ఈ క్రీమ్ వాడటం మంచిదేనా? తెల్లబడటానికి సైడ్ ఎఫెక్ట్స్‌లేని మంచి క్రీమ్స్ ఏవైనా ఉంటే చెప్పగలరు. - సందీప్, ఖమ్మం మీ ముఖం రంగు తెల్లబడటానికి మీరు వాడిన కాంబినేషన్లో బహుశా మాడిఫైడ్ క్లిగ్‌మెన్స్ రెజిమెన్ ఉండి ఉండవచ్చు. అందులో కార్టికోస్టెరాయిడ్ ఉంటుంది. ఇది ఉండటం వల్ల ఆ క్రీమ్‌ను కొన్ని వారాలపాటు వాడినప్పుడు అది మొటిమలు వచ్చేందుకు దోహదం చేసి ఉంటుంది. దీన్ని ‘స్టెరాయిడ్ ఇండ్యూస్డ్ ఆక్నే’ అంటారు. దీని వల్లనే ముఖంపై మొటిమలు వచ్చి మచ్చలు పడతాయి. కాబట్టి మీరు ఈ క్రీమ్‌ను వాడటం మానేయండి. దీనికి బదులు మీరు ఆర్బ్యుటిన్, లికోరైస్ లేదా కోజిక్ యాసిడ్ ఉన్న క్రీములను వాడండి. అవి నల్లమచ్చలను తొలగిస్తాయి. ఇక మీ మొటిమలు తగ్గడానికి రాత్రివేళల్లో క్లిండామెసిన్ ఫాస్ఫేట్, అడాపలీన్ కాంబినేషన్ ఉన్న క్రీమ్‌ను రాసుకోండి. దాంతో మీ సమస్య తగ్గుతుంది. నా వయసు 25. నా సమస్య ఏమిటంటే... నా అరచేతులు, అరికాళ్లలో చెమటలు ఎక్కువగా పడుతున్నాయి. ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు, ఏదైనా రాసుకునే సమయంలో, ఎవరైనా చూస్తుంటే ఈ సమస్య మరీ ఎక్కువైపోయి నా చేతులు, కాళ్లు తడిసిపోతున్నాయి. ఫ్రెండ్స్‌తో కూడా సరిగా కలవలేకపోతున్నాను. చాలా ఇబ్బందిపడుతున్నాను. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - రాజేశ్, గుంటూరు. మీ సమస్యను వైద్యపరిభాషలో పామోప్లాంటార్ హైపర్ హైడ్రోసిస్ అంటారు. ఇది నరాలకు సంబంధించిన సమస్య. యాంగ్జైటీ వల్ల మీకు ఈ సమస్య ఎక్కువవుతోంది. యాంగ్జైటీ పెరిగినప్పుడు చెమట పట్టే ప్రక్రియ పెరుగుతుంది. దీనికి చికిత్స ఇలా... 1. బోట్యులినమ్ టాక్సైడ్ అనే ఇంజెక్షన్ ద్వారా దీన్ని కొద్దిమేరకు శాశ్వతంగా (సెమీ పర్మనెంట్)గా నయం చేయవచ్చు. ఈ ప్రక్రియను ఇటీవల విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఒకసారి ఈ ప్రక్రియ అనుసరించాక 4-6 నెలల్లో చెమటలు పట్టడం అదుపులోకి వస్తుంది. 2. దీనికి ఐయన్టోఫొరెసిస్ వంటి మరికొన్ని చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే అవి అంత మంచి ఫలితాలు ఇవ్వవు. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్ -
చిరుతిండితో Tea
చిటపట చినుకులతో సన్నని వాన కురుస్తూంటే... పొగలు కక్కే వేడి వేడి టీలో కరకరలాడే బిస్కెట్లు నంచుకుని తింటుంటే... ఏదో తెలియని అనుభూతి... మరేదో తెలియని ఆనందం... ఇదంతా పాతబడిపోయింది... ఇప్పుడు... మన ఇంటికి టీ సమయంలో అనుకోని అతిథి వస్తే... వాళ్లకి రొటీన్‌గా కాకుండా రకరకాల టీ లు తయారుచేసి... వాటికి రకరకాల స్నాక్స్ జత చేస్తూ అందిస్తే... వాళ్లు పొందే సంతోషం... సిప్పు సిప్పుకీ... ముక్క ముక్కకీ రెట్టింపు అవుతూ ఉంటుంది. ఈ వారం రకరకాల టీలను, రకరకాల స్నాక్స్ కాంబినేషన్లతో మీ అతిథులకు అందించండి... వారిచ్చే కాంప్లిమెంట్స్‌ని అందుకోవడానికి సిద్ధమైపోండి... పెపరీ నగ్గెట్స్ కావలసినవి: మైదాపిండి - కప్పు; ఉప్పు - అర