
షూ ధర రూ. 17 లక్షలు!
దుబాయ్: ఈ ఫోటోలో కనిపిస్తున్న బూట్లను బంగారంతో తయారు చేశారు. బంగారంతో షూ అంటే ఏదో పూతపూశారనుకోకండి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో తయారు చేసిన ప్రపంచంలోనే మొదటి షూ గా ఇవి రికార్డులకెక్కాయి. వీటి ధర రూ. 17 లక్షలు. ఒక్కో దానిలో 230 గ్రాముల బంగారంతో పాటు.. త్రీడీ ఫూట్ స్కానర్స్ను వాడటం వీటి ప్రత్యేకత.
ఇటలీకి చెందిన షూ తయారీదారుడు ఆంటోనియో వీట్రి వీటిని రూపొందించారు. సంపన్న అరబ్ షేక్‌లను ఆకట్టుకునేలా బ్లూ, బ్లాక్ వేరియంట్‌లలో వీటిని డిజైన్ చేశారు. ఇందులో వాడిన బంగారాన్ని ఏదో అలంకారం కోసం కాకుండా బూట్లలో అంతర్భాగంగా వాడినట్లు వీట్రీ తెలిపారు. షూ వాడటానికి సౌకర్యవంతంగా ఉండేలా బంగారు తీగలను లెదర్‌లోకి చొప్పించి వీటిని అల్లారు. కఠినమైన బంగారాన్ని సౌకర్యవంతంగా ఉండేలా షూలో కూర్చడం అనేది సవాల్‌తో కూడుకున్నది అని వీట్రి వెల్లడించారు. గల్ఫ్ ఫ్యాషన్ మార్కెట్.. యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్ లాంటి దేశాల్లో ఈ ఇటాలియన్ తయారీదారుడికి మంచి డిమాండ్ ఉంది.