Designer blouse
-
చీరకట్టు మారింది.. శారీకి క్రాప్‌టాప్‌తో కార్పోరేట్ లుక్
చీరకట్టు హుందాతనం మనకు సుపరిచితమే. సంప్రదాయ వేడుకలైతే డిజైనర్ బ్లౌజ్లే ఇప్పుడు హంగామ. క్యాజువల్ లుక్‌కి ప్లెయిన్ బ్లౌజ్‌తో మ్యాచింగ్ మార్పులెన్ని చేసినా శారీ డ్రేప్ సెల్యూట్ చేయిస్తుంది. క్యాజువల్‌గానూ, పార్టీవేర్‌గానూ మురిపించే శారీ టాప్స్‌తో ఇప్పుడు స్టైలిష్‌గా వెలిగిపోతోంది. చీరకట్టకు మ్యాచింగ్ బ్లవుజులు ధరించడం పాత ట్రెండ్. డిజైనర్ చీరల హవా పెరిగిన తరువాత బ్లవుజుల డిజైన్ కూడా మారిపోయింది. వెరైటీ డిజైన్లలో చీరల ధరలను కూడా తలదన్నేలా బ్లవుజులను డిజైన్ చేయించుకుంటున్నారు. రోజుకో కొత్త డిజైన్‌తో ముస్తాబై మార్కెట్లోకి వస్తున్నాయి. ఫ్రాక్ టైప్ టాప్, ఓవర్‌కోట్, పెప్లమ్, లాంగ్ అండ్ షార్ట్ స్లీవ్స్, కాలర్‌నెక్, రౌండ్‌నెక్ డిజైన్స్‌తో ఈ శారీ టాప్స్ ఆధునికపు హంగుకు అద్దమయ్యాయి. కార్పోరేట్ లుక్‌కి క్లాసిక్ మార్కులు కొట్టేస్తూ కనువిందు చేస్తున్నాయి. కాటన్ శారీస్‌కు కరెక్ట్‌గా నప్పే ఈ టాప్స్ క్యాజువల్, కార్పొరేట్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాయి. ఫ్రాక్ టైప్ టాప్ పెప్లమ్ బ్లౌజ్‌కి దగ్గర పోలిక ఉంటుంది. వదులుగా ఉండటం వల్ల సౌకర్యంగానూ ఉంటుంది. -
డిజైన్లను బట్టి బ్లౌజ్‌కు రూ.600 నుంచి 5వేల వరకు చార్జీ!
విద్యానగర్/కరీంనగర్: బొటిక్ రంగం పెరిగిన ఆధునికతతో మగ్గం వర్క్ నుంచి కంప్యూటరైజ్డ్ రంగంలోకి అడుగిడింది. మనకు నచ్చిన డిజైన్లలో బ్లౌజులు, డ్రెస్‌లను కుట్టించుకునే అవకాశం కంప్యూటరైజ్డ్ బొటిక్ ద్వారా మహిళలకు లభించింది. ఫ్యాషన్ డిజైనర్లు మహిళల కలలకు రూపమిస్తూ బొటిక్ ప్రపంచాన్ని కలర్ఫుల్గా మారుస్తున్నారు. అతివల మనసు దోచే బొటిక్లెన్నో రోజురోజుకూ కరీంనగర్లో వెలుస్తూ ఫ్యాషన్మయంగా మార్చేస్తున్నాయి. వైవిధ్యాన్ని కోరుకునేవారికి సృజనాత్మకతను జత చేస్తూ కంప్యూటర్ ద్వారా కొత్త ఫ్యాషన్లు రూపొందిస్తున్నారు. డిజైన్ బట్టి ధరలు కరీంనగర్లో ప్రస్తుతం కంప్యూటర్ బొటిక్ ఎంబ్రాయిడరీ బ్లౌజులు ధరించడానికి మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. వారు ఎంచుకున్న డిజైన్లను బట్టి బ్లౌజ్‌పై డిజైన్ వేయడానికి రూ.600 నుంచి 5వేల వరకు చార్జీ తీసుకుంటున్నారు. రోజూ మూడు బ్లౌజ్‌లు.. బొటిక్ కంప్యూటర్ మిషన్స్ రాక ముందు మగ్గం వర్క్ చేసేవారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన బొటిక్ కళాకారులు ఒక్క బ్లౌజ్‌పై మగ్గం వర్క్ చేస్తే వారం పదిరోజులు పట్టేది. ప్రస్తుతం రోజుకు మూడు బ్లౌజ్లకు బొటిక్ వర్క్ చేస్తున్నాను. – కొప్పుల వేణుకుమార్, నవ్యశ్రీ కంప్యూటర్ బొటిక్ వర్క్స్, జ్యోతినగర్, కరీంనగర్ ఫ్యాషన్ డిజైనింగ్‌కు ఆదరణ.. ఫ్యాషన్ డిజైనింగ్‌కు ఆదరణ పెరిగింది. కరీంనగర్‌లోని విద్యానగర్‌లోని శ్రీ వేంకటేశ్వర టెంపుల్ వద్ద 2సంవత్సరాల క్రితమే వసుంధర పేరుతో కంప్యూటరైజ్డ్ బొటిక్ సెంటర్ ఏర్పాటు చేశాను. యువతుల నుంచి పెద్దవారి వరకు బొటిక్ వర్క్ బ్లౌజ్‌లు ధరిస్తున్నారు. కొరియర్ సర్వీస్ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా వర్క్ ఆర్డర్స్ వస్తాయి. – శ్వేతారఘురాం, కంప్యూటరైజ్ బొటిక్ వర్క్స్, విద్యానగర్, కరీంనగర్ అభిరుచికి తగ్గట్లు.. బొటిక్ డిజైనింగ్‌లో కంప్యూటర్లు వచ్చి సంవత్సరం అవుతున్నప్పటికీ ఇప్పుడు మరింత ఆధునిక కంప్యూటరైజ్డ్ బొటిక్ మిషన్స్ వచ్చాయి. కొరుకున్న డిజైన్‌ను 1గంట నుంచి 8గంటలలోపు సమయం పడుతుంది. – నవ్యశ్రీ, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్, జ్యోతినగర్, కరీంనగర్ కోరుకున్న డిజైన్లు.. ఎప్పటికీ ఉండే పెళ్లిళ్లు, పేరంటాలకు తోడు ఇప్పుడు స్పెషల్ పార్టీలు కూడా వచ్చి చేరాయి. ఇలాంటి పార్టీల్లో హుందాతనం, హోదా, ప్రత్యేకత ఉట్టిపడేలా డ్రెస్సింగ్ ఉండాలని మహిళలు కోరుకుంటారు. కోరుకున్న డిజైన్‌ను గంట నుంచి 8 గంటలలోపు తయారు చేసి ఇస్తున్నారు. ఇద్దరం కలసి ఏర్పాటు చేశాం మేమిద్దరం స్నేహితులం. ఇద్దరం కలిసి లేడీస్ టైలరింగ్ షాపు నిర్వహించే వాళ్లం. క్రమేణా మంచి ఆదరణ లభించింది. మా కస్టమర్లు చాలా మంది బొటిక్ డిజైనింగ్ వేరే వారి వద్ద చేయించేవారు. వారందరి ప్రోత్సాహంతో ఎంబ్రాయిడరీ బొటిక్ కంప్యూటరైజ్డ్ మిషన్ గత నెలలో తీసుకొచ్చి వర్క్ చేస్తున్నాం. ప్రస్తుతం రోజుకు రూ.1000 వరకు వస్తున్నాయి. – భారతి, శ్వేత, షణ్ముఖి డిజైనర్స్, జ్యోతినగర్, కరీంనగర్ ఒక్కరోజులో కోరుకున్న డిజైన్‌లో బ్లౌజ్.. ఇది వరకు బ్లౌజ్‌పై మగ్గం వర్క్ చేయించుకోవాలటే రెండు, మూడు నెలల సమయం పట్టేది. పండుగకు రెండు నెలల ముందే