చీరకట్టు హుందాతనం మనకు సుపరిచితమే. సంప్రదాయ వేడుకలైతే డిజైనర్ బ్లౌజ్‌లే ఇప్పుడు హంగామ. క్యాజువల్ లుక్‌కి ప్లెయిన్ బ్లౌజ్‌తో మ్యాచింగ్ మార్పులెన్ని చేసినా శారీ డ్రేప్ సెల్యూట్ చేయిస్తుంది. క్యాజువల్‌గానూ, పార్టీవేర్‌గానూ మురిపించే శారీ టాప్స్‌తో ఇప్పుడు స్టైలిష్‌గా వెలిగిపోతోంది.
చీరకట్టకు మ్యాచింగ్ బ్లవుజులు ధరించడం పాత ట్రెండ్. డిజైనర్ చీరల హవా పెరిగిన తరువాత బ్లవుజుల డిజైన్ కూడా మారిపోయింది. వెరైటీ డిజైన్లలో చీరల ధరలను కూడా తలదన్నేలా బ్లవుజులను డిజైన్ చేయించుకుంటున్నారు. రోజుకో కొత్త డిజైన్‌తో ముస్తాబై మార్కెట్లోకి వస్తున్నాయి.
ఫ్రాక్ టైప్ టాప్, ఓవర్‌కోట్, పెప్లమ్, లాంగ్ అండ్ షార్ట్ స్లీవ్స్, కాలర్‌నెక్, రౌండ్‌నెక్ డిజైన్స్‌తో ఈ శారీ టాప్స్ ఆధునికపు హంగుకు అద్దమయ్యాయి. కార్పోరేట్ లుక్‌కి క్లాసిక్ మార్కులు కొట్టేస్తూ కనువిందు చేస్తున్నాయి.
కాటన్ శారీస్‌కు కరెక్ట్‌గా నప్పే ఈ టాప్స్ క్యాజువల్, కార్పొరేట్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాయి. ఫ్రాక్ టైప్ టాప్ పెప్లమ్ బ్లౌజ్‌కి దగ్గర పోలిక ఉంటుంది. వదులుగా ఉండటం వల్ల సౌకర్యంగానూ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment