పండగ పట్టు
ఎక్కడైనా పట్టు విడుపు ఉండాలి కానీ, ఇలాంటి చీరలు చూస్తే పట్టు కట్టు తప్పదు. ఈ పండగ మీద ఒట్టు మీ ఆవిడకో పట్టు
నువ్వు తప్పకుండా కట్టు.
►పట్టు చీరకు బుట్ట చేతుల సింగారం. నీలాకాశానికి బంగారు, గులాబీ రంగులు చేర్చిన వన్నెల నయగారం. పండగ రోజున కోటి కాంతుల సోయగాన్ని మోసుకువచ్చే కాంబినేషన్ కట్టుతో నటి, కాజల్.
►అచ్చమైన జిలుగుల కళ కంజీవరం పట్టు ప్రత్యేకం. వెలుగుల కళలు పండగ వేళకు ప్రత్యేకం. కంచిపట్టు చీరతో సింపుల్‌గా అనిపిస్తూనే గ్రాండ్ లుక్‌తో కట్టిపడేస్తున్న నటి, సమంత.
►ప్లెయిన్ చిలకపచ్చ పట్టు చీరకు పూర్తి కాంట్రాస్ట్ బ్లూ కలర్ బ్లౌజ్ కాంబినేషన్ సరైన ఎంపిక. పండగ వేళ ఓ కొత్త కళగా ఆకట్టుకుంటున్న కాంబినేషన్‌తో నటి రకుల్ ప్రీత్‌సింగ్.
►సంప్రదాయ కట్టుకు పట్టు పండగలో ఓ వెలుగు. కళ తెచ్చే రంగులు, జరీ హంగులతో వెలిగిపోతున్న నటి నందిత.
►రెట్రో స్టైల్: 1940 సంవత్సరం కాలం నాటి కళ నేటికీ ఎవర్‌గ్రీన్ అని చాటుతూనే ఉంది. ఉప్పాడ పట్టు శారీకి కాంట్రాస్ట్ డిజైనర్ ప్లెయిన్ బ్లౌజ్ ఓ ప్రత్యేక ఆకర్షణకు ఉదాహరణగా నిలిచిన నటి, రెజీనా!
►కంజీవరం జరీ కాంతులు పండగవేళ మేని మెరుపుతో పోటీపడితే రెట్టింపు సందడి నట్టింటికి విచ్చేసినట్టే. స్లీవ్‌లెస్ బ్లౌజ్, మిరపపండు చీరను మెరిపించే జరీకాంతులతో నటి రాశీఖన్నా!
►మస్టర్డ్ కలర్ శారీకి మెరూన్ అంచు పండగ ప్రత్యేకతను నిలిచే కట్టు. డిజైనర్ బ్లౌజ్ ప్రధాన ఆకర్షణగా కనిపిస్తున్న నటి నదియా!
హీరోయిన్ల్ కొత్త అందాలు
Published Thu, Oct 6 2016 10:42 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM
Advertisement
Advertisement