వేడుకలో గ్రాండ్‌గా వెలిగిపోవాలన్నా సింపుల్ డ్రెస్‌ను రిచ్‌గా మార్చేయాలన్నా ఒకే ఒక టెక్నిక్... వెల్వెట్ లాంగ్ జాకెట్! ఎంబ్రాయిడరీ జిలుగులతో మెరిసే కళను సొంతం చేసుకున్న వెల్వెట్ జాకెట్ శారీ, సల్వార్, లెహంగాలకు కాంబినేషన్‌గా ఇట్టే అమరిపోతుంది. చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది.
రిసెప్షన్, బర్త్‌డే, గెట్ టు గెదర్ వేడుకలలో ఎప్పుడూ ఒకే తరహా సంప్రదాయ లుక్‌లో కనిపించాలన్నా బోర్ అనిపిస్తుంటుంది. రొటీన్‌కు బ్రేక్ వేయాలంటే ఎంబ్రాయిడరీ చేసిన వెల్వెట్ లాంగ్ జాకెట్ లేదా కోటును ఎంచుకుంటే చాలు. ముఖ్యంగా సాయంకాలాలు జరిగే పార్టీలో వెల్వెట్ మెరుపు మరింత అందాన్ని ఇస్తుంది.
బ్లాక్, పర్పుల్, బ్లూ, గ్రీన్ కలర్ వెల్వెట్ కోట్లు విలాసానికి అసలు సిసలు చిరునామాగా నిలుస్తాయి. విడిగా వెల్వెట్ క్లాత్ తీసుకొని, ఎవరికి వారు సొంతంగా డిజైన్ చేయించుకోవచ్చు. లేదంటే, మార్కెట్లో రెడీమేడ్‌గా లభించే లాంగ్ వెల్వెట్ జాకెట్స్‌ను ఎంచుకోవచ్చు.
రాజరికపు హంగులను తీసుకురావడానికి వెల్వెట్ జాకెట్ సరైన ఎంపిక అవుతుంది. సేమ్ లేదా కాంట్రాస్ట్ కలర్ జాకెట్స్ కూడా ధరించవచ్చు. ఈ లాంగ్ జాకెట్స్ ప్రత్యేక ఆకర్షణతో ఉంటాయి కనుక ఆభరణాల విషయంలో అంతగా హంగామా అవసరం ఉండదు. చెవులకు వెడల్పాటి, లాంగ్ హ్యాంగింగ్స్ ఎంచుకుంటే చాలు.
ఫ్యాషన్ జ్యువెల్రీ కన్నా స్టోన్ జ్యువెలరీ ఈ డ్రెసింగ్‌కి సరైన ఎంపిక. సంప్రదాయ కేశాలంకరణ కూడా ఈ తరహా డ్రెస్సింగ్‌కి అనువైనదిగా ఉండదు. ఇండోవెస్ట్రన్ స్టైల్‌లో శిరోజాల అలంకరణ బాగుంటుంది.
చదవండి: Rini Mehta- Pitara: అక్క ఎంబీఏ, తమ్ముడు లా వదిలేసి.. పాత చీరలతో బ్యాగులు తయారు చేస్తూ..
Monsoon- Wardrobe Ideas: వర్షాకాలంలో ఈ దుస్తులు అస్సలు వద్దు! ఇవి వాడితే బెటర్!
Comments
Please login to add a commentAdd a comment