ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలు ఎప్పుడూ చర్చనీయాంశంగా నిలుస్తుంటాయి. 2023లో ప్రధాని మోదీ.. జపాన్, పాపువా న్యూ గినియా, ఆస్ట్రేలియా, అమెరికా, ఈజిప్ట్, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌత్ ఆఫ్రికా, గ్రీస్, ఇండోనేషియా, దుబాయ్ తదితర 11 దేశాలలో పర్యటించారు.
మే 19..
జపాన్‌లోని హిరోషిమాలో జరిగిన జీ7 సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. జీ7 శిఖరాగ్ర సమావేశం తరువాత ప్రధాని మోదీ పాపువా న్యూ గినియాను సందర్శించారు. ఇక్క జరిగిన ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ మూడవ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ సిడ్నీని సందర్శించారు. ఈ సందర్భంగా మోదీ స్థానిక భారతీయ కమ్యూనిటీతో సంభాషించారు.
జూన్ 20..
జూన్‌లో ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు న్యూయార్క్ చేరుకున్న ప్రధాని జూన్ 21న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు సారధ్యం వహించారు. ఆ తర్వాత ప్రధాని మోదీ వాషింగ్టన్‌కు వెళ్లారు. జూన్ 22న వైట్ హౌస్‌ను సందర్శించారు.
జూన్ 22..
యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో పీఎం మోదీ ప్రసంగించారు. ఆ తర్వాత ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్-ఫత్తా అల్-సీసీ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈజిప్టు పర్యటనకు వెళ్లారు. ఈజిప్టు సీనియర్ ప్రముఖులతో పాటు అక్కడుంటున్న భారతీయులతో సంభాషించారు.
జూలై 13..
బాస్టిల్ డే సైనిక కవాతుకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ ఫ్రాన్స్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మోదీ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో అధికారిక చర్చలు జరిపారు. ఒక ప్రైవేట్ విందులో కూడా పాల్గొన్నారు. అనంతరం ప్రధాని మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు వెళ్లి, అక్కడ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో చర్చలు జరిపారు.
ఆగస్టు 22..
జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అనంతరం గ్రీస్‌లో అధికారిక పర్యటన చేశారు. ఇది 40 సంవత్సరాలలో భారత ప్రధాని తొలి పర్యటన.
సెప్టెంబర్ 6..
సెప్టెంబర్ నెలలో న్యూఢిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశానికి కొన్ని రోజుల ముందు ప్రధాని మోదీ ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఆహ్వానం మేరకు తూర్పు ఆసియా సదస్సు లో పాల్గొన్నారు.
నవంబర్ 30..
ఈ ఏడాది చివరిలో వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ దుబాయ్ వెళ్లారు. 200 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సమ్మిట్‌లో పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: అన్నీ అమ్ముకుని నౌకపై దేశాలు తిరుగుతూ...
Comments
Please login to add a commentAdd a comment