శాలువాను తొడుక్కోండి!
చలికాలంలో భుజాల మీదుగా ఒంటికి హత్తుకుపోయిన శాలువా వెచ్చదనంతో హాయినిస్తుంది. ఏక వస్త్రంగా ఉండే శాలువాను వీలైతే దుపట్టాలా వాడుకోవచ్చు, కప్పుకోవచ్చు. కానీ తొడుక్కోవడం ఏంటి అనుకుంటున్నారా? అయితే చదవండి... ఇక్కడ ఫొటోలో చూపినట్టుగా మార్చేస్తే కోటులా ధరించవచ్చు. శాలువాలా కప్పుకోవచ్చు. గౌనులా డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా రకరకాల టాప్స్‌లాగా డిజైన్ చేసుకోవచ్చు.
శాలువాను మధ్యకు మడిచి, చేతుల భాగం మడిచి కుడితే ఇలా ధరించవచ్చు.శాలువాను భుజాల మీదుగా కప్పుకుంటే అంచుభాగం ముందుకు వచ్చేలా సర్ది, నడుము భాగాన సన్నని బెల్ట్ పెడితే, అధునికంగా మారిపోతుంది. శాలువాకి లాంగ్ స్లీవ్స్ జత చేస్తే ఓవర్ కోట్‌లా ధరించవచ్చు. మందంగా ఉండే చీరను రెండు మడతలుగా వేసి, కుడితే డిజైనరీ శాలువా సిద్ధం. శాలువా మెటీరియల్‌తో గౌను, కుర్తీ, వంటివీ డిజైన్ చేసుకోవచ్చు. స్టైల్‌కీ, కంఫర్ట్‌కీ బోలెడంత అవకాశం ఉండే శాలువాతో ఇలా ఎన్నో డిజైన్స్ మీరూ తయారుచేయవచ్చు.