pushkarghats
-
పవిత్ర గంగే.. పావన తుంగే
కర్నూలు (సెంట్రల్): వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తుంగభద్ర పుష్కరాలకు భక్తులు తరలివచ్చారు. ‘పవిత్ర గంగే.. పావన తుంగే నమోస్తుతే’ అంటూ నదీమ తల్లికి వాయనాలు సమర్పించారు. 8వ రోజైన శుక్రవారం కూడా కర్నూలు జిల్లాలోని 23 ఘాట్లలో భక్తులు పుష్కర పూజలు నిర్వహించారు. కర్నూలు సంకల్‌భాగ్ ఘాట్‌లో ఎస్పీ డాక్టర్ కె.ఫక్కీరప్ప ఆధ్వర్యంలో అమ్మ, అక్షిత భవన్ పాఠశాలలు, నేషనల్ బ్లైండ్ ఫెడరేషన్‌కు చెందిన అంధులకు పుష్కర స్నానం ఆచరించే అవకాశం కల్పించారు. కోవిడ్ ప్రొటోకాల్‌ను పాటిస్తూ అంధ విద్యార్థులు పూజలు నిర్వహించారు. అనంతరం నీటిని తలపై సంప్రోక్షణ చేసుకున్నారు. యాగశాలలో నిర్వహిస్తున్న హోమంలో పాల్గొని వేద పండితుల ఆశీర్వచనాలు పొందారు. అనంతరం వారికి బెడ్షీట్లు, స్వీట్ ప్యాకెట్లను ఎస్పీ ఫక్కీరప్ప, డీఎస్పీ కేవీ మహేష్ అందజేశారు. సకల సంపదలు, సౌభాగ్యాల కోసం హోమం సంకల్‌భాగ్ పుష్కర ఘాట్‌లో ఏర్పాటు చేసిన యాగశాలలో మహాలక్ష్మి మూలతంతు హోమాన్ని వేద పండితులు నిర్వహించారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాగిన హోమాన్ని పుష్కర స్నానాల కోసం వచ్చిన మహిళలు కనులారా వీక్షించి అమ్మవారి దీవెనలు అందుకున్నారు. ఈ హోమం వల్ల మహిళలకు సకల సంపదలు, సౌభాగ్యాలు కలుగుతాయని, రాష్ట్రంలోని మహిళలంతా సుఖ, శాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ మహాలక్ష్మి మూలతంతు హోమాన్ని నిర్వహించినట్టు వేద పండితుడు చెండూరి రవిశంకర్ అవధాని తెలిపారు. -
తుంగభద్ర తీరం.. ఆధ్యాత్మిక తరంగం
కర్నూలు (అగ్రికల్చర్): ఒకపక్క కార్తీక సోమవారం.. మరోపక్క పుష్కర సమయం.. ఈ పవిత్రమైన రోజున తెలతెలవారుతూనే తుంగభద్ర తీరం ఆధ్యాత్మిక తరంగమైంది. కార్తీక దీపాలు, పుణ్యకార్యక్రమాలతో పుష్కర ఘాట్లలో సందడి నెలకొంది. పుష్కరాలకు నాలుగో రోజున తెలుగు రాష్ట్రాల నుంచే గాక వివిధ రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులతో కర్నూలు జిల్లాలోని పుష్కర ఘాట్లు నిండిపోయాయి. 23 పుష్కరఘాట్లకు ఉదయం 5 గంటల నుంచే భక్తుల తాకిడి మొదలైంది. 75 వేల మందికిపైగా భక్తులు.. పవిత్ర జలాలను తలపై చల్లుకోవడం, జల్లు స్నానాలాచరించడం ద్వారా పులకించిపోయారు. నదిలో నీటి ప్రవాహం కొంతమేర పెరగడంతో జిల్లా యంత్రాంగం పుట్టిలను, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచింది. సిబ్బందిని అప్రమత్తం చేసింది. ముఖ్యంగా కర్నూలులోని సంకల్‌భాగ్, పంప్‌హౌస్, కర్నూలు మండలం సుంకేసుల ఘాట్లతో పాటు మంత్రాలయం, సంగమేశ్వరం ఘాట్లు భక్తులతో కిక్కిరిశాయి. కర్నూలులోని సంకల్‌భాగ్ పుష్కరఘాట్‌లో తుంగభద్ర నదీమతల్లికి విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి: కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప సుంకేసుల పుష్కరఘాట్‌ను సందర్శించారు. పంచలింగాల పుష్కరఘాట్‌ను ప్రభుత్వ విప్ కె.