సిల్క్ గాజులు
ఆభరణం
దారాలతో బట్టలు కుట్టవచ్చు, పూసలు గుచ్చవచ్చు. అంతేనా.. ఇలా అందమైన గాజులను, హారాలను, చెవి లోలాకులనూ సులువుగా తయారుచేసుకోవచ్చు. సంప్రదాయ వస్త్రాలంకరణలో ఈ ఆభరణాలను ధరించవచ్చు. డ్రెస్‌కు తగిన మ్యాచింగ్ సిల్క్ దారాలను ఎంచుకోవాలి. గట్టి అట్టముక్క లేదా ప్లాస్టిక్, మెటల్ గాజును ఇందుకు ఉపయోగించాలి. గ్లూతో పాటు ఎంపిక చేసుకున్న పూసలు, స్టోన్స్ తీసుకోవాలి. ఒక చెక్కకు ముందుగా దారాన్ని వరుసలుగా చుట్టాలి.
తర్వాత దారాలను తీసి, చివరలను గ్లూతో అతికించాలి. ఒకవైపు దారంతో గాజుకు చుట్టాలి. ఎక్కడా దారం పైకి రాకుండా నీటుగా ఉండేలా చూసుకోవాలి. చివరలను గ్లూతో అతికించేయాలి. ఎంచుకున్న డిజైన్ స్టోన్ పీస్‌ని తీసుకొని, గాజుపై గ్లూ రాసి అతికించాలి. తగినంత తీసుకొని, మిగతాది కట్ చేసి పూర్తిగా అతికించాలి. అందమైన సిల్క్ దారాల గాజులు సిద్ధం. ఇలాగే చెవిరింగులు, హారాలు తయారుచేసుకోవచ్చు.
ఉమ వనస్థలిపురం
హైదరాబాద్