![Ayurveda Says You Should Not Combine Curd With These Foods - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/1/curd.jpg.webp?itok=WptNPZx3)
పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని మన పెద్దలు చెప్పేవారు. అంతేగాక వైద్యులు కూడా పెరుగు తినాలని సూచిస్తున్నారు. పెరుగు వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని ఎన్నో అధ్యయనాలు చెప్తున్నాయి. ఉదాహరణకు పెరుగులో కాల్షియం అధికంగా ఉంటుంది. దీనివల్ల ఎముకలు గట్టిపడతాయి. అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు రోజూ కప్పు పెరుగు తినడం ద్వారా వారికి మంచి ఫలితం ఉంటుంది.
అయితే ఇలా ఎన్నో రకాలుగా ఆరోగ్యానికి ఔషదంలా పని చేసే పెరుగుని మనం ఎక్కవగా ఇతర ఆహారంతో కలిపే తీసుకుంటుంటాం. ఇందులో ఓ సమస్య దాగుంది, ఇదే పెరుగును కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవడం మంచిది కాదన్నది వైద్యుల అభిప్రాయం. అవేంటో వెంటనే తెలుసుకుందాం, ఎందుకంటే ఆరోగ్యమే మహా భాగ్యం కదా.
మామిడి
►పెరుగును మామిడి పండుతో కలిపి అస్సలు తినకూడదు. అలా పెరుగుతో మామిడి కలిపి తినడం కారణంగా శరీరంలో అలర్జీ, చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. వేసవి కాలం వచ్చిందంటే ఈ కాంబో ఎక్కువ కనిపిస్తుంది.
ఉల్లిపాయలు
► ఉల్లిపాయలతో పెరుగును కలిపి తినడం కూడా అంత మంచిదికాదు. ఉల్లి శరీరంలో వేడిని పుట్టిస్తే.. పెరుగు చల్లదానానికి కారణమవుతుంది. ఈ రెండు కలిపి తినడం వల్ల సోరియాసిస్, దద్దుర్ల వంటి చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
పాలు
►ఇక పెరుగును పాలతో కలిపి తినడం కూడా అంత మంచిది కాదన్నది నిపుణుల సలహా. రెండు తెల్లగానే ఉన్నాయి కదా తింటే ఏం కాదు అనుకోకండి. ఈ కాంబో తినడం వల్ల డయేరియాతో పాటు ఇతర జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణుల సలహా.
చేపలు
►చేపలను పెరుగుతో కలిపి అసలు తినకూడదు. ప్రోటీన్లు పరంగా ఈ రెండింటిలో ఎక్కువగానే ఉన్నాయి కదా రెండింతలు ప్రోటీన్లు లభిస్తుందనుకుంటే పొరపాటే.. వీటిని కలిపి తినడం వల్ల కడుపులో గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
వంటనూనేతో చేసే వంటకాలు
►వీటితో పాటు ఎక్కువ వంట నూనెలు తీసుకునే వంటకాలను సైతం పెరుగుతో కలిపి తినకపోవడమే మంచిదని వైద్యులు చెప్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment