టైమ్‌కి టైమొచ్చింది | Time Jewellery Latest Designs, Antique Jewellery Designs | Sakshi
Sakshi News home page

Time Jewellery: టైమ్‌కి టైమొచ్చింది

Published Mon, Dec 27 2021 6:59 PM | Last Updated on Mon, Dec 27 2021 7:00 PM

Time Jewellery Latest Designs, Antique Jewellery Designs  - Sakshi

టైమ్‌ ఎంతయ్యిందో తెలియడానికి చేతికి గడియారం ధరిస్తాం. బెల్ట్, బ్రేస్‌లెట్, బ్యాంగిల్‌ రకరకాల రూపాల్లో గడియారాలు ఎంపిక చేసుకుని మురిసిపోతాం. కానీ, టైమ్‌తో నిమిత్తం లేకుండా టైమ్‌ సింబల్‌ ఉన్న ఆభరణాన్ని మెడలోనూ ధరిస్తే స్టయిలిష్‌ లుక్‌తో ఆకట్టుకోవడం ఖాయం అంటోంది ఈ ఫ్యాషన్‌ జ్యువెలరీ.

పెయింటింగ్‌ జ్యువెలరీ చూశాం. ఫ్యాబ్రిక్‌ జ్యువెలరీ కనుక్కున్నాం. టెర్రకోట జ్యువెలరీ కొనుక్కున్నాం. థ్రెడ్‌ జ్యువెలరీ రంగులను హత్తుకున్నాం. న్యూ ఇయర్‌లోకి అడుగుపెడుతున్న శుభవేళ యాంటిక్‌ లుక్‌తో ఆకట్టుకునే టైమ్‌ జ్యువెలరీ అతివల అలంకరణలో బ్రైట్‌గా వెలగడానికి సిద్ధమయ్యింది. ఈ ఫ్యాషన్‌ జ్యువెలరీలో డిజైనర్ల సృజన చూస్తుంటే ఇక ‘టైమ్‌కి టైమొచ్చింది’ అని అనకుండా ఉండలేరు. (డ్రెస్‌ ఏదైనా వాటి మీదకు లాంగ్‌ ష్రగ్‌ ఒకటి ధరిస్తే చాలు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement