Long Jacket
-
Fashion: సింపుల్ లుక్‌ను ‘రిచ్’గా మార్చేయగల వెల్వెట్ లాంగ్ జాకెట్!
వేడుకలో గ్రాండ్‌గా వెలిగిపోవాలన్నా సింపుల్ డ్రెస్‌ను రిచ్‌గా మార్చేయాలన్నా ఒకే ఒక టెక్నిక్... వెల్వెట్ లాంగ్ జాకెట్! ఎంబ్రాయిడరీ జిలుగులతో మెరిసే కళను సొంతం చేసుకున్న వెల్వెట్ జాకెట్ శారీ, సల్వార్, లెహంగాలకు కాంబినేషన్‌గా ఇట్టే అమరిపోతుంది. చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. రిసెప్షన్, బర్త్‌డే, గెట్ టు గెదర్ వేడుకలలో ఎప్పుడూ ఒకే తరహా సంప్రదాయ లుక్‌లో కనిపించాలన్నా బోర్ అనిపిస్తుంటుంది. రొటీన్‌కు బ్రేక్ వేయాలంటే ఎంబ్రాయిడరీ చేసిన వెల్వెట్ లాంగ్ జాకెట్ లేదా కోటును ఎంచుకుంటే చాలు. ముఖ్యంగా సాయంకాలాలు జరిగే పార్టీలో వెల్వెట్ మెరుపు మరింత అందాన్ని ఇస్తుంది. బ్లాక్, పర్పుల్, బ్లూ, గ్రీన్ కలర్ వెల్వెట్ కోట్లు విలాసానికి అసలు సిసలు చిరునామాగా నిలుస్తాయి. విడిగా వెల్వెట్ క్లాత్ తీసుకొని, ఎవరికి వారు సొంతంగా డిజైన్ చేయించుకోవచ్చు. లేదంటే, మార్కెట్లో రెడీమేడ్‌గా లభించే లాంగ్ వెల్వెట్ జాకెట్స్‌ను ఎంచుకోవచ్చు. రాజరికపు హంగులను తీసుకురావడానికి వెల్వెట్ జాకెట్ సరైన ఎంపిక అవుతుంది. సేమ్ లేదా కాంట్రాస్ట్ కలర్ జాకెట్స్ కూడా ధరించవచ్చు. ఈ లాంగ్ జాకెట్స్ ప్రత్యేక ఆకర్షణతో ఉంటాయి కనుక ఆభరణాల విషయంలో అంతగా హంగామా అవసరం ఉండదు. చెవులకు వెడల్పాటి, లాంగ్ హ్యాంగింగ్స్ ఎంచుకుంటే చాలు. ఫ్యాషన్ జ్యువెల్రీ కన్నా స్టోన్ జ్యువెలరీ ఈ డ్రెసింగ్‌కి సరైన ఎంపిక. సంప్రదాయ కేశాలంకరణ కూడా ఈ తరహా డ్రెస్సింగ్‌కి అనువైనదిగా ఉండదు. ఇండోవెస్ట్రన్ స్టైల్లో శిరోజాల అలంకరణ బాగుంటుంది. చదవండి: Rini Mehta- Pitara: అక్క ఎంబీఏ, తమ్ముడు లా వదిలేసి.. పాత చీరలతో బ్యాగులు తయారు చేస్తూ.. Monsoon- Wardrobe Ideas: వర్షాకాలంలో ఈ దుస్తులు అస్సలు వద్దు! ఇవి వాడితే బెటర్! -
Saree Styles With Sweater: చలికాలంలో ఫ్యాషనబుల్‌గా వెచ్చని స్టైల్!
