వెల్వెట్ క్లాత్ అంటేనే రాయల్ ఫ్యాబ్రిక్. వివాహ వేడుకల్లో సంప్రదాయపు సందడికి పెట్టింది పేరు పట్టు చీరలు. సంప్రదాయానికి రాయల్ టచ్ అద్దితే..! పట్టు చీరకు సెల్ఫ్ బ్లౌజ్ లేదంటే కాంట్రాస్ట్ డిజైనర్ బ్లౌజ్ వాడడటం
►చీర రంగు వెల్వెట్ ఫ్యాబ్రిక్‌తో హాప్ షోల్డర్ బ్లౌజ్‌ను డిజైన్ చేయిస్తే మోడ్రన్ లుక్. ఈ కాంబినేషన్‌కి రాళ్లు పొదిగిన హారాలు మరింత అందాన్నిస్తాయి.
►వెల్వెట్ బ్లౌజ్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పూసలు, జర్దోసీతో స్లీవ్స్ ప్యాటర్న్‌కి మాత్రమే ఎంబ్రాయిడరీ చేయించుకోవచ్చు. పట్టుచీరకు పూర్తి కాంట్రాస్ట్ వెల్వెట్ బ్లౌజ్‌ను ధరిస్తే ప్రత్యేకంగా కనిపిస్తారు.
►పట్టుచీర రంగులో ఉన్న వెల్వెట్ బ్లౌజ్‌కి చేతుల భాగంలో ఆ చీర అంచు భాగాన్ని జత చేస్తే రాయల్ లుక్‌తో మెరిసిపోతారు.
►సింపుల్‌గా మోచేతుల వరకు స్లీవ్స్ డిజైన్ చేయించుకున్నా, కాస్త హెవీ ఎంబ్రాయిడరీ చేసినట్లయితే హాఫ్‌వైట్‌శారీస్‌కి మరిన్ని హంగులు అద్దినట్టే.
పట్టుచీరకు రాయల్ టచ్
Published Fri, Dec 6 2019 12:31 AM | Last Updated on Fri, Dec 6 2019 12:31 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment