Velvet cloth
-
Fashion: సింపుల్ లుక్‌ను ‘రిచ్’గా మార్చేయగల వెల్వెట్ లాంగ్ జాకెట్!
వేడుకలో గ్రాండ్‌గా వెలిగిపోవాలన్నా సింపుల్ డ్రెస్‌ను రిచ్‌గా మార్చేయాలన్నా ఒకే ఒక టెక్నిక్... వెల్వెట్ లాంగ్ జాకెట్! ఎంబ్రాయిడరీ జిలుగులతో మెరిసే కళను సొంతం చేసుకున్న వెల్వెట్ జాకెట్ శారీ, సల్వార్, లెహంగాలకు కాంబినేషన్‌గా ఇట్టే అమరిపోతుంది. చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. రిసెప్షన్, బర్త్‌డే, గెట్ టు గెదర్ వేడుకలలో ఎప్పుడూ ఒకే తరహా సంప్రదాయ లుక్‌లో కనిపించాలన్నా బోర్ అనిపిస్తుంటుంది. రొటీన్‌కు బ్రేక్ వేయాలంటే ఎంబ్రాయిడరీ చేసిన వెల్వెట్ లాంగ్ జాకెట్ లేదా కోటును ఎంచుకుంటే చాలు. ముఖ్యంగా సాయంకాలాలు జరిగే పార్టీలో వెల్వెట్ మెరుపు మరింత అందాన్ని ఇస్తుంది. బ్లాక్, పర్పుల్, బ్లూ, గ్రీన్ కలర్ వెల్వెట్ కోట్లు విలాసానికి అసలు సిసలు చిరునామాగా నిలుస్తాయి. విడిగా వెల్వెట్ క్లాత్ తీసుకొని, ఎవరికి వారు సొంతంగా డిజైన్ చేయించుకోవచ్చు. లేదంటే, మార్కెట్లో రెడీమేడ్‌గా లభించే లాంగ్ వెల్వెట్ జాకెట్స్‌ను ఎంచుకోవచ్చు. రాజరికపు హంగులను తీసుకురావడానికి వెల్వెట్ జాకెట్ సరైన ఎంపిక అవుతుంది. సేమ్ లేదా కాంట్రాస్ట్ కలర్ జాకెట్స్ కూడా ధరించవచ్చు. ఈ లాంగ్ జాకెట్స్ ప్రత్యేక ఆకర్షణతో ఉంటాయి కనుక ఆభరణాల విషయంలో అంతగా హంగామా అవసరం ఉండదు. చెవులకు వెడల్పాటి, లాంగ్ హ్యాంగింగ్స్ ఎంచుకుంటే చాలు. ఫ్యాషన్ జ్యువెల్రీ కన్నా స్టోన్ జ్యువెలరీ ఈ డ్రెసింగ్‌కి సరైన ఎంపిక. సంప్రదాయ కేశాలంకరణ కూడా ఈ తరహా డ్రెస్సింగ్‌కి అనువైనదిగా ఉండదు. ఇండోవెస్ట్రన్ స్టైల్లో శిరోజాల అలంకరణ బాగుంటుంది. చదవండి: Rini Mehta- Pitara: అక్క ఎంబీఏ, తమ్ముడు లా వదిలేసి.. పాత చీరలతో బ్యాగులు తయారు చేస్తూ.. Monsoon- Wardrobe Ideas: వర్షాకాలంలో ఈ దుస్తులు అస్సలు వద్దు! ఇవి వాడితే బెటర్! -
పట్టుచీరకు రాయల్ టచ్
వెల్వెట్ క్లాత్ అంటేనే రాయల్ ఫ్యాబ్రిక్. వివాహ వేడుకల్లో సంప్రదాయపు సందడికి పెట్టింది పేరు పట్టు చీరలు. సంప్రదాయానికి రాయల్ టచ్ అద్దితే..! పట్టు చీరకు సెల్ఫ్ బ్లౌజ్ లేదంటే కాంట్రాస్ట్ డిజైనర్ బ్లౌజ్ వాడడటం ►చీర రంగు వెల్వెట్ ఫ్యాబ్రిక్‌తో హాప్ షోల్డర్ బ్లౌజ్‌ను డిజైన్ చేయిస్తే మోడ్రన్ లుక్. ఈ కాంబినేషన్‌కి రాళ్లు పొదిగిన హారాలు మరింత అందాన్నిస్తాయి. ►వెల్వెట్ బ్లౌజ్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పూసలు, జర్దోసీతో స్లీవ్స్ ప్యాటర్న్‌కి మాత్రమే ఎంబ్రాయిడరీ చేయించుకోవచ్చు. పట్టుచీరకు పూర్తి కాంట్రాస్ట్ వెల్వెట్ బ్లౌజ్‌ను ధరిస్తే ప్రత్యేకంగా కనిపిస్తారు. ►పట్టుచీర రంగులో ఉన్న వెల్వెట్ బ్లౌజ్‌కి చేతుల భాగంలో ఆ చీర అంచు భాగాన్ని జత చేస్తే రాయల్ లుక్‌తో మెరిసిపోతారు. ►సింపుల్‌గా మోచేతుల వరకు స్లీవ్స్ డిజైన్ చేయించుకున్నా, కాస్త హెవీ ఎంబ్రాయిడరీ చేసినట్లయితే హాఫ్వైట్శారీస్కి మరిన్ని హంగులు అద్దినట్టే. -
మీ బుజ్జి తల్లికి బుల్లి గిఫ్ట్!
ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ అందం వేరు. తనని చక్కగా తయారు చేయడంలో తల్లి పడే ఆనందమే వేరు. మంచి గౌను వేసి, తలను అందంగా దువ్వి, అందమైన క్లిప్పులు పెట్టి పాపను బుట్టబొమ్మలా తయారు చేస్తుంటారు అమ్మలు. నిజానికి మీ పాపకు అవసరమైన వస్తువులను చాలావరకూ మీరే తయారు చేసుకోవచ్చు తెలుసా? మెళ్లోకి గొలుసులు, చేతికి గాజులు, చెవులకు బుట్టలు, జుత్తుకు క్లిప్పులు... ఇలా అన్నీ చేయవచ్చు. ప్రస్తుతానికి క్లిప్స్ తయారు చేయడమెలాగో చూద్దామా! వెల్వెట్ క్లాత్గానీ, మరేదైనా దళసరి గుడ్డను కానీ తీసుకోండి. దానిమీద మీకు నచ్చిన ఆకారంలో పువ్వును గీయండి. దాన్ని కత్తిరించి, ఓ పెన్నును తీసుకుని మధ్యలో గట్టిగా పొడవండి. దాన్ని అయిదు వేళ్ల మధ్యనా ఉంచి, మొగ్గలా ముడిచి వదిలి పెట్టండి. అప్పుడది నిజంగానే పువ్వు ఆకారంలోకి ఒదిగిపోతుంది. అలాంటిదే మరో చిన్ని పువ్వును కూడా చేయండి. ఆ రెండిటినీ ఒకదాని మీద ఒకటి పెట్టి, మధ్యలో ఓ అందమైన పూస పెట్టి కుట్టేయండి. ఈ పువ్వును బేబీ క్లిప్‌కు వైరుతో కుట్టండి. గ్లూతో అతికించినా ఫర్వాలేదు. ఆ క్లిప్ మీ బుజ్జాయి తలపైన ఎంత అందంగా ఉంటుందో మీరే చూసుకోండి!