
అభిమానికి నాగార్జున గిఫ్ట్
ఎంతో కష్టపడి తన కోసం ఒక డిస్ప్లే పిక్చర్ (డీపీ)ని తయారుచేసిన అభిమానికి సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఓ అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చాడు. అభిమాని రూపొందించిన ఫొటోనే తన ట్విట్టర్ ఖాతా ప్రొఫైల్ పిక్చర్గా మార్చి ఆ అభిమానిని సంతోషపెట్టాడు. అంతేకాదు.. అదే విషయాన్ని తన ట్వీట్లో కూడా పేర్కొన్నాడు. ఈ డీపీలో నాగార్జున నటించి చిత్రాల్లో ఆయన వేసిన వివిధ పాత్రల ఫొటోలు అన్ని ఒకే దగ్గర వచ్చేలా ఆ అభిమాని తీర్చిదిద్దాడు. సెపియా కలర్లో డాటెడ్ ఫొటోలతో చేసిన ఆ ఫొటో.. నాగార్జునను ఎంతగానో ఆకట్టుకుంది.
అభిమానులు ఎంతో సమయం కేటాయించి ఇంతమంచి డిజైన్ని రూపొందించినందుకు కృతజ్ఞతలు అంటూ నాగార్జున ట్వీట్ చేశారు. ప్రస్తుతం నాగార్జున నటిస్తున్న 'సోగ్గాడే చిన్నినాయన' చిత్రం నిర్మాణదశలో ఉంది. ఈ చిత్రంలో నాగార్జున మేనకోడలిగా బుల్లితెర యాంకర్ అనసూయ నటిస్తున్న విషయం తెలిసిందే.
మరోవైపు మెగా స్టార్ చిరంజీవికి 60 వ జన్మదినోత్సవ సందర్భంగా ట్విట్టర్ ద్వారా నాగార్జున తన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన జీవితం సంతోషం ఉండాలని ఆకాంక్షించారు.
Thank you my fans for taking the time out to design this DP. pic.twitter.com/jIRU43M3gN
— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 22, 2015