టీస్పూను; బేకింగ్ పౌడర్ - అర టీ స్పూను; బేకింగ్ సోడా - అర టీ స్పూను; నల్ల జీలకర్ర - అర టీస్పూను; నెయ్యి - టేబుల్ స్పూను; కారం - చిటికెడు; నీళ్లు - తగినన్ని; నూనె - వేయించడానికి తగినంత తయారీ: ఒక పాత్రలో మైదాపిండి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి బాగా కలపాలి నెయ్యి లేదా నూనె జత చేసి ఈ మిశ్రమం బ్రెడ్ పొడిలా కనిపించేలా కలపాలి కారం, నల్ల జీలకర్ర జత చేసి బాగా కలపాలి తగినన్ని నీళ్లు జత చేసి చపాతీపిండిలా కలిపి, అప్పడాల పీట మీద మందంగా ఒత్తి, కావలసిన ఆకారంలో కట్ చేయాలి బాణలిలో నూనె వేసి కాగాక వీటిని అందులో వేసి దోరగా వేయించి, చల్లారాక వేడి వేడి టీతో అందించాలి. వైట్ టీ కావలసినవి: వైట్ టీ పొడి - 2 టీ స్పూన్లు (ఒక కప్పుకి); పంచదార - తగినంత (ఇష్టం లేనివాళ్లు పంచదార లేకుండా కూడా తాగచ్చు) తయారీ: నీళ్లను బాగా మరిగించాలి ఒక్కో కప్పులో 2 టీ స్పూన్ల టీ పొడి వేయాలి వేడి నీళ్లు పోసి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉంచాక, మూత తీసి తాగాలి (అవసరమనుకుంటే మధ్యలో ఒకసారి కలపాలి. అప్పుడు టీ ఆకులలోని సారం బాగా దిగుతుంది. మూత పెట్టి ఉండటం వలన వేడి కూడా తగ్గదు) మోనా కావలసినవి: కోడి గుడ్లు - 6 (మరో రెండు గుడ్లు విడిగా ఉంచుకోవాలి); సోంపు కషాయం - (అర లీటరు); చల్లటి పాలు - 750 మి.లీ.; ఆలివ్ ఆయిల్ - 250 మి.లీ.; పంచదార - అర కేజీ; నిమ్మ తొక్కల తురుము - కొద్దిగా; ఈస్ట్ - 75 గ్రా.; మైదా పిండి - 2.5 కేజీలు; దాల్చినచెక్క పొడి - కొద్దిగా తయారీ: కోడిగుడ్లను బాగా గిలక్కొట్టి పక్కన ఉంచాలి ఒక పాత్రలో సోంపు కషాయం, ఈస్ట్ వేసి బాగా కలిపి, పాలు, ఆలివ్ ఆయిల్, నిమ్మ తొక్కల తురుము, పంచదార వేసి బాగా కలిపి, గిలక్కొట్టిన కోడిగుడ్లలో వేయాలి మైదాపిండి కొద్దికొద్దిగా వేస్తూ చేత్తో జాగ్రత్తగా కలుపుతూండాలి. (చేతికి అంటకుండా ఉండేవరకు కలపాలి) ఈ మిశ్రమాన్ని ఒక పెద్ద పాత్రలోకి నెమ్మదిగా పోసి సుమారు రెండు గంటలు అలా వదిలేయాలి మిశ్రమం కొద్దిగా పొంగిన తర్వాత పెద్ద నారింజకాయ పరిమాణంలో కట్ చేసి, అదనంగా ఉంచుకున్న కోడిగుడ్ల సొన ఉపయోగిస్తూ రింగ్ ఆకారంలో తయారుచేయాలి (సుమారు 30 సెం.మీ. పొడవు, 10 సెం.మీ వెడల్పు) అవెన్‌ను 180 డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేయాలి నెయ్యి లేదా నూనె రాసిన ట్రేలో తయారుచేసి ఉంచుకున్న మోనాలను ఉంచి, వాటి మీద కోడి గుడ్డు సొన లేదా పంచదార + దాల్చినచెక్క మిశ్రమం వేసి అవెన్‌లో ఉంచాలి బంగారురంగులోకి వచ్చేవరకు బేక్ చేసి బయటకు తీసి టీ తో అందించాలి. గ్రీన్ టీ విత్ తులసి కావలసినవి: నీళ్లు - 2 కప్పులు; గ్రీన్ టీ + తులసి టీ బ్యాగులు - 2; పంచదార - 2 టీ స్పూన్లు తయారీ: నీళ్లను మరిగించాక, అందులో టీ బ్యాగ్ వేసి రెండు మూడు నిమిషాలు ముంచి తీస్తూ చేయాలి. అలా చేయడం వలన వాటిలో ఉండే ఫ్లేవర్ టీ లోకి వస్తుంది. (వీటిని నీటితో కలిపి మరిగించకూడదు. సాధారణంగా