శ్రీనివాసులు సందర్శించారు. ఆయన వెంట కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ ఉన్నారు. సుంకేసుల ఘాట్‌ను పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి దంపతులు సందర్శించారు. పుష్కరాల కోసం కర్ణాటక నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు. పుష్కర స్నానం తర్వాత రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు. సంకల్‌భాగ్ ఘాట్‌లో తుంగభద్ర నదికి సాయంత్రం 6 గంటలకు వేదపండితులు పంచహారతులు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో 3 పుష్కరాలు రావడం గొప్ప విశేషం శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో తుంగభద్ర, కృష్ణా, గోదావరి నదుల పుష్కరాలు రావడం గొప్ప విశేషమని విశాఖ శారద పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. సోమవారం ఆయన కర్నూలులోని సంకల్‌భాగ్ పుష్కర ఘాట్‌లో తుంగభద్రమ్మకు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు, దండ తర్పణ చేశారు. శారద పీఠం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించి.. పవిత్ర పుష్కర జలాలతో సంప్రోక్షణ చేసుకున్నారు. విశ్వశాంతి యాగంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీమన్నారాయణుని అవతారమైన వరాహమూర్తి ఇరు దంతాల నుంచి తుంగ, భద్ర నదులు ఉద్భవించాయని, అలాంటి నదికి పుష్కరాలు రావడం గొప్ప విశేషమన్నారు. పుష్కరాల సమయంలో 12 రోజుల పాటు నదిలో ముక్కోటి దేవతలు నిక్షిప్తమై ఉంటారని, స్నానమాచరించినా, సంప్రోక్షణ చేసుకున్నా వారి ఆశీస్సులు లభిస్తాయన్నారు. -
పుష్కరఘాట్లను సందర్శించిన జెడ్పీ సీఈఓ
నాగార్జునసాగర్ నాగార్జునసాగర్ పుష్కరఘాట్లను ఆదివారం ఘాట్ల ఇన్చార్జ్, జెడ్పీ సీఈఓ మహేందర్‌రెడ్డి సందర్శించారు. శివాలయం ఘాట్‌లో వీఐపీలు వెళ్లేందుకు ప్రత్యేక మార్గం ఉండేలా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. షవర్ స్నానాలగదుల వద్ద నీరు నిలబడకుండా ఎప్పటికప్పుడు వెళ్లేలా ముందుగానే వంపు ఏర్పాటు చేయాలన్నారు. త్వరతిగతిన పూర్తయ్యేలా పనులు వేగవంతంగా చేయాలని తెలిపారు. ఈయన వెంట శివాలయం ఘాట్ ఇన్చార్జీ జేడీఏ నర్సింహారావు, అనుముల మండల ఏఓ విజయేందర్‌రెడ్డి ఉన్నారు. -
పుష్కరఘాట్లలో వసతులు కల్పించాలి
రాంనగర్ : కష్ణా పుష్కర ఘాట్లలో భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్న వసతి సౌకర్యాలను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పుష్కరాల ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పుష్కర ఘాట్ల వద్ద మంచి నీరు, విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్ల నిర్మాణం, కల్పించడంతో పాటు ఘాట్ నుంచి నదిలోనికి వెళ్లకుండా పెన్షింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే దుస్తులు మార్చుకునే గదులు, దుస్తులు తగిలించుకునేందుకు అనువుగా కొక్కాలు తదితర మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఘాట్ల వద్ద జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు ఫొటోలతో సహా తెలియజేయాలని ఆదేశించారు. పుష్కరఘాట్లలో ఏ సమయంలోనైనా తనిఖీలు నిర్వహిస్తామని, పనుల్లో లేని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ యన్.సత్యనారాయణ, డీఆర్వో రవి, ఘాట్ ఇన్చార్జిలు తదితరులు పాల్గొన్నారు. -
