
చీరలండోయ్.. బాహుబలి చీరలు
సూరత్: సూరత్‌లో బాహుబలి–2 చీరలు రూపొందిస్తున్నారు. సినిమా విడుదలకు ముందే ఈ చీరలను అన్ని మార్కెట్లలో ముఖ్యంగా దక్షిణభారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చేందుకు కృషి చేస్తున్నారు. వస్త్ర నగరమైన సూరత్ మిలెనేనియం టెక్స్‌టైల్ మార్కెట్‌లొని శ్రీజీ హొల్ సేల్ శారీస్ వ్యాపారి కమ్‌లేష్‌భాయి వినూత్నమైన ఆలొచనతొ బాహుబలీ–2 చిత్రంలోని ఫొటోలతో ఈ చీరలను డిజిటల్ ప్రింటింగ్ చేయించారు.
ఇషాన్ డిజిటల్ ప్రిటింగ్ కంపెనీలొని డిజైనర్ హితేష్ ప్రజాపతి రూపొందించిన బాహుబలి డిజైన్‌లు ఆకర్షనీయమైన రంగుల్లో ఉన్నాయి. ముఖ్యంగా హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్క శెట్టిల ఫొటోలతోపాటు పలు సన్నివేశాలతో డిజైన్‌చేశారు. ఇప్పటి వరకు 20 వేల చీరలను తెలంగాణ, ఆంద్ర«ప్రదేశ్, తమిళనాడు మొదలగు ప్రాంతాల్లోని వివిధ మార్కెట్లకు పంపించామని తొందర్లోనే మార్కెట్లో లభించనున్నట్టు కమలేష్‌భాయి చెప్పారు.