ఒక కప్పు టీ కి ఒక బ్యాగ్ సరిపోతుంది) పంచదార జత చేయాలి. ఇష్టపడేవారు పాలు కూడా కలుపుకోవచ్చు. బేక్డ్ మేథీ ముథియా కావలసినవి: కసూరీ మేథీ - ఒకటిన్నర టీ స్పూన్లు; గోధుమపిండి - 5 టేబుల్ స్పూన్లు; సెనగ పిండి - 5 టేబుల్ స్పూన్లు; అల్లం పచ్చి మిర్చి ముద్ద - 2 టీ స్పూన్లు; జీలకర్ర పొడి - ఒకటిన్నర టీ స్పూన్లు; మిరియాలు - 6 గింజలు; గరం మసాలా - అర టీ స్పూను; ఇంగువ - చిటికెడు; నూనె - 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు - తగినంత తయారీ: 400 డిగ్రీ ఫారెన్ హీట్ దగ్గర అవెన్‌ను ప్రీ హీట్ చేయాలి ఒక పాత్రలో అన్ని వస్తువులూ వేసి తగినంత నీళ్లు పోసి చపాతీ పిండిలా కలపాలి, ఉండలు చేసి, చేతితో వడల మాదిరిగా కొద్దిగా ఒత్తాలి నూనె రాసిన బేకింగ్ డిష్‌లో వీటిని ఉంచి సుమారు పది నిమిషాలు బేక్ చేయాలి. (అవసరమనుకుంటే రెండో వైపు కూడా బంగారు రంగు వచ్చేలా మరోమారు అవెన్‌లో ఉంచవచ్చు) కొత్తిమీర పచ్చడి, నిమ్మ చెక్కలతో సర్వ్ చేయాలి. పాల టీ కావలసినవి: అల్లం + ఏలకులు/ అల్లం + ఏలకులు + లవంగాలు; పాలు - కప్పు; పంచదార - అర టీ స్పూను; టీ పొడి - అర టీ స్పూను తయారీ తగినన్ని నీళ్లను మరిగించాలి ఆ నీళ్లలో మనకు కావలసిన ఫ్లేవర్ ఆకులు, టీ పొడి వేసి కొద్దిసేపు వదిలేయాలి వేడి పాలు, పంచదార జత చేసి, శ్నాక్స్తో కలిపి అందించాలి. మలై స్టైల్ కర్రీ పఫ్ కావలసినవి: ఫ్రోజెన్ పఫ్ పేస్ట్రీ - ఒక ప్యాకెట్ (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది); బంగాళదుంపలు - 3 (ఉడికించి, తొక్క తీసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయాలి); కైమా మీట్ - కప్పు (ఉప్పు, మిరియాల పొడి జత చేసి మ్యారినేట్ చేయాలి); ఉల్లి తరుగు - అర కప్పు; వెల్లుల్లి - 2 రేకలు (సన్నగా తరగాలి); ఉడికించిన కూర ముక్కలు - కప్పు (బఠాణీ, మొక్కజొన్న, క్యారట్); కూర పొడి - 3 టేబుల్ స్పూన్లు; నీళ్లు - కప్పు; ఉప్పు, పంచదార, మిరియాల పొడి - రుచికి తగినంత; నూనె - తగినంత తయారీ: బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి కై మా మీట్ వేసి రెండు నిమిషాలు వేయించాలి ఉల్లి తరుగు జత చేసి బాగా వేయించాక, బంగాళ దుంప ముక్కలు, కూర పొడి, నీళ్లు, ఉప్పు, పంచదార, మిరియాల పొడి వేసి మంట తగ్గించి అన్నీ మెత్తగా అయ్యేవరకు ఉడికించి, దించేయాలి పఫ్ పేస్ట్రీని పొడవుగా ముక్కలుగా కట్ చేసి, ఉడికించి ఉంచుకున్న మిశ్రమాన్ని ఒక్కో దానిలో ఉంచి, మడత పెట్టి, కోడిగుడ్డు సొనతో అంచులు మూసేయాలి ఫ్రోజెన్ పఫ్ పేస్ట్రీని ప్యాకెట్ మీద ఉన్న సూచనల మేరకు, ప్రీహీట్ చేసిన అవెన్‌లో బేక్ చేయాలి. పుదీనా టీ కావలసినవి: పుదీనా ఆకులు - రెండు టీ స్పూన్లు; సోంపు - అర టీ స్పూను; ఎండు అల్లం - చిటికెడు తయారీ ఒక కప్పులో మరిగించిన నీళ్లు పోయాలి పుదీనా ఆకులు, సోంపు, ఎండు అల్లం వేసి మూత ఉంచి ఐదు నిమిషాల తర్వాత వడ గట్టి తాగాలి. సేకరణ: డా. వైజయంతి -
ఆషాఢ లక్ష్ములు...