చీర కొనుక్కొని మ్యాచింగ్ బ్లౌజ్‌పై మగ్గం వర్క్‌కోసం ఇచ్చేదాన్ని, ఇప్పుడు సీజన్ వర్క్‌ను బట్టి వారం ముందు ఇస్తే చాలు బొటిక్ బ్లౌజ్ తయారు అవుతుంది. – తూమ్ అరుణ, గృహిణి, సుభాష్‌నగర్, కరీంనగర్ గ్రాండ్ లుక్ ఉండాలి ఎంతో ఖరీదు పెట్టి పట్టు చీర తీసుకున్న తర్వాత మంచి డిజైన్‌తో బొటిక్ వర్క్ బ్లౌజ్ ఉండాలి. అప్పుడే చీరకు మరింత గ్రాండ్ లుక్ వస్తుంది. తద్వారా మనకూ వస్తుంది. చీర బాగుండి బ్లౌజ్ బాగాలేకుంటే చీరకు ఉన్న అందం పోతుంది. – సింగిరికొండ మాధవి, గృహిణి, తిరుమల నగర్, కరీంనగర్ చదవండి: Health Benefits of Eating Dates: తీపిగా ఉండే ఖర్జూరాలు తరచుగా తింటున్నారా? ఈ విషయాలు తెలిస్తే! -
సిరి వరాలు
మనింట్లోనే ఉంది మహాలక్ష్మి! ముస్తాబైతే అచ్చం వరమహాలక్ష్మియే! పూజించనక్కర్లేదు. నైవేద్యం పెట్టనక్కర్లేదు. మనింటి అమ్మాయి వరాలు ఇస్తూనే ఉంటుంది. ఇవాళ వరలక్ష్మీ వ్రతం మన ఇంటి వరలక్ష్ములకు అందమైన అలంకరణలు పట్టుచీరలు. ►నీలం, బంగారు రంగు కలిసిపోతే వచ్చే మెరుపు ఈ చీర సొంతం. గులాబీ రంగు అంచు మీద అచ్చమైన జరీ జిలుగులు పండగ శోభను పెంచుతున్నాయి. దీనికి డిజైనర్ బ్లౌజ్‌ను జత చేయడంతో నవతరాన్ని ‘పట్టు’ అమితంగా ఆకట్టుకుంటుంది. ►పట్టు చీరకు నిలువెల్లా అల్లుకున్న జరీ పువ్వుల సొగసు చూపుతిప్పుకోనివ్వడం లేదు. అదే రంగులో ఆకట్టుకునే అంచు లక్ష్మీపూజలో వేయి దీపాల వెలుగులు విరబూయడానికి సిద్ధం అంటుంది. ►ఈ తరం వరమహాలక్ష్మి మేనికి లైట్‌వెయిట్ పట్టుచీర కొంగొత్త కలలకు ఆహ్వానం పలకడానికి సిద్ధం అంటోంది. సంప్రదాయంలోనూ ఆధునికత తోడైతే అలంకరణ కొత్త రెక్కలు కట్టుకుంటుంది. ►అమ్మ పట్టుచీర కొత్తగా రూపుకట్టాలంటే దానికి కొత్త హంగులు జతచేర్చాలి. అందుకు అచ్చమైన పట్టుచీరనే ఓ ఉదాహరణ. ముదురు పసుపు ప్లెయిన్ పట్టుచీరకు కళ తెచ్చే అంచు, చీరను మరింత హైలైట్ చేసే డిజైనర్ జాకెట్టు వేడుకకు వెయ్యింతల వెలుగులు తెస్తుంది. ►పండగకళ రావాలంటే ఆకుపచ్చ రంగు ఇంటికి తోరణమవ్వాల్సిందే! శ్రావణలక్ష్మిని ఆహ్వానించాలంటే పచ్చరంగు పట్టుచీర జిలుగులు నలువైపులా పరుచుకోవాల్సిందే! చిన్న చిన్న జరీ బుటీతో సెల్ఫ్ బార్డర్‌తో ఆకట్టుకునే ఇలాంటి డిజైన్లు ఎన్నో మనసును కట్టడి చేస్తూనే ఉంటాయి. ► నీలాకాశం ఇలకు దిగితే.. ఆ చుక్కలు నట్టింట్లో