పుష్కరఘాట్లను సందర్శించిన జెడ్పీ సీఈఓ
నాగార్జునసాగర్
నాగార్జునసాగర్ పుష్కరఘాట్లను ఆదివారం ఘాట్ల ఇన్‌చార్జ్, జెడ్పీ సీఈఓ మహేందర్‌రెడ్డి సందర్శించారు. శివాలయం ఘాట్‌లో వీఐపీలు వెళ్లేందుకు ప్రత్యేక మార్గం ఉండేలా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. షవర్ స్నానాలగదుల వద్ద నీరు నిలబడకుండా ఎప్పటికప్పుడు వెళ్లేలా ముందుగానే వంపు ఏర్పాటు చేయాలన్నారు. త్వరతిగతిన పూర్తయ్యేలా పనులు వేగవంతంగా చేయాలని తెలిపారు. ఈయన వెంట శివాలయం ఘాట్ ఇన్‌చార్జీ జేడీఏ నర్సింహారావు, అనుముల మండల ఏఓ విజయేందర్‌రెడ్డి ఉన్నారు.