ముస్తాబు ఆషాఢంలో గోరింట పూసిన చేతులతో ఆదిలక్ష్ములు... శ్రావణంలో సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్ములు... మాసమేదైనా... వేడుకేదైనా... అమ్మాయిల ఛాయిస్ లంగా, ఓణీ అయితే ఐశ్వర్యం ఆ ఇంట కొలువుదీరుతుంది. అమ్మానాన్నలకు కనులపండుగవుతుంది. నేటి తరం అమ్మాయిలు ముస్తాబుకు ఇష్టపడి ఎంచుకునే ముచ్చటైన లంగా, ఓణీల కాంబినేషన్ మీ కోసం... 1- నీలాకాశం రంగు నెట్ లెహంగాకు ఎరుపురంగు బెనారస్ చున్నీని జత చేరిస్తే ఏ పండగైనా నట్టింటికి నడిచొచ్చేస్తుంది. మిర్రర్ వర్క్ ఉన్న లెహంగా బార్డర్, బెనారస్ బ్లౌజ్ అదనపు ప్రత్యేకతలు. 2- హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసిన సియాన్ గ్రీన్ రా సిల్క్ లెహంగాను మరింత ఆకర్షణీయంగా మార్చివేసింది బెనారస్ చున్నీ. కుందన్ వర్క్ చేసిన ఆఫ్‌వైట్ రా సిల్క్ బ్లౌజ్ ప్రత్యేకంగా కనిపిస్తోంది. 3- కనకాంబరం రంగు లెహెంగాకు రాయల్ బ్లూ చున్నీ జతకడితే పండిన గోరింటాకు ఎర్రదనం చెక్కిళ్లలో పూస్తుంది. సీక్వెన్స్ చమ్కీ వర్క్ బార్డర్ జత చేసిన లెహంగా స్టోన్ వర్క్‌తో మెరిసిపోతుంటే, కుందన్వర్క్ బ్లౌజ్ ప్రత్యేక శోభను తీసుకువస్తుంది. 4- మిర్రర్ వర్క్ చేసిన షిమా జార్జెట్ మెటీరియల్‌ను లెహంగాగా మార్చి, అద్దాలతో కట్ వర్క్ చున్నీని మెరిపిస్తే పట్టపగలే తారలు దిగివచ్చినట్టుగా అనిపించకమానదు. 5- పీచ్ కలర్ నెట్ లెహంగా, మింట్ గ్రీన్ చున్నీ, ఫుల్ స్లీవ్స్ నెట్ బ్లౌజ్.. పైనంతా స్వీక్వెన్స్ వర్క్‌తో రూపుకడితే రాత్రి దీపకాంతిలో దేదీప్యమానంగా వెలిగిపోవచ్చు. డిజైనర్ టిప్స్: కుందన్స్, స్టోన్స్, చమ్కీ, మిర్రర్లతో చేసిన వర్క్‌లు పాడైపోకుండా ఉండాలంటే లెహంగాలను దగ్గరికి మడతపెట్టకూడదు. ఎంబ్రాయిడరీ గల లెహంగాలేవైనా హ్యాంగర్‌కి వేలాడదీయాలి. ఏ లెహంగా అయినా శుభ్రపరచాలంటే మైల్డ్ షాంపూతో లేదంటే డ్రై వాష్ చేయించడం ఉత్తమం. మిర్రర్ వర్క్, స్వీక్వెన్స్ వర్క్ గల లెహెంగాలు రాత్రి వేడుకలకు బ్రైట్‌గా కనిపిస్తాయి. సంప్రదాయ వేడుకలకు కేశాలంకరణగా జడ, కాంబినేషన్ ఆభరణాలు బాగా నప్పుతాయి. బర్త్‌డే, రిసెప్షన్ వంటి ఈవెనింగ్ వేడుకలకు కట్ వర్క్ చున్నీలు, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లు, వదులుగా ఉండే కేశాలంకరణ బాగా నప్పుతాయి. కర్టెసీ: శశి, ఫ్యాషన్ డిజైనర్, ముగ్ధ ఆర్ట్ స్టూడియో, హైదరాబాద్ www.mugdha410@gmail.com -
సంజె కాంతుల్లో...సౌందర్య రాగం!
ముస్తాబు వేసవి సాయంత్రాలలో మల్లెల గుబాళింపులే కాదు వేడుకల వాతావరణమూ ఆహ్లాదపరుస్తూ ఉంటుంది. చిన్నాపెద్దా గెట్ టు గెదర్లు, పాశ్చాత్యశైలి పార్టీలు ఇప్పుడు మన సంస్కృతిలో భాగమైపోవడంతో పార్టీకి తగ్గ వేషధారణ కూడా ముఖ్యమైంది. కొత్త కొత్త ఫ్యాషన్ల కోసం వెతుకులాట సాధారణమైంది.కొంచెం పాశ్చాత్యం... ఇంకొంచెం సంప్రదాయం... రెండింటి మేళవింపును ఇష్టపడే యువతరం కోరుకునే దుస్తుల పరిచయమే ఈ ముస్తాబు. 1- ఎరుపు, పువ్వుల కాంబినేషన్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ పొడవాటి గౌన్ బర్త్ డే, వీకెండ్ పార్టీలలో అదుర్స్ అనిపిస్తుంది. కింద పువ్వుల ప్రింట్లు ఉన్న క్రేప్ మెటీరియల్‌ను ఉపయోగించారు. నడుము, పై భాగాన్ని కలుపుతూ కర్దానా బెల్ట్‌ను ఉపయోగించారు. పైన వి నెక్ ఉన్న బ్లౌజ్‌కు ఎరుపు రంగు షిఫాన్ ఫ్యాబ్రిక్‌ను వాడారు. 2- వారాంతపు పార్టీలో చూపులను కట్టిపడేసే పొడవాటి గౌన్ ఇది. స్కర్ట్ భాగానికి షిఫాన్ ఫ్యాబ్రిక్, బ్లౌజ్ భాగానికి బ్లాక్ వెల్వెట్ వాడారు. నడుము భాగాన్ని చుట్టి ఉన్న బెల్ట్‌పై శాటిన్ రిబ్బన్‌తో వర్క్ చేశారు. 3- సాయంకాలం పార్టీని ఆహ్లాదపరిచే రంగుల కలబోత ఈ లాంగ్ గౌన్ ప్రత్యేకత. జైపూర్ ప్రింట్ ఉన్న ఇక్కత్ సిల్క్, పైన ప్లెయిన్ షిఫాన్కు క్రాస్ షేప్ తీసుకువచ్చారు. బ్లౌజ్ పార్ట్‌కు ఇక్కత్ సిల్క్ వాడారు. స్కర్ట్ భాగంలో వాడిన ప్రింటెడ్ క్లాత్‌తో ఫ్లవర్‌ను తీర్చిదిద్ది, భుజం దగ్గర బ్రోచ్లా అమర్చారు. 4- మయూరాన్ని తలపించే నీలం రంగు పొడవాటి గౌన్ పార్టీలో ప్రత్యేకంగా నిలుస్తుంది. తెల్లటి షిఫాన్ క్లాత్‌కు డై చేయించి, పీకాక్ కలర్ తెప్పించారు. బ్లౌజ్ భాగాన్ని రాసిల్క్ చెక్స్ మెటీరియల్‌తో డిజైన్‌చేశారు. సైడ్స్ పర్పుల్ ఫ్యాబ్రిక్వాడారు. 5- తెల్లటి పొడవైన ఈ గౌను సాయంకాలపు పుట్టిన రోజు, పెళ్లిరోజు పార్టీలకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. క్రింది భాగానికి మూడు లేయర్లుగా తెల్లని నెట్ మెటీరియల్ వాడి, లైనింగ్ కోసం శాటిన్ క్లాత్‌ను జత చేశారు. పైన హై కాలర్ నెటెడ్ బ్లౌజ్‌కి క్యాప్ స్లీవ్స్ ఇచ్చి యాంటిక్ బీడ్స్, వైట్ గోల్డ్, రాక్ గోల్డ్ సీక్వెన్స్‌తో మొత్తం ఫ్లోరల్ డిజైన్ చేశారు. 6- సాయంకాలం సంగీత్, మెహెందీ, రిసెప్షన్ వంటి సంప్రదాయ వేడుకలకు ఈ ఎర్రటి పొడవాటి గౌన్ ఎందరిలో ఉన్నా ఇట్టే ఆకట్టుకుంటుంది. క్రింది భాగాన్ని మూడు లేయర్లుగా ఎక్రటి నెట్ మెటీరియల్ వాడి, లైనింగ్ కోసం శాటిన్ క్లాత్‌ను జత చేశారు. పైన బ్రొకేడ్ క్లాత్‌తో డిజైన్ చేసిన బ్లౌజ్, బోట్ నెక్ ఇచ్చి, కుడి భుజం పైన జర్దోసి వర్క్, గ్రీన్ స్టోన్స్‌తో మెరిపించారు. నడుము భాగంలో ఎరుపురంగు సిల్క్ మెటీరియల్‌తో చేసిన బెల్ట్‌ను జత చేశారు. పార్టీలో గ్రాండ్‌గా..: పాశ్చాత్య దుస్తులు ధరించినప్పుడు మేకప్ మరీ ఎక్కువ కాకూడదు. మేకప్ కనిపించీ కనిపించనట్టు ఉండాలి కేశాలంకరణ సంగతికొస్తే - హై పోనీతో కానీ, జుట్టు పూర్తిగా వదిలేయడం కానీ చేయాలి. సమకాలీన లుక్ ఉండేలా చూసుకోవాలి గౌన్లు వేసుకున్నప్పుడు హై హీల్స్, శాండల్స్ బాగా నప్పుతాయి డ్రెస్‌కు సంబంధం లేనట్టు కాకుండా యాక్ససరీస్ మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి హ్యాండ్‌బ్యాగ్ బదులు క్లచ్ లాంటివి పట్టుకుంటే లుక్ బాగుంటుంది. కర్టెసి: భార్గవి కూనమ్ ఫ్యాషన్ డిజైనర్, హైదరాబాద్ www.bar9999@gmail.com -
కలంకారి ఇంపుగా.. హాయిగా..