నడయాడితే.. ఆ అందాన్ని, ఆనందాన్ని వర్ణించడం తరమా! మన ఇంటి వరమహాలక్ష్మి పట్టుచీరలో ఇలా కనువిందు చేస్తే కళ్లూ, మనసూ నిండి... ఆ ఇంట సిరిసంపదలు కొల్లలుగా జల్లులై కురవాల్సిందే! ►కంజీవరం పట్టుచీరలో ఆకుపచ్చ, బంగారు రంగులు ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. వీటికి ఆభరణాల జిలుగులు, పువ్వుల కళలు తోడై సంప్రదాయ వెలుగులు విరజిమ్ముతున్నాయి. శ్రావణలక్ష్మికి స్వాగతం పలుకుతున్నాయి. ►పసుపు, కుంకుమ, పచ్చదనం.. ఈ మూడింటి రూపం శ్రీమహాలక్ష్మి. ఆ కళ కనుల నిండుగా మెరవాలంటే పట్టుచీరతో ముస్తాబు అవ్వాల్సిందే. చీర జరీ జిలుగులు మోములో పువ్వులై విరియాల్సిందే! మేని వెలుగులు ముచ్చటగొలపాలంటే ఆభరణాల కాంతులు అణకువగా ఉండాల్సిందే! -
హీరోయిన్ల్ కొత్త అందాలు
పండగ పట్టు ఎక్కడైనా పట్టు విడుపు ఉండాలి కానీ, ఇలాంటి చీరలు చూస్తే పట్టు కట్టు తప్పదు. ఈ పండగ మీద ఒట్టు మీ ఆవిడకో పట్టు నువ్వు తప్పకుండా కట్టు. ►పట్టు చీరకు బుట్ట చేతుల సింగారం. నీలాకాశానికి బంగారు, గులాబీ రంగులు చేర్చిన వన్నెల నయగారం. పండగ రోజున కోటి కాంతుల సోయగాన్ని మోసుకువచ్చే కాంబినేషన్ కట్టుతో నటి, కాజల్. ►అచ్చమైన జిలుగుల కళ కంజీవరం పట్టు ప్రత్యేకం. వెలుగుల కళలు పండగ వేళకు ప్రత్యేకం. కంచిపట్టు చీరతో సింపుల్‌గా అనిపిస్తూనే గ్రాండ్ లుక్‌తో కట్టిపడేస్తున్న నటి, సమంత. ►ప్లెయిన్ చిలకపచ్చ పట్టు చీరకు పూర్తి కాంట్రాస్ట్ బ్లూ కలర్ బ్లౌజ్ కాంబినేషన్ సరైన ఎంపిక. పండగ వేళ ఓ కొత్త కళగా ఆకట్టుకుంటున్న కాంబినేషన్‌తో నటి రకుల్ ప్రీత్‌సింగ్. ►సంప్రదాయ కట్టుకు పట్టు పండగలో ఓ వెలుగు. కళ తెచ్చే రంగులు, జరీ హంగులతో వెలిగిపోతున్న నటి నందిత. ►రెట్రో స్టైల్: 1940 సంవత్సరం కాలం నాటి కళ నేటికీ ఎవర్గ్రీన్ అని చాటుతూనే ఉంది. ఉప్పాడ పట్టు శారీకి కాంట్రాస్ట్ డిజైనర్ ప్లెయిన్ బ్లౌజ్ ఓ ప్రత్యేక ఆకర్షణకు ఉదాహరణగా నిలిచిన నటి, రెజీనా! ►కంజీవరం జరీ కాంతులు పండగవేళ మేని మెరుపుతో పోటీపడితే రెట్టింపు సందడి నట్టింటికి విచ్చేసినట్టే. స్లీవ్‌లెస్ బ్లౌజ్, మిరపపండు చీరను మెరిపించే జరీకాంతులతో నటి రాశీఖన్నా! ►మస్టర్డ్ కలర్ శారీకి మెరూన్ అంచు పండగ ప్రత్యేకతను నిలిచే కట్టు. డిజైనర్ బ్లౌజ్ ప్రధాన ఆకర్షణగా కనిపిస్తున్న నటి నదియా!