పుష్కరఘాట్లను ఆలయాలుగా తీర్చిదిద్దాలి
నాగార్జునసాగర్
పుష్కరఘాట్లను ఆలయాలుగా తీర్చిదిద్దాలని దేవాదాయ,ధర్మాదాయశాఖామంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం నాగార్జునసాగర్‌లోని Mýృష్ణానదితీరం,జలాశయతీరంలో నిర్మిస్తున్న పుష్కరఘాట్లను ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్‌రెడ్డి,పార్లమెంట్ సభ్యుడు గుత్తాసుఖేందర్‌రెడ్డి,యడవెల్లి విజయేందర్‌రెడ్డి,జిల్లాపరిషత్ వైస్‌చైర్మన్ కర్నాటి లింగారెడ్డి,నియోజకవర్గం ఇన్‌చార్జి నోములనర్సింహయ్య, అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులు,కాంట్రాక్టర్లతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరిగే కృష్ణాపుష్కరాలను ప్రతిష్టాత్మకంగా పండుగలా నిర్వహించేందుకు Mýృషిచేయాలన్నారు. భక్తులు పుష్కరఘాట్‌ను పవిత్రస్థలంగా దేవాలయంతో సమానంగా గుర్తించి ఆచారసంప్రదాయాలతో స్నానం చేసేలా తీర్చిదిద్దాలని కాంట్రాక్టర్లకు అధికారులకు సూచించారు. ఘాట్ల సమీపంలో ఎక్కడ కూడా చెత్తచెదారం ఉండకుండా కంపచెట్లను , పిచ్చి గడ్డిమొక్కలను తొలగించాలన్నారు. నిత్యం ఫైరింజన్‌తో ఘాట్లను రాత్రివేళ శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పుష్కరాల సమయంలో నిత్యం12 రోజులు అధికారులు లేదా ఈప్రాంత నాయకులు బాధ్యతగా Mýృష్ణమ్మకు హారతి ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులంతా నాగార్జునసాగర్‌కే వస్తారని తెలిపారు. శివాలయంఘాట్ డ్యాం దిగువన నదీతీరంలో ఉండటంతో భక్తుల తాకిడి బాగుంటుందని తెలిపారు. భక్తులుస్నానాల నీటికి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదన్నారు. గోదావరి పుష్కరాల అనుభవంతో అంతకన్నా మిన్నగా భక్తులకు సకలసౌకర్యాలు కల్పిస్తున్నట్లు వివరించారు. ఈయన వెంట పెద్దవూర ఎంపీపీ వస్త్రపురిమళ్లిక ,టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కర్ణబ్రహ్మానందరెడ్డి,రవినాయక్,సాగర్‌డ్యాం ఎస్‌ఈ రమేశ్,ఘాట్ల ఇన్‌చార్జీ జెడ్పీ సీఈఓ మహేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
శివాలయంలో పూజలు చేసిన మంత్రి
ఘాట్ వద్ద ఉన్న శివాలయంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి,గుత్తాసుఖూందర్‌రెడ్డి కర్నాటి లింగారెడ్డి బ్రహ్మానందరెడ్డి, మళ్లిక తదితరులతో కలిసి పూజలు చేశారు. సుదాకరశాస్త్రి గోత్రనామాలతో అర్చన చేశారు. మంత్రి అంతకు ముందే Mýృష్ణానదిలోని నీటిని తలమీద చల్లుకుని వచ్చారు.