సౌకర్యం, సంప్రదాయాలను అనుసరించి కాలానుగుణంగా వేషధారణల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. వాటికే మళ్ళీ చిన్న చిన్న మార్పులను జోడించి, ట్రెండ్ సృష్టించడమే ఫ్యాషన్. వేసవిలో చెమటను పీల్చుకునే దుస్తులను, లేత రంగులను ఇష్టపడతారు. ఆ విధంగా కాటన్ క్లాత్‌కు, ‘కలంకారి’ డిజైన్లకు చరిత్ర ఎంతో ఉంది. ఈ రెండింటినీ జోడించి కొత్త కొత్త దుస్తులను సృష్టిస్తే... ఈ వేసవి కూల్‌గానే కాదు మరింత ‘కళ’ గానూ మారిపోతుంది. నూలు వస్త్రంపై సహజసిద్ధమైన రంగులతో చేసిన డిజైన్లు కాబట్టి ‘కలంకారి’ దుస్తులు కంటికి ఇంపుగా, ఒంటికి మెత్తగా, మనసుకు హాయిగా అనిపిస్తాయి. వీటిలో ‘పెన్ కలంకారి’ డిజైన్లు ఖరీదు ఎక్కువ. ప్రింటెడ్ ‘కలంకారి’ వస్త్రాలు ఖరీదు తక్కువే! కాబట్టి స్తోమతను బట్టి, సౌకర్యాన్ని బట్టి కలంకారికి ఆధునిక సొబగులను ఎన్నైనా అద్దవచ్చు. వేసవి ఫ్యాబ్రిక్స్‌తో... వేసవిలో సింథటిక్ దుస్తులు చర్మంపై ర్యాష్‌కు కారణం అవుతాయి. అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అందుకని వేసవికి అనుకూలమైన నూలు, నార, లినెన్, రేయాన్, కోటా, మల్మల్, శాటిన్, కోరా ఫ్యాబ్రిక్స్‌ను ఎంచుకోవచ్చు. వీటికి ‘కలంకారి’ ఫ్యాబ్రిక్‌ను జోడిస్తే వినూత్నమైన దుస్తులు వేషధారణలో ‘కళ’తీసుకువస్తాయి. టాప్ టు బాటమ్... తలపైన కలంకారి టోపీ, అదే కాంబినేషన్లో కలంకారి వెయిస్ట్‌కోట్, ముదురు ఆకుపచ్చ లెహంగాకు చేసిన కలంకారి ప్యాచ్ వర్క్, హ్యాండ్ బ్యాగ్.. ఎండలో చార్మ్‌గా వెలిగిపోవడానికి మంచి ఎంపిక కలంకారి. ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ కళ కలంకారి. ఎన్ని రకాలుగా ఉపయోగించినా బోర్ అనిపించని కలంకారి ఫ్యాబ్రిక్‌తో లెక్కలేనన్ని డిజైన్లు తీసుకురావచ్చు. సహజంగా ‘కలంకారి’ని బెడ్‌షీట్స్, దిండుగలేబులుగా వాడుతుంటారు. నేను దీంట్లో ఒక ట్రెండ్‌ను సృష్టించి, స్టైలిష్ ఫ్యాబ్రిక్‌గా పరిచయం చేయాలనుకున్నాను. ఆ విధంగానే జాతీయ, అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికలపైన ఆధునిక దుస్తుల్లో కలంకారి డిజైన్లను మెరిపించాను. నేను ఎక్కువగా ఆకుపచ్చ, నీలం, ఎరుపు, నలుపు, ఆలివ్.. రంగుల కలంకారి ఫ్యాబ్రిక్‌ను ఉపయోగిస్తాను. దాంట్లో టాప్స్ పై వేసుకొని జాకెట్స్, బాటమ్‌గా చురీ ప్యాంట్స్, పొడవైన కుర్తాలు.. ఇలా చాలా రకాలుగా సృష్టించాను. చీరలు, లెహంగాలు, కుర్తాలు, జంప్‌సూట్స్...ఇలా ఎన్నో రకాల ప్రయోగాలు చేశాను. చాలా మంచి ఫలితాలు వచ్చాయి. ముంబయ్, ఢిల్లీ, ప్యారిస్ నుంచి కూడా నాకు కలంకారి దుస్తులకు ఆర్డర్లు వస్తుంటాయి. ఇది రీ సైకిల్ ఫ్యాబ్రిక్. కాస్త ఎంబ్రాయిడరీ టచ్ ఇచ్చామంటే మరింత వెలిగిపోతుంది. వేసవిలో కలంకారి రంగులు, ప్రింట్లు కూల్ ఫీలింగ్‌ను ఇస్తాయి. - అస్మితా మార్వా, ఫ్యాషన్ డిజైనర్ ఖర్చు తక్కువ... ‘అచ్చు కలంకారి’ ఖరీదు తక్కువే! ప్రింటెడ్ కలంకారి ఫ్యాబ్రిక్ మీటర్ ధర రూ.100 నుంచి లభిస్తుంది. అదే పెన్ కలంకారి అయితే డిజైన్ బట్టి ధర వేల రూపాయల్లో ఉంటుంది. వెరైటీ డిజైన్లు... పొడవు పొట్టి లెహంగాలు, వెయిస్ట్ కోట్లు, జాకెట్లు, కుర్తాలు, హారమ్ ప్యాంట్స్, ఫ్రాక్‌లు.. ‘కలంకారి’తో వీటిలో ఎన్నో ప్రత్యేకతలను చూపించవచ్చు. యాక్ససరీస్.. పర్సులు, బ్యాగులు, పాదరక్షలు, టోపీలు, చెవి ఆభరణాలు.. కలంకారి డిజైన్లతో కనువిందు చేస్తుంటే వాటిని అలంకరణలో భాగం చేసుకొని మరింత ప్రత్యేకంగా వెలిగిపోవచ్చు. -
వెయ్యింతల ఊరింతలు
చింతను చూస్తూ ఊరుకోవడం కష్టమే! కనీసం కాయ కొసల్నైనా కొరక బుద్దేస్తుంది. అందాకా ఎందుకు? చింతకాయను ఊహించుకోండి చాలు... జివ్వుమని మనసు ఊటబావి ఐపోతుంది! చింత వచ్చి చెంతన చేరితే... చప్పిడి పళ్లేలకు కూడా చురుకు పుట్టుకొస్తుంది. ఇక మనమెంత, మానవమాత్రులం? కళ్ల ముందు చింత పులుసో, పప్పో, పచ్చడో ప్రత్యక్షమవగానే... వేళ్లు కలబడి కలబడి ముద్దను కలిపేస్తాయి. చింతలో ఉన్న ‘సి’ట్రాక్షన్ వల్లనే... ఇంత ఎట్రాక్షన్. ఇవన్నీ కాదు... వెయ్యి రకాల కూర గాయలకైనా... వెయ్యి కాంబినేషన్ల రుచులను ఇవ్వగల కెపాసిటీ... చింతది, చింత పులుపుది, చింత తలపుది! చింతకాయ నువ్వుల పచ్చడి కావలసినవి: చింతకాయలు - 8, నువ్వుపప్పు - 100 గ్రా., పచ్చిమిర్చి - 10, ఎండుమిర్చి - 6, శనగపప్పు - రెండు టీ స్పూన్లు, మినప్పప్పు - రెండు టీ స్పూన్లు, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, మెంతులు - టీ స్పూను, ఇంగువ - చిటికెడు, పసుపు - పావు టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - 2 టేబుల్ స్పూన్లు తయారి: చింతకాయలను ఉడికించి రసం చిక్కగా తీసుకుని పక్కన ఉంచాలి బాణలిలో నువ్వులను వేయించి, చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి బాణలిలో నూనె వేసి కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మెంతులు, ఇంగువ వేసి వేయించి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి మిక్సీలో చింతకాయరసం, నువ్వులపొడి, పోపుల పొడి, పసుపు, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. దోసకాయ చింతకాయ పచ్చడి కావలసినవి: దోసకాయముక్కలు - రెండు కప్పులు, చింతకాయలు - కప్పు, పచ్చిమిర్చి - 7, కొత్తిమీర - చిన్నక ట్ట, ఉప్పు - తగినంత, మినప్పప్పు - 3 టీ స్పూన్లు, శనగపప్పు - 3 టీ స్పూన్లు, నూనె - 3 టీ స్పూన్లు, మెంతులు - 3 టీ స్పూన్లు, జీలకర్ర - టీ స్పూను, ఆవాలు - 2 టీ స్పూన్లు, ఎండుమిర్చి - 6 (ముక్కలు చేసుకోవాలి), కరివేపాకు చిన్న కట్ట, ఇంగువ - చిటికెడు తయారి: బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసి వేయించాలి కరివేపాకు, ఇంగువ వేసి మరో మారు వేయించాలి దోసకాయ ముక్కలను కొద్దిగా ఉడికించాలి. (హాఫ్ బాయిల్ చేయాలి) చింతకాయలను ఉడికించి చిక్కగా రసం తీసుకోవాలి వేయించి ఉంచుకున్న పోపు సామాగ్రి, పచ్చిమిర్చి మిక్సీలో వేసి మెత్తగాపేస్ట్ చేసుకోవాలి ఒక గిన్నెలో ఉడికించి ఉంచుకున్న దోసకాయముక్కలు, చింతకాయరసం, మెత్తగా చేసుకున్న పేస్ట్, ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. చింతకాయ పులుసు కావలసినవి: చింతకాయలు - 6, టొమాటో తరుగు - పావు కప్పు, ఉల్లితరుగు - పావు కప్పు, పచ్చిమిర్చి -2, బెల్లం తురుము - రెండు టీ స్పూన్లు, ఉప్పు - తగినంత, పసుపు - చిటికెడు, ఇంగువ - చిటికెడు, ఎండుమిర్చి - 4, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, ధనియాలపొడి - పావు టీ స్పూను, కరివేపాకు - రెండు రెమ్మలు, కొత్తిమీర - చిన్న కట్ట తయారి: చింతకాయలను ఉడికించి రసం తీసి పక్కన ఉంచాలి ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీరు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు వేసి ఉడికించాలి