కాలానికి తగినట్టు చలిని తట్టుకోవాలంటే మన వేషధారణలోనూ ప్రస్తుతం కొన్ని మార్పులు చేసుకోవాలి. క్యాజువల్ అయినా.. పార్టీ అయినా.. పెళ్లి అయినా.. పండగ అయినా.. స్వెటర్‌తో ఒక స్టైల్, డెనిమ్ షర్ట్‌తో మరో స్టైల్.. పెప్లమ్ టాప్‌తో ఒక స్టైల్, లాంగ్ జాకెట్‌తో మరో స్టైల్... ఇలా ఒక చీరకట్టుకే భిన్నమైన స్టైల్స్‌ను జత చేయచ్చు. కాలానికి తగిన విధంగా లుక్‌లో మార్పులు తీసుకురావచ్చు. పెళ్లికి వెళ్లాలంటే ఎప్పుడూ ఒకేవిధంగా ఉండనక్కర్లేదు. బెనారస్ లాంగ్ జాకెట్‌ను పట్టు చీరకు జతగా ధరిస్తే చాలు చలికాలానికి తగినట్టుగా చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఎంతమందిలో ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తుంది. క్యాజువల్ లుక్‌లో కొంచెం భిన్నంగా ఉండటంతోపాటు స్టైల్‌గా కనిపించాలంటే ఈ సీజన్‌కి తగినట్టుగా డెనిమ్ జాకెట్‌ను శారీకి జతగా ధరిస్తే చాలు. ఎక్కువ ఆభరణాలు అవసరం లేకుండా వర్క్వేర్గా అందంగా కనిపిస్తుంది. కాటన్ చీరలు ధరించేవారు ప్లెయిన్ లేదా శారీ కలర్ బ్లౌజ్ ధరించడం చూస్తుంటాం. దీంట్లోనే కొంత భిన్నమైన లుక్‌ను తీసుకురావచ్చు. టర్టిల్ నెక్, లాంగ్ స్లీవ్స్ ఉన్న ప్లెయిన్ కలర్ బ్లౌజ్‌లను ఈ శారీ స్టైల్‌కు వాడొచ్చు. ఈ కాటన్ శారీస్‌కు టర్టిల్ నెక్ ఉన్న స్వెట్ షర్ట్ కూడా ధరించవచ్చు. ప్రయాణాలు, సింపుల్ గెట్ టు గెదర్ వంటి వాటికి ఈ స్టైల్ బాగా నప్పుతుంది. కాంతిమంతమైన రంగులలో అంచు భాగాన్ని ఎంబ్రాయిడరీ చేసిన సాదా చీరను ఎంచుకోవాలి. ఆ ఎంబ్రాయిడరీకి సరిపోలే ఓపెన్ ఫ్రంట్ పెప్లమ్ జాకెట్‌ను తీసుకోవాలి. దీంతో పార్టీవేర్ లుక్ ఆకట్టుకుంటుంది. ఒక్క పెప్లమ్ ఓపెన్ టాప్‌తో మీదైన స్టైల్ స్టేట్మెంట్ను ఈ కాలానికి సరికొత్తగా పరిచయం చేయచ్చు. పెళ్లికి వెళ్లేవారు పట్టు చీర కట్టుకుంటారు. దీనికి బ్లాక్ కలర్ లంగా జాకెట్, సంప్రదాయ ఆభరణాలు ధరించి చూడండి. ఇండో వెస్ట్రన్ లుక్‌తో ప్రత్యేకంగా కనిపిస్తారు. పార్టీకి చిటికలో తయారై వెళ్లాలంటే లాంగ్ జాకెట్‌తో ఉన్న ద్రెసింగ్ రెడీమేడ్ శారీని ఎంచుకుంటే చాలు. ఫ్యాషనబుల్‌గా కనిపించడంతోపాటు కాలానుగుణంగా డ్రెస్ ధరించడంలోనూ మార్కులు కొట్టేస్తారు. పెళ్లికి స్వెటర్ ధరిస్తే బాగుండదు అనుకునేవారు ఇలా పట్టుచీరకు లాంగ్ స్లీవ్స్ ఉన్న వైట్ షర్ట్ ధరించి, నడుముకు వెడల్పాటి లెదర్ బెల్ట్‌తో తయారవ్వచ్చు. సంప్రదాయ ముత్యాల హారాలు ఈ స్టైల్‌కు మరింత వన్నె తెస్తాయి. చదవండి: పాదాలను బట్టి వారెలాంటివారో అంచనా వేయొచ్చట!!.. ఐతే.. -