పుష్కరఘాట్లను ఆలయాలుగా తీర్చిదిద్దాలి
నాగార్జునసాగర్ పుష్కరఘాట్లను ఆలయాలుగా తీర్చిదిద్దాలని దేవాదాయ,ధర్మాదాయశాఖామంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం నాగార్జునసాగర్‌లోని Mýృష్ణానదితీరం,జలాశయతీరంలో నిర్మిస్తున్న పుష్కరఘాట్లను ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్‌రెడ్డి,పార్లమెంట్ సభ్యుడు గుత్తాసుఖేందర్‌రెడ్డి,యడవెల్లి విజయేందర్‌రెడ్డి,జిల్లాపరిషత్ వైస్‌చైర్మన్ కర్నాటి లింగారెడ్డి,నియోజకవర్గం ఇన్చార్జి నోములనర్సింహయ్య, అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులు,కాంట్రాక్టర్లతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరిగే కృష్ణాపుష్కరాలను ప్రతిష్టాత్మకంగా పండుగలా నిర్వహించేందుకు Mýృషిచేయాలన్నారు. భక్తులు పుష్కరఘాట్‌ను పవిత్రస్థలంగా దేవాలయంతో సమానంగా గుర్తించి ఆచారసంప్రదాయాలతో స్నానం చేసేలా తీర్చిదిద్దాలని కాంట్రాక్టర్లకు అధికారులకు సూచించారు. ఘాట్ల సమీపంలో ఎక్కడ కూడా చెత్తచెదారం ఉండకుండా కంపచెట్లను , పిచ్చి గడ్డిమొక్కలను తొలగించాలన్నారు. నిత్యం ఫైరింజన్‌తో ఘాట్లను రాత్రివేళ శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పుష్కరాల సమయంలో నిత్యం12 రోజులు అధికారులు లేదా ఈప్రాంత నాయకులు బాధ్యతగా Mýృష్ణమ్మకు హారతి ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులంతా నాగార్జునసాగర్‌కే వస్తారని తెలిపారు. శివాలయంఘాట్ డ్యాం దిగువన నదీతీరంలో ఉండటంతో భక్తుల తాకిడి బాగుంటుందని తెలిపారు. భక్తులుస్నానాల నీటికి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదన్నారు. గోదావరి పుష్కరాల అనుభవంతో అంతకన్నా మిన్నగా భక్తులకు సకలసౌకర్యాలు కల్పిస్తున్నట్లు వివరించారు. ఈయన వెంట పెద్దవూర ఎంపీపీ వస్త్రపురిమళ్లిక ,టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్ణబ్రహ్మానందరెడ్డి,రవినాయక్,సాగర్‌డ్యాం ఎస్ఈ రమేశ్,ఘాట్ల ఇన్చార్జీ జెడ్పీ సీఈఓ మహేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. శివాలయంలో పూజలు చేసిన మంత్రి ఘాట్ వద్ద ఉన్న శివాలయంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి,గుత్తాసుఖూందర్రెడ్డి కర్నాటి లింగారెడ్డి బ్రహ్మానందరెడ్డి, మళ్లిక తదితరులతో కలిసి పూజలు చేశారు. సుదాకరశాస్త్రి గోత్రనామాలతో అర్చన చేశారు. మంత్రి అంతకు ముందే Mýృష్ణానదిలోని నీటిని తలమీద చల్లుకుని వచ్చారు. -
పుష్కరఘాట్లను పరిశీలించిన ఎస్పీ
కనగల్ : మండల కేంద్రంలోని వాగులో, దర్వేశిపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి ఆలయం సమీపంలో నిర్మిస్తున్న పుష్కరఘాట్ పనులను గురువారం ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ప్రధానంగా ట్రాఫిక్ సమస్య తెల్తెకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ ఎంట నల్లగొండ డీఎస్సీ సుధాకర్, చండూర్ సీఐ రమేశ్‌కుమార్, కనగల్ ఎస్ఐ గుత్తా వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.