ఉడికించిన చింతపండు రసం, బెల్లం తురుము, పసుపు వేసి పులుసును బాగా మరిగించాలి ఒక బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి వేగాక పులుసులో వేయాలి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. చింతకాయ - శనగపిండి కూర కావలసినవి: చింతకాయలు - 10, శనగపిండి - మూడు టేబుల్ స్పూన్లు, ఉల్లితరుగు - పావు కప్పు, టొమాటో తరుగు - పావు కప్పు, పుదీనా ఆకులు - పావు కప్పు, ఎండుమిర్చి - 5, పచ్చిమిర్చి - 3, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, శనగపప్పు - రెండు టీ స్పూన్లు, మినప్పప్పు - రెండు టీ స్పూన్లు, ధనియాలపొడి - పావు టీ స్పూను, ఇంగువ - చిటికెడు, పసుపు - పావు టీ స్పూను, ఉప్పు - తగినంత, కరివేపాకు - రెండు రెమ్మలు, కొత్తిమీర - చిన్నకట్ట, నూనె - మూడు టేబుల్ స్పూన్లు. తయారి: చింతకాయలను ఉడికించి చిక్కగా రసం తీసి పక్కన ఉంచాలి బాణలిలో నూనె వేసి కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి టొమాటో ముక్కలు, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా ఆకులు వేసి వేయించాలి ఇంగువ, పసుపు జత చేసి బాగా కలపాలి చింతకాయ రసంలో శనగపిండి వేసి బాగా కలిపి ఉడుకుతున్న కూరలో వేసి ఆపకుండా కలపాలి దనియాలపొడి, కరివేపాకు వేసి క లిపి దించేయాలి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. చింతకాయ ఉల్లిపాయ పచ్చడి కావలసినవి: చింతకాయలు - 6, పచ్చిమిర్చి - 5, ఉప్పు - తగినంత, పసుపు - టీ స్పూను, ఇంగువ - చిటికెడు, ఎండుమిర్చి - 5, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, శనగపప్పు - రెండు టీ స్పూన్లు, మినప్పప్పు - రెండు టీ స్పూన్లు, ఉల్లిపాయలు - 2 (చిన్నముక్కలుగా కట్ చేయాలి), కొత్తిమీర - చిన్న కట్ట తయారి: చింతకాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి మిక్సీలో చింతకాయలు, పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్ చేయాలి పసుపు జత చేసి గాలి చొరని గాజు సీసాలో కాని జాడీలో కాని రెండు రోజులు ఉంచాలి మూడవరోజు తిరగకలపాలి బాణలిలో నూనె వేసి కాగాక ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి కరివేపాకు జత చేసి మరోమారు వేయించి చింతకాయపచ్చడిలో వేసి కలపాలి అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఉల్లిపాయముక్కలు వేసి దోరగా వేయించి తీసేసి పచ్చడిలో వేసి కలపాలి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. చింతకాయ పప్పు కావలసినవి: చింతకాయలు - 4, కందిపప్పు - కప్పు, ఉల్లితరుగు - అర కప్పు, ఎండుమిర్చి - 6, పచ్చిమిర్చి - 4, ఆవాలు - టీ స్పూను, మెంతులు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, వెల్లుల్లి రేకలు - 4, కరివేపాకు - 2 రెమ్మలు, కొత్తిమీర - చిన్న కట్ట తయారి: పప్పులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి ఉడికించాలి చింతకాయలను ఉడికించి రసం తీసుకోవాలి ఒక గిన్నెలో ఉడికించిన పప్పు, చింతపండు రసం వేసి స్టౌ మీద ఉంచాలి కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేసి కలపాలి బాణలిలో కొద్దిగా నూనె వేసి అందులో వెల్లుల్లి, పోపు సామాను వేసి వేయించాలి ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి కలపాలి ఉడికిన పప్పులో ఈ పోపు వేసి కలపాలి. సేకరణ: డా.వైజయంతి