లంగా జాకెట్ పోయే... లాంగ్ జాకెట్ ఆయే! | Jacket with a skirt that goes ... Long Jacket Aye! | Sakshi
Sakshi News home page

లంగా జాకెట్ పోయే... లాంగ్ జాకెట్ ఆయే!

Published Thu, Aug 6 2015 11:27 PM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM

లంగా జాకెట్ పోయే...  లాంగ్ జాకెట్ ఆయే!

లంగా జాకెట్ పోయే... లాంగ్ జాకెట్ ఆయే!

పొడవే అందం. ఈ లాంగ్ జాకెట్ స్టైల్స్‌ను చూస్తే మీరు ఈ మాట అనకుండా ఉండలేరు. లంగాజాకెట్ పోయి లాంగ్ జాకెట్ వచ్చేసింది. అందుకే ఇక నుంచి వేడుక ఏదైనా మీ స్టైల్‌ను పొడుగ్గా మార్చేయండి. మీ చుట్టూ చూపుల ‘క్యూ’ పొ...డు..గ్గా.. మారిపోతే విలాసంగా నవ్వుకోండి.
     
మేల్ సూట్ కాస్తా ఫిమేల్ ఖాతాలో చేరితే ఎలా రూపుకడుతుందో ఈ లాంగ్ జాకెట్స్ కళ్లకు కడుతున్నాయి. అంతేనా రెగ్యులర్‌గా వాడే చిన్న జాకెట్ కాస్తా పొడుగైపోయి అందం రెట్టింపయ్యింది. రాబోయే రోజులన్నీ వేడుకలే. వాటితో పాటే వివాహ వేడుకలు ఉండనే ఉన్నాయి. ఇక పుట్టినరోజులు, పెళ్లిరోజు పార్టీలు సదా మామూలే! ఇలాంటప్పుడు ‘ఎప్పుడూ వేసుకునే అనార్కలీని అదే స్టైల్‌లో ఏం వేస్తాం? ఎప్పుడూ వేసే లెహంగానే ఈ పెళ్లికీ ఎలా మెరిపిస్తాం? ఈవెనింగ్ పార్టీలకు లాంగ్ గౌన్ ఎన్ని సార్లని వేస్తాం?’ అని పెదవి విరిచే అమ్మాయిలు, అతివలు ఈ న్యూ స్టైల్‌లో న్యూ లుక్‌తో వెలిగిపోవచ్చు. అదే లాంగ్ జాకెట్ స్టైల్.
 
 పొట్టి నుంచి... వింటర్ ఫ్యాషన్ వేర్‌గా పేరున్న షగ్స్ ్రనుంచి సంప్రదాయ దుస్తుల మీదకు పొట్టి ఓవర్‌కోట్స్ పుట్టుకువచ్చాయి. ఇవి కాస్తా ఆ తర్వాత కాలంలో పొడవాటి కోటుగా దర్శనమిచ్చాయి.కోటు స్టైల్... మగమహారాజుల సూట్ డిజైన్స్ చూశారా! ఆ తరహాని పోలినట్టుగా ఉండే లా లాంగ్ కోటును మీ శరీరాకృతికి తగిన విధంగా డిజైన్ చేయించుకోండి. పొడవాటి గౌన్ మీదకు ఈ కోటు ధరించండి. స్టైల్‌లో మీరే మహారాణి అనిపిస్తారు.

 ప్రంట్ ఓపెన్... ఫ్లోర్ లెంగ్త్ అనార్కలీ డ్రెస్‌ల మీదకు పూర్తి కాంట్రాస్ట్ లేదా సేమ్ కలర్ లాంగ్ జాకెట్‌ను డిజైన్ చేసుకోండి. స్లీవ్‌లెస్ అనార్కలీ మీదకు నెట్‌డ్ లేదా బెనారస్ మెటీరియల్‌తో తీర్చిదిద్దిన జాకెట్‌పైన ఫుల్ ఎంబ్రాయిడరీని మెరిపించండి. కొత్త డ్రెస్ రెడీ అయిపోతుంది.
 గ్రాండ్‌గా... లాంగ్ జాకెట్ క్లాత్ ఎంత గ్రాండ్‌గా ఉన్నది ఎంచుకుంటే మీ హుందాతనం అంతగా ఇనుమడిస్తుంది. అందుకు పట్టు, బెనారస్, వెల్వెట్, షిమ్మర్ నెట్ మెటీరియల్స్ బాగా నప్పుతాయి. వీటిపైన జర్దోసీ, కుందన్స్, మిర్రర్.. వర్క్ తప్పనిసరి. అయితే, ఎంత స్టైల్‌గా ఉండాలి అనేది మీ మీ అభిరుచులను బట్టి ఉంటుంది.

 డిజైనర్ల ఫేవరేట్ స్టైల్...
 ఈ జాకెట్ స్టైల్‌ను ముందు డిజైన్ చేసినవారిలో భారతీయ డిజైనర్ రోహిత్‌బాల్‌కే మొదటి ఘనత దక్కుతుంది. వెడ్డింగ్ డిజైన్స్‌లో భాగంగా ఈ స్టైల్‌ను ర్యాంప్‌షోలో తళుక్కుమనిపించి అందరినీ ఆకట్టుకునేలా చేశారీ డిజైనర్. ఆ తర్వాత మనీష్ మల్హోత్రా, రితుకుమార్ వంటి డిజైనర్లూ వీటికి మరిన్ని మెరుగులు అద్దారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు సంప్రదాయ దుస్తుల మీదకు ఈ లాంగ్ జాకెట్లు తారలు ధరించి హొయలు ఒలికిస్తున్నారు.                                  - ఎన్.ఆర్
 
 సోహా ఆలిఖాన్

 డిజైనర్ అర్పితా మెహతా డిజైన్ చేసిన ఆకుపచ్చ లాంగ్ జాకెట్‌న ు ధరించి ఈ ఏడాది లాక్మే ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్నారు సోహా. లాంగ్ జాకెట్ మీద అద్దాల మెరుపులు అదనపు ఆకర్షణను తెచ్చాయి.
 
షర్ట్ మీదకు కోటు ధరించడం పాశ్చాత్యుల స్టైల్. దీనినే ఓవర్‌కోట్, బ్లేజర్, జాకెట్.. వంటి పదాలను వాడుతుంటారు. మగవారి సూట్స్‌లో కోటు తప్పనిసరి అనేది మనకు తెలిసిందే! అక్కడ నుంచే రకరకాల మార్పులు చేసుకొని, మన భారతీయ వస్త్ర వైభవంలో మరింత వైభవంగా వెలిగిపోతోంది ఓవర్ కోట్. అదే ఈ లాంగ్ జాకెట్.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement