► పాతకాలం నాటి డిజైన్లే కొత్త పట్టు చీరలకు నిండుతనాన్ని తెస్తున్నాయి. అందమైన కనికట్టు చేసేస్తున్నాయి.
►చీర బంగారం లాంటిది ఎంత పాతదైనా! ఎంతో విలువ తెస్తుంది నాయినమ్మ, అమ్మమ్మ ప్రేమలా!! మనవరాళ్లూ గెట్ రెడీ! పెళ్ళిళ్ల సీజన్‌లో మీ తడాఖా చూపించండి పాత పట్టుతో కొత్తకట్టు కట్టండి. ఆ కట్టుకోండి.
►సాదా సీదా రంగులతోనే అందమైన మాయాజాలం. అంచెలంచెలుగా అంచులు అవుతున్నాయి చీరకట్టుకు నజరానాలు.
►వెడల్పాటి అంచులే కాదు నిలువెత్తు చెక్స్‌తోనూ చీరలు చూపులను చెక్కేస్తున్నాయి . కొత్త సింగారాలను అద్దేస్తున్నాయి.
►చీర అంచు ఎంత వెడల్పుగా ఉంటే వేడుక అంత వైభవంగా మారుతుంది. నేటి వనితల మేనికి వన్నెలు అద్దే ఘనత పట్టుదే అవుతుంది.
► హాయి గొలిపే రంగులు.. వెడల్పాటి అంచులు, అంచుల్లో జరీ చేసే జిలుగులు. వేడుకలో ప్రత్యేకతను చాటడానికి సిద్ధం అంటున్నాయి.