కొత్త కథ విన్నారా? | Sakshi
Sakshi News home page

కొత్త కథ విన్నారా?

Published Mon, May 22 2023 3:50 AM

Ravi Teja and Gopichand Malineni to team up for new movie - Sakshi

‘డాన్‌ శీను(2010)’, ‘బలుపు (2013)’, ‘క్రాక్‌ (2021)’ చిత్రాల తర్వాత హీరో రవితేజ, దర్శకుడు గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో మరో సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు రంగం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల గోపీచంద్‌ మలినేని చెప్పిన ఓ కథ  రవితేజకు నచ్చిందట.

దీంతో ఈ సినిమాను వీలైనంత త్వరగా సెట్స్‌పైకి తీసుకుని వెళ్లాలనుకుంటున్నారట రవితేజ. ఈ సినిమాను మైత్రీమూవీ మేకర్స్‌ నిర్మించనుందని భోగట్టా. ఇక ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి యూరప్‌ ట్రిప్‌లో ఉన్నారు రవితేజ. ఆయన నటించిన ‘టైగర్‌ నాగేశ్వరరావు’ చిత్రం అక్టోబరు 20న రిలీజ్‌కు రెడీ అవుతుండగా, మరో చిత్రం ‘ఈగిల్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) సెట్స్‌పై ఉంది.

Advertisement
 
Advertisement
 
Advertisement