
నాసా రోబోకు చేతులు కావాలి ..
వాషింగ్టన్ : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో గస్తీ తిరిగేందుకు తయారు చేసిన రోబోకు చేతులు రూపొందించేందుకు మంచి డిజైన్ సూచించాలని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కోరింది. ఆస్ట్రోబీ అనే ఈ రోబోను మరింత సమర్థంగా మార్చాలని నాసా యోచిస్తోంది.
ఇందులో భాగంగా దానికి అమర్చాల్సిన చేయికి సంబంధించి సరికొత్త డిజైన్‌తో పాటు, సమర్థంగా పనిచేసేలా సూచనలు చేయాలని ప్రజలను కోరింది. ఔత్సాహికుల నుంచి దరఖాస్తుల స్వీకరణ జనవరి 14 నుంచే ప్రారంభించింది. 2006 నుంచి ఐఎస్‌ఎస్‌లో పనిచేస్తున్న మూడు రోబోల (స్పియర్స్) స్థానంలో ఈ రోబోను 2017 నాటికి ప్రవేశపెట్టనున్నారు.