శిల్పకళ
‘శిల్పంలా ఉన్నావు’ అంటే అందంగా ఉన్నట్టు. శిల్పాలు అందంగా మాత్రమే ఉండవు. అందులో కొన్ని అద్భుతంగానూ ఉంటాయి. ఉలి పట్టిన చేయి మహత్యం అది. డిజైనర్లు కూడా అంతే. ఇక్కడ తీర్చిదిద్దిన దుస్తులతో చెక్కిన శిల్పంలా అందంగా మాత్రమే కాదు అద్భుతాల్లా మెరిసిపోతున్న తారలకు ఆ మెరుపులద్దారు హైదరాబాదీ స్టార్ డిజైనర్ శిల్పారెడ్డి. లాంగ్ జాకెట్‌పైన జరీ ఎంబ్రాయిడరీ, గ్రే కలర్ లాంగ్ స్కర్ట్‌కి బంగారు అంచు.. వేడుకలో ప్రత్యేక ఆకర్షణ. ఎంబ్రాయిడరీ చేసిన గోల్డ్ కలర్ బుటీస్‌తో మెరిపించిన లెహంగా, అదే రంగు ప్లెయిన్ జాకెట్టు, నెటెడ్ దుపట్టా.. వేదికమీద వేడుకగా వెలిగిపోయింది. మోడల్, ఫిట్నెస్ ఎక్స్పర్ట్, ఫ్యాషన్ డిజైనర్‌గా తెలుగువారికి సుపరిచితురాలు శిల్పారెడ్డి. హైదరాబాద్ ఫలక్నామా ప్యాలెస్‌లో ఇటీవల జరిగిన ఫ్యాషన్ షో లో మస్టర్డ్ చందేరీ సిల్క్ జాకెట్, మెర్మెయిడ్ స్కర్ట్‌లో ఇలా మెరిశారు.చందేరీ సిల్క్ లాంగ్ జాకెట్‌పైన హ్యాండ్ ఎంబ్రాయిడరీతో మెరిపించిన జరీ తళుకులు. మస్టర్డ్ కలర్ లెహంగా అదే రంగు ఆర్గంజా దుపట్టాకు హెవీ హ్యాండ్ కట్ వర్క్ ఎంబ్రాయిడరీ చేసిన అంచు.. ప్రత్యేక ఆకర్షణతో మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్. లావెండర్ చందేరీ సిల్క్ గౌన్, నడుము భాగాన కట్ ఔట్ డిజైన్, గోల్డ్ బుటీస్‌తో మెరుపుతీగలా బాలీవుడ్ నటి సోనాల్ చౌహాన్. బంగారు రంగు అంచు ఉన్న చందేరీ సిల్క్ ప్లెయిన్ లాంగ్ స్కర్ట్, అదే రంగు లాంగ్ జాకెట్‌పైన చేసిన ఎంబ్రాయిడరీ వర్క్... మేలిముసుగులా మారిన నెటెడ్ దుపట్టా రాయల్ అందాలను మోసుకొచ్చింది. -
లంగా జాకెట్ పోయే... లాంగ్ జాకెట్ ఆయే!
పొడవే అందం. ఈ లాంగ్ జాకెట్ స్టైల్స్‌ను చూస్తే మీరు ఈ మాట అనకుండా ఉండలేరు. లంగాజాకెట్ పోయి లాంగ్ జాకెట్ వచ్చేసింది. అందుకే ఇక నుంచి వేడుక ఏదైనా మీ స్టైల్‌ను పొడుగ్గా మార్చేయండి. మీ చుట్టూ చూపుల ‘క్యూ’ పొ...డు..గ్గా.. మారిపోతే విలాసంగా నవ్వుకోండి. మేల్ సూట్ కాస్తా ఫిమేల్ ఖాతాలో చేరితే ఎలా రూపుకడుతుందో ఈ లాంగ్ జాకెట్స్ కళ్లకు కడుతున్నాయి. అంతేనా రెగ్యులర్‌గా వాడే చిన్న జాకెట్ కాస్తా పొడుగైపోయి అందం రెట్టింపయ్యింది. రాబోయే రోజులన్నీ వేడుకలే. వాటితో పాటే వివాహ వేడుకలు ఉండనే ఉన్నాయి. ఇక పుట్టినరోజులు, పెళ్లిరోజు పార్టీలు సదా మామూలే! ఇలాంటప్పుడు ‘ఎప్పుడూ వేసుకునే అనార్కలీని అదే స్టైల్లో ఏం వేస్తాం? ఎప్పుడూ వేసే లెహంగానే ఈ పెళ్లికీ ఎలా మెరిపిస్తాం? ఈవెనింగ్ పార్టీలకు లాంగ్ గౌన్ ఎన్ని సార్లని వేస్తాం?’ అని పెదవి విరిచే అమ్మాయిలు, అతివలు ఈ న్యూ స్టైల్లో న్యూ లుక్‌తో వెలిగిపోవచ్చు. అదే లాంగ్ జాకెట్ స్టైల్. పొట్టి నుంచి... వింటర్ ఫ్యాషన్ వేర్‌గా పేరున్న షగ్స్ ్రనుంచి సంప్రదాయ దుస్తుల మీదకు పొట్టి ఓవర్‌కోట్స్ పుట్టుకువచ్చాయి. ఇవి కాస్తా ఆ తర్వాత కాలంలో పొడవాటి కోటుగా దర్శనమిచ్చాయి.కోటు స్టైల్... మగమహారాజుల సూట్ డిజైన్స్ చూశారా! ఆ తరహాని పోలినట్టుగా ఉండే లా లాంగ్ కోటును మీ శరీరాకృతికి తగిన విధంగా డిజైన్ చేయించుకోండి. పొడవాటి గౌన్ మీదకు ఈ కోటు ధరించండి. స్టైల్లో మీరే మహారాణి అనిపిస్తారు. ప్రంట్ ఓపెన్... ఫ్లోర్ లెంగ్త్ అనార్కలీ డ్రెస్‌ల మీదకు పూర్తి కాంట్రాస్ట్ లేదా సేమ్ కలర్ లాంగ్ జాకెట్‌ను డిజైన్ చేసుకోండి. స్లీవ్‌లెస్ అనార్కలీ మీదకు నెట్‌డ్ లేదా బెనారస్ మెటీరియల్‌తో తీర్చిదిద్దిన జాకెట్‌పైన ఫుల్ ఎంబ్రాయిడరీని మెరిపించండి. కొత్త డ్రెస్ రెడీ అయిపోతుంది. గ్రాండ్‌గా... లాంగ్ జాకెట్ క్లాత్ ఎంత గ్రాండ్‌గా ఉన్నది ఎంచుకుంటే మీ హుందాతనం అంతగా ఇనుమడిస్తుంది. అందుకు పట్టు, బెనారస్, వెల్వెట్, షిమ్మర్ నెట్ మెటీరియల్స్ బాగా నప్పుతాయి. వీటిపైన జర్దోసీ, కుందన్స్, మిర్రర్.. వర్క్ తప్పనిసరి. అయితే, ఎంత స్టైల్‌గా ఉండాలి అనేది మీ మీ అభిరుచులను బట్టి ఉంటుంది. డిజైనర్ల ఫేవరేట్ స్టైల్... ఈ జాకెట్ స్టైల్‌ను ముందు డిజైన్ చేసినవారిలో భారతీయ డిజైనర్ రోహిత్బాల్కే మొదటి ఘనత దక్కుతుంది. వెడ్డింగ్ డిజైన్స్‌లో భాగంగా ఈ స్టైల్‌ను ర్యాంప్‌షోలో తళుక్కుమనిపించి అందరినీ ఆకట్టుకునేలా చేశారీ డిజైనర్. ఆ తర్వాత మనీష్ మల్హోత్రా, రితుకుమార్ వంటి డిజైనర్లూ వీటికి మరిన్ని మెరుగులు అద్దారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు సంప్రదాయ దుస్తుల మీదకు ఈ లాంగ్ జాకెట్లు తారలు ధరించి హొయలు ఒలికిస్తున్నారు. - ఎన్.ఆర్ సోహా ఆలిఖాన్ డిజైనర్ అర్పితా మెహతా డిజైన్ చేసిన ఆకుపచ్చ లాంగ్ జాకెట్న ు ధరించి ఈ ఏడాది లాక్మే ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్నారు సోహా. లాంగ్ జాకెట్ మీద అద్దాల మెరుపులు అదనపు ఆకర్షణను తెచ్చాయి. షర్ట్ మీదకు కోటు ధరించడం పాశ్చాత్యుల స్టైల్. దీనినే ఓవర్‌కోట్, బ్లేజర్, జాకెట్.. వంటి పదాలను వాడుతుంటారు. మగవారి సూట్స్‌లో కోటు తప్పనిసరి అనేది మనకు తెలిసిందే! అక్కడ నుంచే రకరకాల మార్పులు చేసుకొని, మన భారతీయ వస్త్ర వైభవంలో మరింత వైభవంగా వెలిగిపోతోంది ఓవర్ కోట్. అదే ఈ లాంగ్ జాకెట్.